S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేశానికే బంధువు..

1.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నాయకుడు చిత్తరంజన్ దాస్ గారి గూర్చి కింది వాటిలో ఏది సరియైనది?

ఎ.కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్‌కి తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు
బి.కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీకి ప్రథమ ప్రిన్సిపాల్‌గా నియమింపబడ్డారు
సి.కలకత్తా హైకోర్టుకి మొట్టమొదటి న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు
డి.పైవన్నియు

2.క్రింది వానిలో చిత్తరంజన్ దాస్ జ్ఞాపకార్థం పేరు పెట్టిన సంస్థ ఏది?

ఎ.చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్
బి.చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్, దేశబంధు మహిళా కళాశాల, కలకత్తా
సి.చిత్తరంజన్ పార్క్, న్యూఢిల్లీ
డి.పైవన్నియు

3.దేశ ప్రజల శ్రేయస్సు కొరకు, చిత్తరంజన్ దాస్ చేసిన కృషి చిరకాలం భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆయన స్మారక నాణెం రూ.2 ఆర్‌బిఐ విడుదల ఎప్పుడు చేసింది?

ఎ.1970
బి.1998
సి.2006
డి.2014

4.సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు చిత్తరంజన్ దాస్‌ని, ఆయన భార్య, కుమారుడుతో ఆరు నెలలు ఖైదు చేశారు. చిత్తరంజన్ దాస్ ఎప్పుడు జన్మించారు?

ఎ.5 నవంబర్ 1902
బి.4 నవంబర్ 1880
సి.5 నవంబర్ 1870
డి.3 నవంబర్ 1897

5.సహాయ నిరాకరణోద్యమం వైఫల్యం చెందాక భారత జాతీయ కాంగ్రెస్‌కు, గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా దాసుగారు ఏ పార్టీ స్థాపించారు?

ఎ.ప్రజామోర్చా
బి.దేశబంధు పార్టీ
సి.స్వరాజ్ పార్టీ
డి.బెంగాల్ కాంగ్రెస్

6.చిత్తరంజన్ దాస్ జూన్ 16, 1926 నాడు అస్తమించారు. కోలకతాలోని తన ఇంటిని, భూమిని మహిళల జీవితాలను మెరుగుపరిచే సంస్థ కోసం విరాళంగా ఇచ్చారు. ఇప్పుడా ప్రదేశంలో ఏ సంస్థ స్థాపించబడింది?

ఎ.చిత్తరంజన్ దాస్ మహిళా కుటీర పరిశ్రమ
బి.చిత్తరంజన్ దాస్ బాలికా విద్యాలయం
సి.చిత్తరంజన్ దాస్ వితంతు గృహం
డి.చిత్తరంజన్ సేవాసదన్ ఆసుపత్రి

7.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా వారి అరాచకాలకు నిరసన వ్యక్తం చేయడానికి చిత్తరంజన్ దాస్ ఏ పత్రికని నడిపారు?

ఎ.కోల్‌కతా పోస్ట్
బి.లిబర్టీ
సి.ఫ్రీడమ్
డి.డెమోక్రసీ

8.లండన్‌లో బారిస్టర్ చదువుకొన్న చిత్తరంజన్ దాస్, అలీపూర్ బాంబు కేసులో అభియోగాలు ఉన్న ఏ ప్రముఖ వ్యక్తి తరఫున వాదించి అతన్ని నిర్దోషిగా కేసు నుంచి రక్షించారు?

ఎ.కేశబ్ ఛటర్జీ
బి.చంద్రశేఖర్ ఆజాద్
సి.రామ్‌ప్రసాద్ బిస్మిల్
డి.అరబిందో ఘోష్

9.చిత్తరంజన్ దాస్ డార్జిలింగ్‌లో అనారోగ్యంగా ఉన్నప్పుడు గాంధీ పరామర్శించి వెళ్లిన కొన్ని రోజులకే దాస్ మరణిస్తే శవయాత్ర గాంధీ ఆధ్వర్యంలో జరిగింది. చిత్తరంజన్ దాస్ ప్రియ శిష్యుడు ఎవరు?

ఎ.రాజేంద్ర లాహిరి
బి.అరబిందో ఘోష్
సి.జవహర్‌లాల్ నెహ్రూ
డి.సుభాష్ చంద్రబోస్

10.ఇంజన్ల తయారీ యూనిట్ పేరు చిత్తరంజన్ దాస్‌గారి గౌరవార్థం చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌గా పెట్టారు. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో చివరిగా తయారైన స్టీమ్ ఇంజన్ పేరేమిటి?

ఎ.చిత్తరంజన్
బి.అంతిమ సితార
సి.గ్లోరీ
డి.ది లాస్ట్ క్వీన్
====================================================

గత వారం క్విజ్ సమాధానాలు

1.సి 2.డి 3.డి 4.ఎ 5.డి 6.సి 7.సి 8.సి 9.సి 10.సి

-సునీల్ ధవళ సెల్: 97417 47700