S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలీంగ్ కేంద్రాలలో వసతులు కల్పించాలి

ఆసిఫాబాద్, నవంబర్ 13: ఎన్నికల సందర్బంగా పోలీంగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హాన్మంతు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎం ఈ ఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చే సిబ్బందికి ఎలాంటి ఆసౌకర్యాలకు గురి కాకుండా చూడాలన్నారు. ముఖ్యం గా మహిళ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దన్నారు. అన్ని గదులలో మంచి నీటి వసతి, విద్యుత్ లేని చోట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ముఖ్యంగా టాయ్‌లెట్స్ త్వరితగతిన పూర్తి చేయాలని పోలీంగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఉద్యోగికి అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేయలన్నారు. ఏమైనా పనులు ఉన్నట్లు అయితే వారం రోజుల్లోగా పని పూర్తి చేసి ఒక నివేధిక పంపించాలని ఆదేశించారు. వెబ్ కాస్టింగ్, అన్‌లైన్‌లలో రికార్డులను పరిశీలించారు. ఈసమావేశంలో జిల్లా విద్యాధికారి భిక్షపతితోపాటు ఎం ఈ ఓ లు పాల్గొన్నారు.