S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్విజ్....

1.స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొంటూనే ఉన్నత విద్య లభ్యసించి ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందిన దుర్గాబాయి ఢిల్లీలో ఏ కళాశాల స్థాపనకు పాటుపడి సఫలీకృతమయ్యేరు?
ఎ.దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కళాశాల
బి.దేశ్‌ముఖ్ కళాశాల
సి.ఆంధ్ర కళాపరిషత్ కళాశాల
డి.శ్రీ వెంకటేశ్వర కళాశాల
2.్ఢల్లీలో నివసిస్తున్న తెలుగు పిల్లల విద్యా అవసరాల కోసం డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1948లో ఏ విద్యాలయం స్థాపించారు?
ఎ.గిడుగు ఉన్నత పాఠశాల బి.తెలుగు గర్ల్స్ హైస్కూల్
సి.ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ డి.బ్రౌన్ హైస్కూల్
3.న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త మరియు ఒక స్వాతంత్య్ర సమరయోధురాలు ఐన డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఏ పదవి నలంకరించారు?
ఎ.రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీ సభ్యురాలు
బి.్భరత ప్రణాళికా సంఘం సభ్యురాలు
సి.నేషనల్ కౌన్సిల్ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ యొక్క మొదటి చైర్‌పర్సన్
డి.పైవన్నియు
4.1923లో కాకినాడలో ఖాదీ ఎగ్జిబిషన్‌లో, వాలంటీర్‌గా ఉన్న దుర్గాబాయి సందర్శకులకు సరైన టికెట్లు లేని కారణంగా పండిట్ నెహ్రూను ప్రవేశించకుండా అడ్డుకున్న ధైర్యవంతురాలు, నిజాయితీపరురాలు. దుర్గాబాయి నిజాయితీకి నిదర్శనమైన విషయమిది?
ఎ.తన భర్త మరియు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులుగా ఉన్నప్పుడు వారిలో ఒకరు కేవలం ఒక్క రూపాయి మాత్రమే నెలకు జీతంగా తీసుకునేవారు
బి.వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించడానికి నిరాకరించారు
సి.పెద్ద సంఖ్యలో నగదు, నగలను సేకరించి ఓ బహిరంగసభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు
డి.పైవన్నియు
5.మహిళా సాధికారత, సామాజిక కార్యక్రమాలకు పాటుపడిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఈ కింది వానిలో ఆమె స్థాపించినవేవి?
ఎ.కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, ఢిల్లీ బ్లైండ్ స్కూల్
బి.ఆంధ్ర మహిళా సభ సి.హిందీ బాలికా పరిషత్
డి.పైవన్నియు
6.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అసలు పేరేమిటి?
ఎ.దుర్గా బందోపాధ్యాయ్ బి.మంగిపూడి దుర్గావతి
సి.బెన్నూరి దుర్గాబాయమ్మ డి.దుర్గావతి ఛటర్జీ
7.దుర్గాబాయి దేశ్‌ముఖ్ చేసిన రచనలేవి?
ఎ.చింతామన్ అండ్ ఐ బి.ది స్టోన్ దట్ స్పీకత్
సి.అమాచి కథ డి.పైవన్నియు
8.దుర్గాబాయి భర్త గురించి ఈ కింది వానిలో ఏది సరియైనది?
ఎ.ఆమె చింతామన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ అనే మరాఠీ వైకతిని రెండవ వివాహం చేసుకున్నారు
బి.చింతామన్ దేశ్‌ముఖ్ భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ మొదటి భారతీయ గవర్నర్
సి.చింతామన్ దేశ్‌ముఖ్ 1950-1956 మధ్య భారతదేశ కేంద్ర కేబినెట్‌లో ఆర్థిక మంత్రి
డి.పైవన్నియు
9.దుర్గాబాయి గారి ధైర్య సాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు మొక్కవోని ధైర్యం, పోరాట పటిమ చూసి ఇందిరాగాంధీ ఏ బిరుదునిచ్చి సత్కరించారు?
ఎ.ఐరన్ లేడీ ఆఫ్ కాకినాడ
బి.మదర్ ఆఫ్ సోషల్ వర్క్
సి.బోల్డ్ లేడీ ఆఫ్ ఆంధ్ర
డి.పైవన్నియు

గత వారం క్విజ్ సమాధానాలు:
-------------------------------------
1.డి 2.సి 3.బి 4.డి 5.సి 6.డి 7.సి 8.ఎ 9.సి 10.ఎ

-సునీల్ ధవళ 97417 47700