S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజయ మహోత్సవ దశమి

పుస్తకపాణి, విరించీ మోహనవాణి
అక్షరాభ్యాస ప్రయోగ ప్రసాద భాషాజీవని
సమ్మాల వాఙ్మయ జ్ఞాన బోధానుగ్రహకారిణి
జ్ఞాపకా జ్ఞాపికల సమ్మేళనా సుగంధమరాళి
సంగీత సాహిత్య అలంకార వీణాపాణి
మూలానక్షత్ర సమాయుక్త అంతర్వాహిని
సద్ధర్మ, సద్బుద్ధి, సత్సంగ సాంప్రదాయినీ
శ్రీసరస్వతీ నమామి

శ్రీపతిసిరి, నానావిధ విభూషిత
హరిద్రాచూర్ణ, కుంకుమాలంకృత
ధర్మనిలయ, లోకమాత, సురపూజిత,
శ్రీసూక్త, కనకధారాస్తోత్రప్రియ,
సౌభాగ్యలక్ష్మి, కనుపాప, కల్పవల్లి
మహర్నవమి వౌక్తికశ్రీయ ఆశ్రీతమందార
శ్రీమహాలక్ష్మీ నమామి

అమృతధారా ప్రవాహ సద్భావనాగంగ
సలలిత సాలంకృత దీపికాంతరంగ
కరుణారస భావనాపూరిత పులకిత
దుర్గా, భవానీ నామ శతకోటి పుష్పపూజిత
శక్తి స్వరూపిణి, యుక్తిప్రదాయిని లోకమాత
అష్టమీప్రభాత, ప్రదోష, నిశాలంకార త్రిపురసుందరీ
శాకంబరీ, స్థూలరూపా, అన్నపూర్ణేశ్వరీ
శ్రీదుర్గా నమామి

దశమి శమీవృక్ష ‘శత్రుసంహార అపార నిక్షిప్తశక్తి’
సువర్ణ భాసుర కాంతి శ్రీకృష్ణ రథ సారధ్యానురక్తి
విజయోత్సాహ దుందుభీ నాదానంద, సకలభయహారిణి
సంగ్రామలక్ష్మి దయాపూరిత జనసంక్షేమ జనని
నవరాత్రుల మా పూజకు స్పందించిన భానుప్రభా తేజస్విని
మాలో మమైకమై భక్తి సముద్రాన ఓలలాడించు హితప్రద
శ్రీ విజయలక్ష్మీ నమామి

-అనంత మురళీచంద్ర ఎ.ఎస్.ప్రభాకర్ 99638 87346