S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యానవన పనులను పరిశీలించిన కలెక్టర్

కోవూరు, నవంబర్ 13: ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో మొదటిసారిగా గ్రామీణ ఉద్యానవనంలో జరుగుతున్న పనులను కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మంగళవారం మండలంలోని పాటూరు గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉద్యానవనం ఉండాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. జడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి కోరిక మేరకు ఉపాధిహామి పనుల కింద మంజూరైన నిధులే కాకుండా మరో రూ.2లక్షలను కన్వర్జెన్సీ నిధుల నుంచి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన కాలనీలో లెవలింగ్ చేయించి మొత్తం 119మందికి ఇళ్లు మంజూరు చేయాలని జడ్పీటీసీ కోరారని, ఈ మేరకు ఇళ్లను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు పండించిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్లాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ వసతిగృహం పక్కన ఉన్న పంచాయతీ స్థలంలో ధాన్యం ఆరబోసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. గ్రామంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవన నిర్మాణం కోసం రూ.1కోటి రూపాయలు మంజూరుచేయాలని ప్రభుత్వానికి ప్రతిప్రాదనలు పంపామని, ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా మంజూరయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు జడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, డ్వామా పీడీ బాపిరెడ్డి, ఏపీడీ శ్రీహరి, ఎంపీడీవో జాలిరెడ్డి, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసులు, సీడీపీఓ నాగమల్లీశ్వరి, పంచాయితీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జగదీష్, హౌసింగ్ ఏఈ రవికుమార్, టీడీపీ నాయకులు దారా విజయ్‌బాబు, గునపాటి రవీంద్రరెడ్డి, ఆదాల శివారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వంగపాటి వేణు, గరికపాటి అనీల్, ఇంటూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు
* మత్స్యశాఖ జేడీ శ్రీహరి హెచ్చరిక
తడ, నవంబర్ 13: గజ తుఫాను కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జేడీ పి.శ్రీహరి తెలిపారు. మంగళవారం తడ మండలంలోని మత్స్యకార గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భీములవారిపాళెం వద్ద పులికాట్ సరస్సును ఆయన సందర్శించి మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే తిరుగు ప్రయాణమవ్వాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని తెలిపారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్లిఉంటే తిరిగి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులను హెచ్చరించారు. అనంతరం వాటంబేడులో రూ.4.50లక్షల రూపాయల వ్యయంతో చేపలు ఆరబెట్టేందుకు నిర్మించిన ప్లాట్‌ఫాంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీవో శ్రీనివాసులు, జెడ్పీటీసీ శ్రీ్ధర్, స్థానిక మత్స్యకారులు ఉన్నారు.