S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగుల రాణి (కథ)

‘ఎంత అందంగా ఉన్నావో...!’
ఆ రోజే విరిసిన కొత్త పువ్వుని మెచ్చుకుంది పాత పువ్వు.
బదులుగా నవ్వింది కొత్త పువ్వు.
‘నేను నినె్నప్పుడూ చూడలేదు. ఇదే చూడటం..’ అంది పాత పువ్వు.
‘నేనెక్కువ లేనక్కా.. తోటల్లో. ఇప్పుడిప్పుడే అందరూ నన్ను వాళ్ల వాళ్ల తోటల్లో వేస్తున్నారు..’ అంది కొత్త పువ్వు.
‘అయితే నిన్ను కొత్తగా కనిపెట్టారేమో..’ అంది పాత పువ్వు.
‘అవునక్కా..!’ అని అంతలోనే...
‘నా తల్లి నుండి నేనూ ఈ రోజే లోకాన్ని చూస్తున్నాను కదక్కా..! అయితే ఉదయం వెలుతురు రాగానే రంగురంగుల రెక్కలున్న ఎవరో ఎగురుతూ వచ్చి నా మీద వాలిందక్కా!.. అబ్బ ఎంత బాగున్నాయో రంగులు అనుకునేంతలో.. నాలోని తేనెలో కొంత తాగేసి పోయిందక్కా!... ఏమంటారక్కా దాన్ని..’ సందేహం అడిగింది కొత్త పువ్వు.
‘వచ్చేసిందా? వచ్చేస్తుంది. దానిని సీతాకోక చిలుక అంటారు. తేనె కోసమే వస్తుందది. తేనె కోసం మరికొన్ని కూడా వస్తాయి. వాటి కోసం మనం, మన కోసం అవి. అయితే చిత్రం ఏమిటో తెలుసా? తేనెని సృష్టించే మనకి ఒక్క రంగే. దాంతోనే అలరిస్తాం మనం. కానీ మన తేనెని తాగే ఆ సీతాకోక చిలుకకి ఎన్ని రంగులో.. చూశావా?’ అంది నవ్వుతూ పాత పువ్వు.
ఆ మాటలకి కొత్త పువ్వు పకపకా నవ్వి..
‘అవునక్కా!.. మరి అది రంగురంగుల పూల మీద వాలుతుంది కదా..! అందుకే అన్ని రంగులూ దానివేనేమో..’ అంది.
‘అమ్మో..! కొత్తగా పూసినా ఎన్ని మాటలు నేర్చావ్. నిజమే సుమా నువ్వు చెప్పింది..’ అంటూ కొత్త పువ్వు తెలివితేటల్ని మెచ్చుకుంది పాత పువ్వు.
ఆనందంతో తలూపింది కొత్త పువ్వు.

-కన్నెగంటి అనసూయ