S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనోధైర్యానికి ఆమె మారుపేరు

మనిషి సంఘజీవి. అనుక్షణం కుటుంబ సభ్యులతో లేక స్నేహితులతో, టీవీ, అంతర్జాలం, స్మార్ట్ఫోన్లు, సినిమాలతో కాలక్షేపం చేస్తూనే ఉండడం అతని జీవన విధానం. ఒక్కరోజు ఎవ్వరూ కనబడకపోయినా లేక ఎలాంటి కాలక్షేపం లేకుండా ఏకాంతంలో గడపాల్సి వచ్చినా పిచ్చి ఎక్కినట్లు విలవిల్లాడిపోతాడు. చీకటి పడ్డాక ఒక్క క్షణం కరెంట్ లేకపోతే ఆందోళనకు గురవుతాడు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం యొక్క సౌలభ్యాలు అనుక్షణం అందిపుచ్చుకుంటూ వాటితో నిత్యం సహవాసం చేసే మానవుడు, అవి లేకుంటే గిజగిజలాడిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి నేటి ఆధునిక ప్రపంచంలో ఒక 72 ఏళ్ల వృద్ధురాలు అభివృద్ధికి మైళ్ల దూరంలో గత 40 సంవత్సరాలుగా అడవిలో నివసిస్తూ ఎలాంటి భయాందోళనలు, చీ కు చింతా లేకుండా ప్రశాంత జీవితం అనుభవిస్తోందంటే ఆశ్చ ర్యం కలుగకమానదు.
ఒక మీడియా సంస్థ వెలికితీసిన ఈ వృద్ధురాలి జీవితంపై జా తీయ మహిళా కమిషన్ స్పందించి ఒక అధ్యయన బృందాన్ని ఇటీవలే నియమించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో రాజులగూడెం - కన్నాపూర్ గ్రామాల మధ్య 220 హెక్టార్ల అటవీ భూమి వుంది. ఈ ప్రాంతంలో ఇళ్లుగాని, రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవు. కాని ప్రభుత్వ పథకాలు ఈ ప్రాంత వాసులకు అందుతున్నాయని రికార్డులు మాత్రం వెల్లడిస్తున్నాయి. కన్ను పొడుచుకున్నా కానరాని దట్టమైన చీకటి ఆవరించి వుండే ఈ అడవిలో ఒక పూరి గుడిసెలో గిరిజాబాయి అనే ఆదివాసీ మహిళ నివశిస్తోంది. 1948 ప్రాంతంలో జన్మించిందని భావిస్తున్న ఈ అవ్వ, తన భర్త, కొడుకు, కోడలితో కలిసి నార్నూర్ మండలం నుండి ప్రస్తుత అటవీ ప్రాంతానికి వచ్చి రెండున్నర ఎకరాల అటవీ భూమిలో సాగుచేస్తూ జీవనం చేసుకునేవారు.
విషజ్వరాల కారణంగా తొలుత ఆమె భర్త, అనంతరం కొడుకు, కోడలు కూడా చనిపోయారు. డాక్టర్లు మందులు అంటే వీరికి తెలియదు. ఆకు పసర్లే వీరికి గతి. అందరూ చనిపోయి, అనాధగా మిగిలినా ఈమె ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరం కోల్పోలేదు. సాగుచేసుకుంటూ జీవితం గత 40 ఏళ్లుగా వెళ్లబుచ్చుతోంది. వ్యవసాయంతోపాటు తడికెలతో తన ఆరాధ్యదైవం అయిన జంగూభాయి అనే ఆదివాసీ దేవత గుడి కట్టి అక్కడ దైవధ్యానంతో రోజులు వెళ్లబుచ్చుతోంది. ఆమెకు కేవలం గోండు భాష మాత్రమే తెలుసు. అటవీ ఫలాలతోపాటు వెదురు బియ్యం, ఆకుకూరలతో భోజనం సాగిస్తోంది. స్థానిక ఆదివాసీల సహాయంతో మీడియా ప్రతినిధులు కలిసినపుడు - నాకెవరూ లేరన్న చింత లేదు, అన్నింటికీ మా దైవానే్న నమ్ముకున్నా ను. అడవిలో అనేక వన్యప్రాణులు తిరుగుతున్నా అవి ననే్నమీ చేయవు. అవంటే నాకు ఎలాంటి భయం లేదు అని ధైర్యంగా జవాబిచ్చింది. రోగాలకు స్వయంగా చేసుకునే ఆకు పసర్లే గతి. స్థానిక ఆదివాసీలతో కూడా ఎప్పుడూ కలవదు. ఎలాంటి భయాందోళనలు లేకుండా నిబ్బరంగా ఒక్కర్తే అడవి తల్లితో సహజీవనం చేసే గిరిజాభాయి జీవితం నేటి ఆధునిక మానవుడికి స్ఫూర్తిదాయకం. అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని ప్రకటించుకునే ప్రభుత్వాలు ఇలాంటి అన్నార్తులవైపు దృష్టి సారించేది ఎన్నడు?

-సి.ప్రతాప్