S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్దనోట్ల రద్దు తో ప్రజలను మోసం చేసిన మోదీ

జె. పంగులూరు, నవంబర్ 13 : పెద్ద నోట్లను రద్దు చేసి దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన పాపం ప్రధాని మోదీదేనని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ ఆరోపించారు. మంగళవారం అలవలపాడు గ్రామంలో అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ అనాలోచిన నిర్ణయాల కారణంగా ప్రజలు ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నారన్నారు. ఎపిని అన్నీ విధాలుగా నమ్మకంగా ముంచేసిన మోదీ పాలన కు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించారని ఆమె తెలిపారు. అలాగే రైతులకు రెండు లక్షలు, డ్వాక్రా మహిళలకు రెండు లక్షల రూపాయలకు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హామీ ఇచ్చారు. పేదలకు ఏడాదికి నాలుగుగ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు పెట్రోల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించి పార్టీకి అండగా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మన్నూరి సీతారామాంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు బాచిన హనుమంతరావు, జిల్లా కార్యదర్శి ఇమ్మడిశెట్టి సుబ్బారావు , పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.