S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసమ్మతి భగ్గు

ఆదిలాబాద్,నవంబర్ 13: కాంగ్రెస్‌లో తొలి విడత అభ్యర్థుల జాబితా ఖరారుతోనే అసమ్మతి కుంపట్లు అగ్గిరాజేశాయి. నిన్నటి వరకు టికెట్ కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేసి విఫలమైన అసంతృప్త నేతలు దిక్కార స్వరంతో పార్టీపై తిరుగుబావుటా జెండా ఎగరవేసేందుకు సన్నద్ధమయ్యారు. మంచిర్యాలలో కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జి.అరవిందరెడ్డికి జాబితాలో చుక్కెదురు కావడంతో మంగళవారం తన అనుచరులతో సమావేశమైన అరవిందరెడ్డి బీజేపీ లేదా బిఎస్పీ అభ్యర్థిగా రంగంలో దిగేందుకు సన్నద్ధమయ్యారు. అధిష్ఠానం నేరచరిత్ర కలిగిన వారికే టికెట్లు ఇచ్చిందని, పార్టీలో సీనియర్లను పూర్తిగా విస్మరించిందని అధిష్ఠానంపై అరవిందరెడ్డి నిప్పులు చెరిగారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉంటానని స్పష్టం చేయడం గమనార్హం. సిర్పూర్‌టిలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రావి శ్రీనివాస్ బిఎస్పీ పార్టీ గుర్తుపై పోటీచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన అనుచరుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్‌పై ప్రతికారంగానే రంగంలో ఉండేందుకు సిద్దపడ్డారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి పొత్తుల్లో భాగంగా బెల్లంపల్లి ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని సిపి ఐ పార్టీకి కేటాయించారు. ఇక్కడ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలపై అధిష్ఠానం పొత్తుల్లో నీళ్లు చల్లడంతో ప్రత్యామ్నాయంగా బరిలో నిలిచేలా వ్యూహం రూపొందిస్తున్నారు. అయితే గతంలో టీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో కుదిరిన లోపాయికారి ఒప్పందం మేరకు కేంద్ర మాజీ మంత్రి దివంగత జి.వెంకటస్వామి తనయుడు మాజీ మంత్రి జి.వినోద్‌కు బెల్లంపల్లి టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకోగా సోదరుడు వివేక్, మంత్రి కెటిఆర్ వారించి నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. అయితే ఇప్పుడు బెల్లంపల్లి స్థానాన్ని సిపిఐకి వదలడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెక్కుతానని భావించిన వినోద్ టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సన్నద్దమయ్యారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు దీటైనా పోటీ ఇస్తానని వినోద్ చెప్పడం గమనార్హం. బెల్లంపల్లి, మందమర్రికి చెందిన పార్టీ సీనియర్లు, తన అనుచరులతో సమావేశమైన వినోద్ ఏలాగైనా బెల్లంపల్లి స్థానంలో పోటీచేస్తే కాంగ్రెస్ నేతలు తెరవెనక మద్దతు ప్రకటిస్తారని, తద్వారా ఓట్ల చీలికతో గట్టెక్కుతానని వినోద్ అంచనా వేసుకున్నారు. ఈనెల 16న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వినోద్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
బోథ్‌లో వర్గపోరుపై కేసీఆర్ సీరియస్
బోథ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావుకు వ్యతిరేకంగా ఎంపీ నగేష్ వర్గం పనిచేస్తుండడంపై అధినేత కేసీఆర్ సీరియస్‌గా మందలించినట్లు తెలిసింది. అభ్యర్థులను ఖరారు చేసి రెండు నెలలు గడిచినా ఎంపీ నగేష్‌తో పాటు ఆయన వర్గం ప్రచారంలో కారెక్కపోవడంతో ప్రత్యర్థి వర్గాలకు అనుకూలిస్తోందని, ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్ ఓడిపోయే పరిస్థితి నెలకొందని ఇంటలీజెన్స్ వర్గాల నుండి అందిన సమాచారంతో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కెటిఆర్ పిలుపు మేరకు మంగళవారం ఎంపీ గెడం నగేష్, మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ బాపురావు, డెయిరీ కార్పొరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్ళగా వారి వర్గ విభేదాలపై సయోధ్య కుదుర్చారు. ఇకపై కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చారు. ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేటీఆర్ మంత్రి రామన్న, డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.