S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

షార్‌లో సర్వం సిద్ధం

సూళ్లూరుపేట, నవంబర్ 13: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఇస్రో తొలి భారీ సమాచార ఉపగ్రహాన్ని పంపించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగం ఇస్రోకు ఒక సవాలే కాకుండా భారత శాస్తవ్రేత్తల సాంకేతిక సామర్ధ్యానికి పరీక్షలాంటిది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 డి 2 ప్రయోగంతో సందడి వాతావరణం నెలకొంది. ఐదు టన్నుల బరువు గల రాకెట్‌ను అంతరిక్షంలోకి తొలిసారిగా పంపిస్తుండడంతో అందరి చూపు షార్ వైపే పడింది. ఇటు ఇస్రో శాస్తవ్రేత్తలతో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. షార్‌ను సీఐఎస్‌ఎప్ బలగలాలు భద్రత గుప్పిట్లోకి తీసుకున్నాయి. శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్న అడవులను సైతం జల్లెడ పట్టి గాలిస్తున్నారు. తీరప్రాంత గ్రామాల్లో, సముద్ర జల మార్గాల్లో మెరైన్ సిబ్బంది నిఘా పెట్టారు. షార్ నుండి ఇప్పటివరకు 67 ప్రయోగాలు చేపట్టారు. ఇది 68వ ప్రయోగం కాగా కమ్యూనికేషన్ రంగానికి చెందిన అత్యంత బరువైన ఉపగ్రహాన్ని పంపించడం విశేషం. ఇప్పటి వరకు ఇంత భారీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించలేదు. ఇది ప్రథమం కావడంతో యావత్ ప్రపంచ దేశాలన్నీ షార్ వైపు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మన శాస్తవ్రేత్తల సామర్ధ్యానికి కూడా ఇది ఒక పరీక్షలాంటిది. గత ఏడాది జీశాట్-19 ఉపగ్రహాన్ని పంపించి ఉన్నారు. దాదాపు 18 సంవత్సరాల శాస్తవ్రేత్తల కఠోర శ్రమతో రాకెట్‌ను రూపొందించి ప్రయోగించడం మరో విశేషం. ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం వల్ల విదేశాలు సైతం మన వాహక నౌకల నుండే పంపించేందకు క్యూ కడుతున్నాయి. దీంతో భారత్ వాణిజ్యపరంగా ముందుకు దూసుకెళ్తుతోంది. ప్రపంచ దేశాలల్లో ఏ శాస్తవ్రేత్తలు చేయని సాహసానికి మన శాస్తవ్రేత్తలు పూనుకున్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, రష్యా, చైనా, జపాన్ వంటి అగ్ర దేశాలు కూడా ఇంతవరకు ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపించేందుకు సాహసం చేయలేదు. ఈ ప్రయోగం మన శాస్తవ్రేత్తల పనితీరుకు నిదర్శనం. బుధవారం సాయంత్రం 5:08 గంటలకు షార్ నుంచి జీశాట్-29 ఉపగ్రహన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ2 రాకెట్ మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం మధ్నాహ్నం 2:50 గంటలకు ప్రారంభమై సజావుగా సాగుతోంది. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు సిద్ధం చేశారు. ఇస్రో చైర్మన్‌తో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.
చెంగాళమ్మకు ఇస్రో చైర్మన్ పూజలు
షార్ నుంచి ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 ప్రయోగం విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారి చెంత రాకెట్ నమూనాను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్‌కు ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సన్మానించి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. చైర్మన్ శివన్‌తో పాటు శాస్త్ర సాంకేతిక కార్యదర్శి (సైంటిఫిక్ సెక్రటరీ) ఉమామహేశ్వరావు ఉన్నారు.

ఊసరవెళ్లి సిగ్గుపడేలా బాబు రాజకీయాలు
* కుంభకోణాల్లో లోకేష్ హస్తం ఉందనే భయం * బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌డ్డి ధ్వజం
నెల్లూరు టౌన్, నవంబర్ 13: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికార వ్యామోహంతో ఊసరవెళ్లి సిగ్గుపడేలా రాజకీయాలు చేస్తున్నారని, రంగులు మారుస్తూ, రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారదాహంతో ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు ఇందిరాగాంధీ చెబితే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికాడని, ఆ తరువాత మామ ఎన్టీఆర్ పంచన చేరిన ఆయన, అధికారం కోసం మామకే వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని ఎన్టీ రామారావు స్వయంగా తెలిపారన్నారు. వైస్రాయ్ హోటల్‌లో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2014కు మునుపు టీడీపీ మద్ధతుతోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను తన్ని తరిమేయమన్న చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చేతులు కలపడం అనైతిక చర్యగా అభివర్ణించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం అవినీతి తదితర సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమని, అలాంటి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తుంటే లోకేష్ అనేక కుంభకోణాల్లో ఉన్నాడని, వాటిని పక్కదారి పట్టించేందుకే ఇలా చంద్రబాబునాయుడు అశాంతితో, భయంతో మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఆయన బినామీలు కూడా గజగజ లాడిపోతుత్నారని, తనను తాను కాపాడుకునేందుకే చంద్రబాబు కుఠిల యత్నాలు మొదలుపెట్టారన్నారు. పన్నులు ఎగ్గొట్టే వారిపై ఐటీ దాడులు చేస్తుంటే వాటిని ఆపాలని చూసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అవినీతికి పాల్పడేవారు భయపడటం సహజమని, మరి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అధికారంలో ఉన్న బీజేపీని చూస్తే అవినీతిపరుల గుండెల్లో భయం పుడుతోందన్నారు. పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకే ఐటీ దాడులు చేస్తోందని గుర్తుచేశారు.
23మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న అనైతిక వ్యక్తి చంద్రబాబు
వైకాపా నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేసి స్పీకర్‌తో దొడ్డిదారిన వారిని ఫిరాయింపుల చట్టం నుంచి పక్కకు తప్పించారని సురేష్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేసారు. టీడీపీ ప్రభుత్వానికి ముస్లిం మహిళల పాపం తగులుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది ప్రధాని నరేంద్రమోదీయే అన్నారు. పంచాయతీ ఎన్నికలు పెట్టే దమ్ములేని చంద్రబాబుకు వ్యవస్థల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసింది కూడా ఆయనేనన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను పచ్చచొక్కాలకు పందేరం చేసారని, ప్రభుత్వ కార్యాలయాలను కూడా టీడీపీ కార్యాలయాలుగా మారుస్తున్న అరాచక శక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికంపై గెలుపు అంటూ చేపట్టిన కార్యక్రమం ఎన్నికల కోసం చంద్రబాబు పన్నిన ఎత్తుగడగా విమర్శించారు. ప్రజలు చంద్రబాబు సర్కారుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఘన విజయం సాధించడం తథ్యమమని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమారి కోటేశ్వరరావు, పార్టీనాయకులు మద్దు శ్రీనివాసులు, కరణం భాస్కర్, మారుతికుమార్‌రెడ్డి, జి లక్ష్మీనారాయణ, ఎం భాస్కర్, సునీల్‌కుమార్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, ముడియాల శ్రీనివాసులు, కంచి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.