S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు

నెల్లూరు, నవంబర్ 13: మహిళలకు భద్రతతో కూడిన సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు అందరూ కృషి చేయాలని అందుకోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు ప్రారంభించిందని ఎస్‌సి ఐశ్వర్య రస్తోగి తెలిపారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న పోలీస్ కవాతు మైదానంలో మంగళవారం మహిళల భద్రత కోసం ఉద్దేశించిన మహిళా పోలీస్‌లతో కూడిన రక్షక్ బృందాలకు ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం బాగా విస్తరించటంతో పాటు అనేక కారణాలతో మహిళలపై నేరాల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అమ్మాయిలు, మహిళలపై ఈవ్‌టీజింగ్ వంటి చేష్టలతో పాటు అత్యాచార ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి చర్యలకు చరమగీతం పాడటానికి మహిళా పోలీస్‌లతో కూడిన రక్షణ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాల ప్రధానోద్దేశం బహిరంగ ప్రదేశాలలో నేరాలను అదుపు చేయడమేనన్నారు. వీరు సాధారణ దుస్తులు ధరించి నిఘా కెమెరాలు సేకరించే సమాచారం మేరకు ఆయా ప్రదేశాలలో సంచరిస్తారన్నారు. కమాండ్ కంట్రోల్‌లోని నిఘా కెమెరాల సమాచార సంఘటనలకు సంబంధించిన నేరగాళ్లను గుర్తించి సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారన్నారు. ఈవ్‌టీజింగ్‌కు సంబంధించి తొలుత కౌనె్సలింగ్ ఇచ్చి వివరాలు మాత్రమే సేకరిస్తామని మరోసారి అదే వ్యక్తులతో అలాంటి చర్యలు పునరావృతమైతే, అకృత్యాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందుకోసం విస్తృత ప్రచారం నిర్వహించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. తొలుత జిల్లా కేంద్రంలో ఈ రక్షక్ బృందాలు ఏర్పాటు చేశామని ఈ చర్యలు విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్ కేంద్రాలలో ప్రారంభిస్తామన్నారు. కళాశాలలు, సినిమాహాళ్లు తదితరచోట్ల బృందాల నిర్వహణ తీరుతెన్నులపై సలహాలు, సూచనలు సేకరిస్తామన్నారు. బాలికలు, విద్యార్థినులు, మహిళలకు సైగలు చేసినా, అనవసర ఫోన్ కాల్స్ చేసినా, ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినా, అనుచిత రీతిలో తాకినా నేర సమాచారాన్ని 100, 9390777727 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి, పలువురు డిఎస్‌పిలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు.