S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (11-11-2018 నుంచి 17-11-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. ఆధ్యాత్మిక, ధార్మిక ప్రయాణాదులకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నైరాశ్యం కూడదు. సోమవారం పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దూర ప్రయాణాలు. మంగళవారం అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. స్నేహానుబంధాలు ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తిలో సమస్యలుంటాయి. బుధవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతోషం పెరుగుతుంది. సౌఖ్యంగా గడుపుతారు. గౌరవం పొందుతారు. గురవారం లాభాలు సంతోషాన్నిచ్చినా ఘర్షణ తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఊహించని సంఘటనలు. శుక్రవారం అన్ని పనుల్లో ప్రయోజనాసక్తి. ఊహలు ఎక్కువ. ఆహార విహారాలపై దృష్టి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతృప్తి. సృజనాత్మకత విస్తరిస్తుంది. వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలు, ఒత్తిడులు చికాకులున్నా క్రమంగా మార్పులకు అవకాశం. సోమవారం సంప్రదింపులకు అనుకూలం. స్ర్తిజన సహకారం లభిస్తుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. మంగళవారం అధికారుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. కొన్ని వార్తల వల్ల ఆందోళన పెరగవచ్చు. బుధవారం ఖర్చులు పెట్టుబడులుంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. పోటీ రంగంలో విజయానికి కాలం వెచ్చిస్తారు. గురువారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. నూతన పరిచయాల వల్ల కోపతాపాలు అధికమయ్యే సూచనలు. శుక్రవారం వ్యర్థంగా కాలం ధనం వెచ్చిస్తారు. అపోహలకు అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. కుటుంబంలో ఒత్తిడులు. మాటలలో నైరాశ్య ధోరణి. ఆర్థిక నిల్వల విషయంలో అప్రమత్తం. సోమవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనులకు అనుకూలం. పెద్దల ఆశీస్సులు. కొత్త పనుల నిర్వహణ. మంగళవారం అధికారిక ప్రయోజనాలున్నా కొంత శ్రమ తప్పదు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. బుధవారం ఊహించని ఇబ్బందులకు అవకాశం. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అనుకోని సంఘటనలు. గురువారం సోదర వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. శుక్రవారం సంప్రదింపులుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఒక వార్తవల్ల అయోమయానికి గురి కావచ్చు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నూతన నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. దానధర్మాల వల్ల మేలు. సోమవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. ఘర్షణ భావనలుంటాయి. తొందరపాటు కూడదు. పోటీ రంగంలో గుర్తింపు. మంగళవారం వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. లక్ష్యాలపై దృష్టి. ఉన్నత విద్యా వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. దూర ప్రయాణాలు. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గుర్తింపు. పదోన్నతులున్నా ఒత్తిడులు తప్పవు. తొందరపాటు కూడదు. శుక్రవారం కార్యనిర్వహణ శక్తి. దగ్గరి ప్రయాణాలు. సహకారం లభించినా జాగ్రత్త అవసరం. సోదరులతో జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం సౌకర్యాలు మెరుగు చేసుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. ఆలోచనల్లో ఆందోళన ఉంటుంది. శ్రమతో కార్యక్రమాలు. సోమవారం కుటుంబంలో సంతోషం. మాట తీరు వల్ల అందరిలో సంతృప్తి. గృహ వాహనాది సౌకర్యాలుంటాయి. మంగళవారం మాటల వల్ల ఎదుటి వారు ఇబ్బంది పడే సూచనలు. ఆర్థిక నిల్వలను కోల్పోకుండా చూసుకోవాలి. బుధవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలు. సంతాన వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు. గురువారం వ్యతిరేకతలు, పోటీల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సృజనాత్మకత బాగా ఉన్నా ఒత్తిడులుంటాయి. శుక్రవారం చికాకులున్నా గుర్తింపు లభిస్తుంది. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. వ్యవహారాల్లో విజయం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. నిర్ణయాదుల్లో కొంత అసంతులిత స్థితి. కొంత నైరాశ్య భావన. పరామర్శలుంటాయి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. గుర్తింపు లభిస్తుంది. మంగళవారం పెద్దల సహకారం కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. లాభాలున్నా శ్రమాధిక్యం. కార్యనిర్వహణ. బుధవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. అనేక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. గురువారం కుటుంబ, ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనంపై దృష్టి. శుక్రవారం పరిచయాలు అనుబంధాల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం పరిచయాలు భాగస్వామ్యాల్లో జాగ్రత్త. మీ కాలం ధనం వ్యర్థం అయ్యే సూచనలు. నిరాశా ధోరణి. స్నేహానుబంధాలను కోల్పోకుండా జాగ్రత్త పడాలి. సోమవారం అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. భాగస్వామి, సంతానంతో కలిగి సంతోషంగా గడుపుతారు. మంగళవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ప్రణాళికల విషయంలో జాగ్రత్త. అనుకోని సమస్యలకు అవకాశం. బుధవారం ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో తెలియని సమస్యలకు అవకాశం. గురువారం ఉన్నత విద్యా వ్యవహారాల్లో ఇబ్బందులు. వ్యవహారాల్లో ఆటుపోటులు తప్పకపోవచ్చు. ఘర్షణలుంటాయి. శుక్రవారం కుటుంబంలో ఇబ్బందులు. లక్ష్యాల సాధనలో సమస్యలను ఎదుర్కొంటారు. మాట తీరులో జాగ్రత్త.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం సంప్రదింపులుంటాయి. సోదరవర్గ సహకారం లభిస్తుంది. సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోమవారం నిర్ణయాదులకు అనుకూలం. సంతోషంగా గడుపుతారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. మంగళవారం శారీరక ఒత్తిడులుంటాయి. గృహ వాహనాది సౌకర్యాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. శ్రమాధిక్యం. బుధవారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. పదోన్నతులు. సంతోషాదులు ప్రభావితం చేస్తాయి. గురువారం సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శుక్రవారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం అన్ని పనుల్లో లాభాలపై దృష్టి. ప్రయోజనాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఖర్చులు కూడా అధికం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే సూచనలు. సోమవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. విహార యాత్రలకు అవకాశం. ఉన్నత విద్యలపై దృష్టి. మంగళవారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి ఆశించినంతగా దొరకక పోవచ్చు. ప్రయాణాలుంటాయి. బుధవారం వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. పోటీ రంగంలో విజయం. గురువారం నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. తొందరపాటు కూడదు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. శుక్రవారం వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. బాధ్యతలు అధికం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలు అధికం. పరిచయాల వల్ల ఇబ్బందులు. పోటీ రంగంలో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాదుల్లో ప్రశాంతత అవసరం. భాగస్వామితో ఒత్తిడులు. సోమవారం సౌకర్యాలు పెంచుకుంటారు. కాలం, ధనం, శ్రమ సౌఖ్యంగా గడపడానికి వినియోగిస్తారు. గుర్తింపు కోసం ప్రయత్నం. మంగళవారం ఆహార విహారాల్లో జాగ్రత్త. భాగస్వామ్యాల్లో శ్రమ తప్పకపోవచ్చు. వాహనాది సౌకర్యాల వల్ల ఇబ్బందులు. బుధవారం నిర్ణయాదులకు అనుకూలం. పరిచయాలు విస్తరిస్తాయి. నూతన వ్యవహారాలు. సంతోషాలపై దృష్టి. గురువారం అనుకోని సమస్యలు. చిన్నచిన్న ప్రమాదాలకు అవకాశం. భాగస్వామితో అప్రమత్తంగా మెలగాలి. శుక్రవారం నిర్ణయాదుల్లో ఊహలు అధికం. అనేక కార్యక్రమాలపై దృష్టి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాటల్లో నైరాశ్యం కూడదు. సహకారం ఆశించినంతగా లభించకపోవచ్చు. సంప్రదింపుల వల్ల నిల్వధనంపై ప్రభావం. సోమవారం విందులు వినోదాలు విహారాలకు వెచ్చిస్తారు. సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి లభిస్తుంది. సంతృప్తి. మంగళవారం అధికారిక వ్యవహారాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యర్థమైన ప్రయాణాలుంటాయి. బుధవారం ఉన్నత లక్ష్యాలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలకు అవకాశం. అన్ని పనుల్లోనూ అనుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. గురువారం ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌఖ్య లోపం. శారీరక ఒత్తిడులుంటాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం సుదూర ప్రాంతాల ప్రయాణాల ప్రణాళికలు. అసంతృప్తికి అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలలో అనుకూలత. లాభాలు ఇబ్బంది పెట్టే అవకాశం. సామాజిక గౌరవం పెరుగుతుంది. సోమవారం అన్ని కార్యక్రమాల్లో జాగ్రత్త. కొన్ని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలు. ప్రయోజనాలు. సంతోషం. మంగళవారం అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ. కొన్ని లాభాలున్నా సంతోషం ఉండదు. బుధవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. నూతన ప్రణాళికలుంటాయి. గురువారం వ్యర్థంగా పెట్టుబడులు, ఖర్చులుంటాయి. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. ప్రయాణాల్లో ఒత్తిడులు. శుక్రవారం ఆలోచనల్లో వత్తిడులు. సృజనాత్మక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. ప్రయాణాదులకు అవకాశం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744