S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వరంగల్-మహబూబాబాద్ మధ్య హైవే కోసం సర్వే..

కేసముద్రం, నవంబర్ 13: వరంగల్ నుండి మహబూబాబాద్‌కు హైవే కోసం సర్వే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరంగల్ నుండి ఇప్పుడు మహబూబాబాద్‌కు అటు నర్సంపేట, ఇటు కేసముద్రం మీదుగా ఆర్‌అండ్‌బి శాఖ డబుల్‌రోడ్డు సౌకర్యం ఉంది. ఈ రెండు రోడ్డు మార్గాల ద్వారా వరంగల్ నుండి మహబూబాబాద్ చేరుకోవడానికి మూడు నుంచి 4 గంటల సమయం పడుతోంది. అయితే తాజాగా మహబూబాబాద్-నకిరేకల్, మల్లంపల్లి- మహబూబాబాద్ జాతీయ రహాదారికి అనుసందానిస్తూ వరంగల్ నగరంలోని రంగశాయిపేట నుండి నెక్కొండ, కేసముద్రం మండలాల ద్వారా మహబూబాబాద్‌కు జాతీయ రహాదారి నిర్మాణానికి ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గతంలో ఉన్న రహాదారినే విస్తరించాలని తొలుత భావించినా.. దూర భారంతో పాటు మార్గ మద్యలో రైల్వేట్రాక్ దాటేందుకు కొత్తగా ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణం చేపట్ట వలసి రావడం, పాత రహాదారిలో అనేక మలుపులుండటం మూలంగా పాత రహాదారి విస్తరణ పట్ల నేషనల్ హైవే అథారటీ సుముఖత చూపలేదని సమాచారం. వందల కోట్లు వెచ్చించి, పాత రోడ్డును విస్తరించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, దూర భారం తగ్గడంతో పాటు తక్కువ సమయంలో వరంగల్ నుండి మహబూబాబాద్ చేరుకునేలా ప్రత్యామ్నయ మార్గం చూడాలని నిర్ధేశించినట్లు సమాచారం. తాజాగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు రంగశాయిపేట నుండి మహబుబాబాద్‌కు దగ్గరిదారి (నేరుగా) కోసం ఓ ప్రైవేట్ సంస్థ చేత సర్వే చేయిస్తోంది. రంగశాయిపేట నుండి కేసముద్రం మీదుగా మహబూబాబాద్ 80 కిలోమీటర్ల దూరం ఉండగా, తాజాగా నిర్వహిస్తున్న సర్వే ప్రకారం పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే ఎక్కడ కూడా రైల్వేట్రాక్ అడ్డుతగలకుండా నేరుగా మహబూబాబాద్ పట్టణానికి కొంత దూరంలో జాతీయ రహాదారిని కలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కొత్త హైవే ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంగెం, పర్వతగిరి, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్ మండలాల్లోని అనేక గ్రామాలకు మెరుగైన రహాదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీనితో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడంతో పాటు అటు ఖమ్మం, మహబూబాబాద్, ఇటు వరంగల్, రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌కు తక్కువ సమయంలో రోడ్డు మార్గంలో వెళ్లడానికి సులువవుతుంది.

ఉగాది నుండే ఇందిరమ్మ పాలన
* కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం: దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, నవంబర్ 13: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఉగా ది నుండి ప్రజలకు ఇందిరమ్మ పాలన అందిస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేట పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్ యువ నాయకుడు వేల్పుగొండ రాజు ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి మంగళవా రం దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి పార్టీని వీడీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన కౌన్సిలర్లు రాబందుల్లా ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు. డిసెంబర 7వ తేదీ వరకు వారంతా పట్టణం నుండి పారిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. తొలుత మండలంలోని ముత్తోజిపేటలో వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి బూర సుమన్‌గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ఆపార్టీకి రాజీనామా చేసి దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగే మురళీధర్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ, మద్దికాయల రాం బాబు, తుమ్మలపల్లి సందీప్, కోల చరణ్, ఆడెపు రమ, ములుక ఇందిర, గంట లక్ష్మారెడ్డి, పేరం బాబురావు తదితరులు పాల్గొన్నారు.

దోపిడీ పాలనను తరిమివేద్దాం: కీర్తిరెడ్డి
మొగుళ్ళపల్లి, నవంబర్ 13: కాం గ్రెస్, తెరాస పరిపాలనలో దోపిడీకి పాల్పడి ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలను స్వహా చేసిన పాలకులను తరిమివేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని భూపాలపల్లి బీజేపీ అభ్యర్ధి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజలు కోరారు. మొగుళ్ళపల్లి మం డలం వేములపల్లి నర్సింగాపూర్‌లో గడపగడపకు ప్రచారం సందర్భంగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఎందరికో అవకాశం ఇచ్చిన ప్రజలు మహిళనైన తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అనేక పథకాలను వివరించారు. తెరాస ఈ పథకాలను ప్రజలకు చేరనీయకుండా తన పథకాలుగా ప్రచారం చేసుకుంటాన్నారని మండి పడ్డారు. భూపాలపల్లి నియోజవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని అదే విధం గా మారు మూల గ్రామల అభివృద్ధికి ప్రజా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పలు పార్టీల నుండి కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఆమె వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రాచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాం బాబు, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని పోలింగ్‌స్టేషన్‌లల్లో దివ్యాంగులకు సౌకర్యాలు
* ఓటుహక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ పిలుపు
మహబూబాబాద్,నవంబర్ 13: అర్హులైన దివ్యాంగులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య కోరారు. మానుకోట కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాసంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓటింగ్‌తీరుపై దివ్యాంగులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌స్టేషన్‌లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్‌బూత్ వద్ద వీల్‌చైర్ ఏర్పాటు చేయడంతోపాటు నడవలేని స్థితిలో ఉన్నవారి కోసం 323 వీల్‌చైర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో 1059 మంది అంధులను, 647 మంది చెవిటి, మూగవారిని, 3329 మంది నడవలేని వారిని, 529 మంది ఇతరులను గుర్తించామన్నారు. ఇంటి నుండి పోలింగ్‌బూత్ వరకు, ఓటువేసిన తర్వాత ఇంటివరకు దింపడానికి వాహన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ర్యాంపు, రైలింగ్, మంచినీటి సౌకర్యం, టాయిలెట్‌లను చేయడం జరిగిందన్నారు. అనంతరం దివ్యాంగులకు ఈవీ ఎం, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించి కలెక్టర్ స్వయంగా వారితో మాక్‌పోలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో డీడబ్ల్యూవో స్వర్ణలతలెనినా, డీఈవో సత్యప్రియ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.