S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంట గెలువని పార్టీలు.. రచ్చ గెలుస్తాయా?

స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 13: ఇంట గెలువని పార్టీలు మహాకూటమి పేరుతో రచ్చ గెలుస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండాప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టరు రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని దద్దమ్మ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. దాదాపు రెండు నెలలుగా తెలంగాణలో అభ్యర్ధులను ప్రకటించలేని మహాకూటమిని ప్రజలు నమ్మె పరిస్ధితిలో లేరన్నారు. అభ్యర్ధులను ఖరారు చేయలేని మహాకూటమి ఢిల్లీలో రాజకీయం మొదలు పెట్టిందన్నారు. అలాంటి ఢిల్లీ రాజకీయాలను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఎన్ని కూటమిలు అడ్డుపడ్డా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే డిసెంబరులో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో తిరిగి టిఆర్‌ఎస్‌కు మాత్రమే పట్టం కట్టడానికి ప్రజలు సమాయత్తమయ్యారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహాకూటమిలో కలిసి దొంగచాటుగా తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్రపన్నుతున్నాడని ఆయన ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు, టీడీపీ ప్రభుత్వాలు అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని ఏమేరకు అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాంటి పార్టీలను తరిమికొట్టిన సంఘటనలను మరిచిపోయి, నేడు మహాకూటమిపేరుతో రావడం సిగ్గుచేటన్నారు. మహాకూటమిలో కుమ్ములాటలు జోరందుకోవడంతో, జాతీయ స్థాయిలో అధినాయకత్వం జోక్యం చేసుకునే స్ధాయిలో ఆయా పార్టీలు ఉన్నాయంటే వారి అసమర్ధతను ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. అలాంటి కుమ్ములాటలతో రాజకీయం చేస్తున్న పార్టీలు, ఇక రాష్ట్రప్రజల సంక్షేమానికి ఎలా పాటుపడుతారని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాదు నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి అమరావతికి, అక్కడినుండి ఢిల్లీకి మహాకూటమి ఫైళ్ళు ప్రయానిస్తుండడం చూస్తుంటే జాలేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సీట్ల పంపకంలో వారు పడుతున్న పాట్లను ప్రజలు గమనిస్తున్నారని, ఇక మహాకూటమికి కాలం చెల్లిందని ఆయన జోస్యం చెప్పారు.