S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జగన్మాత స్తోత్రం

జగన్మాత వందన స్తోత్రం.
త్రిపుర సుందరి వందనం.
శ్రీ బాలా త్రిపుర సుందరి :
(1-1)
బాలా రూపిణీ , భండాసుర పుత్ర సంహారిణి ,
బాధా జాగృత, స్వప్న , సుషుప్తి సంచారిణీ ,
భావన్ చిత్త , జ్ఞాన , అహంకార అధిదేవతా ,
బాల్యేషు త్రిపురా , భావయామి బాలా రూప మాతా .
(1-2)
బంగారు కాంతుల బాల
కరుణించిన బ్రతుకు పండు ,
బదహారు కళల పదహారు వర్షముల బాల బహు దయానిధి బ్రహ్మాండ బాల జననికి బ్రణమిల్లు జన్మధన్యము ,
బాల్యేషు త్రిపురా, భావయామి బాలా రూప మాతా.
(1-3)
బంగారు కాంతుల బాల ధ్యానించి ,
పాయసము బెల్లము అన్నము తో జేసి ,
ప్రీతి తో , పూజ గావించి
నైవేద్యమర్పించితి,
బాల్యేషు త్రిపురా , భావయామి బాలా రూప మాతా.
శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరి.
(2-1)
అమ్మా , లలితా పరా భట్టారికా, త్రిపుర సుందరి,
సర్వాంతర్యామినీ సతీ సర్వ శక్తి స్వరూపిణీ ,
ఆది శక్తి , ఆది బ్రహ్మాండ జననీ , ఆద్యంత కారిణి ,
లలితా రూపా , లక్ష్యప్రదాయినీ మాతా, నమోస్తుతే.
(2-2)
రమ్యా రక్త వర్ణ , రాకేందు వదన,
రాజ్నీ , రక్షతి, సర్వ ప్రాణ గమన ,
రంజిత నామ స్మరణ మాత్రే , శ్రీ చక్ర నిలయే ,
లలితా రూపా ,లక్ష్యప్రదాయినీ,
మాతా , నమోస్తుతే.
(2- 3)
పాశాంకుస , త్రిశూల ధారీణీ , పంచతన్మాత్ర సాయికా ,
పరమేశ్వర శక్తి స్వరూపిణీ, పరమ దయామరుూ ,
పూర్ణ , సర్వ శక్తి కళా ప్రపూర్ణ , పూర్ణే ఇందు వదనా ,
లలితా రూపా, లక్ష్య ప్రదాయినీ మాతా , నమోస్తుతే.
శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి.
(3-1)
తల్లీ, విశ్వ జననీ, శ్రీ రాజ రాజేశ్వరీ,
త్రరుూ, త్రయంబికా, త్రిపురసుందరీ ,
తన్ స్మరణ మాత్రేన మాత్రు కరుణ ప్రసాదినీ ,
తత్ భవతి మద్ భావంబున శ్రీ శ్రీ శ్రీ రాజ రాజేశ్వరీ.
(3-2)
భువనేశ్వరి , ఈశ్వరీ పరమ పరమేశ్వరి ,
బ్రహ్మాండ శత కోటి నాయకీ , ఆద్య, అంతః కరణీ ,
పూర్ణ శక్తి స్వరూపిణి, పరం జ్యోతి , పర బ్రహ్మ స్వరూపిణి,
తత్ భవతి మద్ భావంబున
శ్రీ శ్రీ శ్రీ రాజ రాజేశ్వరీ.
(3-3)
మణి ద్వీప వాసిని, సర్వ శక్తి పరివేస్టితో ,
అపరాజితేశ్వరి , యోగమాయ, మహామాయ రూపిణీ ,
భవానీ , భావనా గమ్యా , ప్రాణి కోటి మాత్రుకా,
తత్ భవతి మద్ భావంబున
శ్రీ శ్రీ శ్రీ రాజ రాజేశ్వరీ.
త్రి శక్తి స్వరూప వందనం.
శ్రీ మహా లక్ష్మి :
(4-1)
వైకుంఠ విలాసిని , విష్ణు హృదయ వాసిని ,
సువర్ణ వర్ణా , సదా ప్రసన్న , స్థితి కారిణి ,
పద్మ నిలయ , పద్మ భూషిత, పద్మ హస్తా ,
శ్రీ లక్ష్మీ , అష్ట లక్ష్మీ , మహాలక్ష్మీ శరణం దేహి మమ...
(4-2)
క్షీరాబ్జ్య పుత్రికా , హరి వల్లభాం, శ్రీకరి,
అష్టైశ్వర్య ప్రదాయిని , ఆనంద దాయిని, శుభకరి ,
జయా , విజయాం , ఇందువదనాం , క్షేమంకరీ,
శ్రీ లక్ష్మీ , అష్ట లక్ష్మీ, , మహాలక్ష్మీ శరణం దేహి మమ.
(4-3)
కమల వాసిని, కమల హాసని, కమాలేక్షణీ ,
చాంచల్య , చంద్ర హాస , చంద్ర సహోదరీ ,
శ్రీ విష్ణుః హృదయ వాసిని, విశ్వమాతా ,
శ్రీ లక్ష్మీ , అష్ట లక్ష్మీ , మహా లక్ష్మీ శరణం దేహి మమ...
శ్రీ సరస్వతి :
(5-1)
బ్రహ్మ పత్నీం , వాణీం ,
వీణాపాణీం ,
సర్వ శాస్త్ర ఉద్ధారీణీమ్ , సర్వకళా మరుూం ,
హంసవాహినీం , విద్యాం, జ్ఞాన ప్రదాయినీం ,
మాత్రే బ్రహ్మలోక వాసినీం కరోమి కరుణామ్...
(5-2)
వాగ్దేవీ , విలసిత విజ్ఞాన ప్రదాయినీం ,
శే్వత వస్త్ర ధారిణీమ్ ,
సుధామరుూం ,
పరాం , పరాశక్తిని , పరబ్రహ్మ స్వరూపిణీ ,
మాత్రే బ్రహ్మలోక వాసినీం
కరోమి కరుణాం..
(5-3)
సరస్వతీ , సర్వ సాహిత్య సంగీత విభావరీం ,
సాధు మహాభాగే , సాధు జన సంరక్షణీమ్ ,
సర్వేశ్వరీం , సదా సులభ ప్రసన్నాం ,
మాత్రే బ్రహ్మలోక వాసినీం
కరోమి కరుణామ్....
శ్రీ పార్వతి.
(6-1)
జననీ , గిరిరాజ సుతాం , పరమేశ్వర వామ భాగినీ ,
చండీ , ప్రచండికా, చాముండేశ్వరీ ,
త్రిశూల ధారిణీ , త్రిలోక సంచారిణీ,
నానా శక్తి రూప మరుూ , నమామి మాతా శివశక్తీం.
(6-2)
అభేద్య గుహ్యానీం , గుహ్యాగుహ్యా, వ్యక్తావ్యక్త,
సదా కారుణ్య హృదయ, సంతోష దాయకాం ,
మహేశ్వరీ , మహా మహా శక్తి స్వరూపిణీ ,
నానా శక్తి రూపమారుూ , నమామి మాతా శివ శక్తీం.
(6-3)
వైష్ణవీ , మహామాయా , మహాశక్తి సంపన్న ,
అపర్ణా , ప్రపూర్ణ ,పూర్ణ ప్రఫుల్ల వదనాం ,
సర్వేశ్వరీ, సుహాసినీ, సువాసిన్యాం సౌభాగ్య దాయినీ,
నానా శక్తి రూపమరుూ , నమామి మాతా శివ శక్తీం...
నానా రూప జగన్మాత వందనం.
1.
గౌరీ, మంగళ గౌరీ , మాతా మహామాహాన్విత శక్తినీ ,
సదా సుప్రన్న , అర్ధనారీశ్వరీ , సువాసినీ ,
కామేశ్వరీ , కామిత వర దాయినీ ,
కారుణ్య నిలయే, కైలాస వాసిని, నమస్తే నమస్తే నమః
2.
శ్రీ దుర్గా , విశిష్ట శక్తి స్వరూపా, మాతా ,
శ్రీ దుర్గా , దుర్భేద్య శక్తి స్వరూపిణి ,
శ్రీ దుర్గా, నవ దుర్గా ప్రకీర్తితా , కారుణ్య దాయిని ,
శాంకరీ, సాధ్వీ , మాతే దుర్గా శరణం ప్రపద్యే.
3.
కాళీ , మహాకాళీ , భద్రకాళీ , తల్లీ ,
కరే రక్త సిక్త ఆయుధ ధారిణీ ,
క్రోధో చిత్త భయంకర రూపిణీ ,
కాళీ , ఉజ్జయినీ విలసిత, కరుణా ప్రపద్యే.
4.
కాంచీపుర వాసినీం మాతా కామాక్షీ దేవతాం,
కాశీ క్షేత్ర అధిష్టాన విశాలాక్షీ , మాతా అన్నపూర్ణా ,
మదురై నగర రాజ్నీ మాతా మీనాక్షీం ,
జగన్మాత, త్రిభువన భూతీకరీం శిరసాం
శత సహస్ర వందనం.
5.
ఉజ్జయినీ పాలినీం మహాకాళీ రూపినీం ,
ఆలంపూర నివాసిన్యాం జోగులాంబా దర్శనీం,
శాంకరీం అవతార శ్రీలంకా ప్రశస్త్య ,
జగన్మాత , త్రిభువన భూతీకరీం శిరసాం శత వందనం.
6.
ప్రద్యుమ్న నగర శృంఖలా దేవి రూపిణీ,
శ్రీ శైలస్య అధిష్టాన శ్రీ భ్రమరాంబికా ,
పిఠాపుర వాసిన్య పురూహుతికా మాత దేవీ ,
జగన్మాత , త్రిభువన భూతికరీం శిరసాం శత సహస్ర వందనం.
7..
వైతరణి నది తీర ఓడ్య పుర గిరిజా దేవి పాలితం ,
దాక్షారామ మాణిక్యాంబా ప్రకీర్తితం ,
హరిక్షేత్రంచ కామరూప దేవీం ,
జగన్మాత , త్రిభువన భూతికరీం శిరసాం శత సహస్ర వందనం.
8.
జగన్మాత, జగదోద్ధారణ కారణ,
నానావతార రూపిణీ , శివ శక్తీ ,
సృష్టి స్థితి లయ కారిణి , శ్రీ చక్ర వాసిని ,
తల్లీ , మాతా , జననీ, కరుణామ్ ప్రపద్యే.
9.
అమ్మా , కారుణ్య హృదరుూ,
భక్తి తో స్మరణ జేసి ప్రార్థించిన
పాపములు బాపి, కాచు తల్లీ ,
వందనములు నీకు జగన్మాత,
వర్ధిల్లు తల్లి.

-నండూరి రామచంద్రరావు.. 9949188444