S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధ్రువతార..లాల్ బహదూర్

1.లాల్ బహదూర్ శాస్ర్తీ భారతదేశంలోనే అత్యంత గొప్ప నాయకులలో ఒకరు. లాల్ బహదూర్ శాస్ర్తీగారు వారణాసిలో కాశీ విద్యాపీఠం నుండి పట్టా పొందినప్పుడు, ఆయనకు ‘శాస్ర్తీ’ అనే బిరుదు ఇచ్చి చివర చేర్చబడింది. ఆయన అసలు పేరేమిటి?

ఎ.లాల్ బహదూర్ ఉపాధ్యాయ్
బి.లాల్ బహదూర్ అగర్వాల్
సి.లాల్ బహదూర్ వర్మ
డి.లాల్ బహదూర్ మిశ్రా

2.లాల్ బహదూర్ శాస్ర్తీగారు జనవరి 10, 1966లో రష్యాలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో కలిసి తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. తాష్కెంట్ ఇప్పుడు ఏ దేశంలో ఉంది?

ఎ.ఉజ్బెకిస్తాన్ బి.కజకిస్తాన్
సి.ఉక్రెయిన్ డి.తజకిస్తాన్

3.లాల్ బహదూర్ శాస్ర్తీ గారు అక్టోబర్ 2, 1904లో జన్మించారు. గాంధీగారి నాయకత్వంలో జరిపిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న శాస్ర్తీగారిని అందరితోపాటు ఖైదు చేసి వెంటనే విడుదల చేయడానికి కారణమేమిటి?

ఎ.అతని తల్లి ఆరోగ్యం బాగులేనందున
బి.అతను క్షమాభిక్ష అడిగినందువలన
సి.అతని వయసు 17 సంవత్సరాలు, మైనర్ కావడం వలన
డి.కాశీ విద్యాపీఠం కులపతి బెయిల్ ఇచ్చి విడిపించినందు వలన

4.‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదాన్నిచ్చి భారతీయులను చైతన్యవంతులను చేసిన శాస్ర్తీగారు ఏ కార్యక్రమానికి నాంది పలికి సఫలీకృతం అవ్వడంతో పాత్ర పోషించారు?

ఎ.హరిత విప్లవం బి.శే్వత విప్లవం
సి.నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు స్థాపన
డి.పైవన్నియు

5.ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు రెండేళ్లు కారాగార శిక్ష అనుభవించిన శాస్ర్తీగారు భారతదేశానికి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఏ కమిటీని ప్రవేశపెట్టిన ఆద్యుడు?

ఎ.రాజకీయాల్లో వారసత్వంపై తొలి కమిటీ
బి.కేబినెట్ మంత్రుల విలాస వ్యయంపై కమిటీ
సి.మంత్రుల అధికార దుర్వినియోగంపై కమిటీ
డి.అవినీతి నిరోధకంపై తొలి కమిటీ

6.తన వివాహంలో కేవలం ఖద్దరు లాల్చీ, పంచె, చరకా మాత్రమే కట్నంగా తీసుకొన్న నిస్వార్థుడు శాస్ర్తీగారి పరిపాలనా దక్షత గూర్చి కింది వానిలో ఏది సరి అయినది?

ఎ.స్వతంత్ర భారత రవాణా మంత్రిగా నియమింపబడినప్పుడు మహిళలను కూడా బస్సు కండక్టర్లుగా నియమించాలని ప్రథమంగా ప్రతిపాదన చేసి నియామకాలు జరిపించారు
బి.ఉద్యమకారులను, నిరసన కారుల సమూహాన్ని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేయవద్దని నీటి ఫిరంగుల ప్రయోగం ప్రవేశపెట్టిన తొలి నాయకుడు
సి.రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన మొదటి రైల్వే మంత్రి
డి.పైవన్నియు

7.హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు, పడవ కోసం డబ్బులివ్వని పేదరికం చేత పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని రోజూ గంగానదిలో ఈదుకొంటూ నదికి ఆవలి వైపున్న బడికి వెళ్లిన శాస్ర్తీ, తన జీవితాన్ని నిజాయితీ, నమ్రత, వినయంతో దేశభక్తి, ప్రజాసేవ కోసం అంకితం చేసిన మహనీయుడు. అతని మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన?

ఎ.మొదటి వ్యక్తి బి.మొదటి పూర్వ ప్రధానమంత్రి
సి.మొదటి భారతీయుడు డి.పైవన్నియు

8.జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం జూన్ 9, 1964న ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన క్రాంతదర్శి లాల్ బహదూర్ శాస్ర్తీ ఏ సంస్థ స్థాపనకు బీజం వేసి ఆయన హయాంలో శంకుస్థాపన చేశారు?

ఎ.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలహాబాద్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తారామతి, మద్రాస్, బాల విద్యామందిర్, లక్నో
బి.ఆల్మట్టి డ్యాం, కర్ణాటక
సి.హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీగా, విభజన తదుపరి జయశంకర్ యూనివర్సిటీగా పేరు మార్చబడింది.)
డి.పైవన్నియు
*

గత వారం క్విజ్ సమాధానాలు
1.ఎ 2.డి 3.బి 4.బి 5.సి 6.బి 7.డి 8.ఎ 9.ఎ 10.డి

-సునీల్ ధవళ 97417 47700