S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్టు

మెట్‌పల్లి, నవంబర్ 13: మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్సార్ అర్భన్ కాలనీలో ఈనెల 8న కాల్పులు జరిపిన నేరస్తుడిని పట్టుకొని అరెస్టు చేసి ఒక పిస్టోల్,2మ్యాగ్జిన్‌లు 16రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు మెట్‌పల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం మెట్‌పల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీఎస్పీ మాట్లాడుతూ అబ్దుల్ సత్తార్ 25 సంవత్సరాల క్రితం బతుకుదెరువుకోసం సౌదీకి వెళ్లి అక్కడి గసీం అనే రాష్ట్రంలోని అల్‌రాజ్ సెల్‌ఫోన్ షాప్‌లో రిపేరర్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చాడు. సెల్‌ఫోన్ షాపులోకి సౌదీ జైలు అధికారి తరచుగా రావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పుడు అస్ట్రామేడ్ ఫాల్కన్ పిస్టల్‌ను జైలు అధికారి అబ్దుల్ సత్తార్‌కు ఇచ్చాడు. 1998లో సౌదీ నుంచి ఇండియా వచ్చేటప్పుడు పిస్టోల్, 2మ్యాగిజన్‌లు, 16రౌండ్లు ఒక కంప్యూటర్ సీపీయూలో ప్యాక్ చేసి కార్గొలో వేసి తీసుకొచ్చాడు. సత్తార్ భార్య, పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల వారు హైదరాబాద్ లోని బర్కత్‌పురలో నివాసం ఉంటున్నారు. సౌదీలో అకామా అయిపోవడం వల్ల 2018జూన్‌లో తిరిగి ఇండియాకు వచ్చాడు. 3నెలలుగా మెట్‌పల్లిలోని సొంతింటిని అమ్మి వైఎస్సార్ కాలనీలో ఇల్లు కొని నివాసముంటున్నాడు. ఈక్రమంలో అతని ఇంట్లోని బోర్ చెడిపోవడంతో షేక్ రఫీక్ అనే ఎలక్ట్రికల్ వర్కర్‌తో పనిచేయించుకునేటప్పుడు పరిచయం ఏర్పడింది. రఫిక్ అప్పుగా రూ. 5వేలు సత్తార్ వద్ద 2నెలల క్రితం తీసుకోగా డబ్బు ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో ఈ నెల 8న తన ఇంటి ముందునుంచి వెళ్తున్న రఫిక్‌ను మరోసారి తన బాకీ డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అతని ఇవ్వకపోగా దిక్కున్నచోట చెప్పుకో అనగా సత్తార్ ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి రఫిక్ తప్పించుకోగా సత్తార్‌పై కాల్పులు జరిపగా, అతడు తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. మెట్‌పల్లి బస్టాండ్‌లో తిరుగుతూ కనిపించడంతో సీఐ రవికుమార్,ఎస్సై శంకర్‌రావులు పట్టుకున్నారని, ఇందుకు వీరిని అభినందిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.