S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కేసీఆర్‌ను గద్దెదింపడమే లక్ష్యం..

జనగామ టౌన్, నవంబర్ 13: నాలుగున్నరేళ్లు అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీలేదని, అందుకే ఆయనను గద్దెదింపడానికే మహాకూటమి సిద్దమైందని టీడీపీ జనగామ జిల్లా అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ అన్నారు. జనగామ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు కేసీఆర్ తన కుటుంబ పాలనతో రాష్ట్రా న్ని దోచుకుంటున్నాడని విమర్శించారు. ప్రగతి భవనం, ఫాంహౌస్‌లకే పరిమితమైన ఆయన ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో పేదల భూములు స్వాధీనం చేసుకున్నాడేకాని రైతులకు ఏమాత్రం మేలుచేయలేదని విమర్శించారు. భూములు కోల్పోయిన రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంవల్ల ఆ కుటుంబాలు బజారున పడాల్సి న పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మిషన్‌కాకతీయ, మిషన్ భగీరధలకు మళ్లించి దళిత, గిరిజన సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేశాడని అన్నా రు. కుటుంబ సభ్యులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకా ఇసుక మాఫియాలుగా మారీ కోట్లాది నిధులు సంపాదించుకున్నారని ఆరోపించారు. నిలదీసిన ప్రజలను జైళ్లపాలు చేసి భయబ్రాంతులకు గురిచేశారని అన్నా రు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో మమేకమై పోరాడిన ఉద్యమకారులను, కళాకారులపై అక్రమ కేసులు భనాయించి ఇబ్బందుల పాలు చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఆయన విధానాలను వ్యతిరేకిం చి మహాకూటమికి అధికారాన్ని ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. మహాకూటమి అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. అనంతరం టీడీపీ సీనియ ర్ నాయకులు కత్తుల రాజిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి కబ్జాలకు, అధికారులను బెదిరించడానికే పరిమితమయ్యాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కుమార్, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు స్టాలిన్‌లు పాల్గొన్నారు.