S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాలో ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలి

ఒంగోలు,నవంబర్ 16:జిల్లాలో 95శాతం మంది ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు తమ పనితీరును మెర్చుకోవాలని రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అనిల్ చంద్రపునేట తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్‌తో కలిసి జిల్లా క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించి ప్రజల సంతృప్తిస్థాయిని 95శాతంకు తీసుకువెళ్ళాలన్నారు. బాధ్యతగలిగిన అధికారులుగా, సమాజంలోని పౌరులుగా ప్రతి ఒక్కరు అక్షరాస్యత పెంపుదలకు కృషిచేయాలన్నారు. అక్షరాస్యతతోనే దేశాభివృద్ది సాధ్యవౌతుందన్నారు. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు తమవంతు బాధ్యతగా గుర్తించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం పేదప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలుచేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పేదప్రజలకు అందేలా అధికారులు తమవంతు బాధ్యతగా గుర్తించి పనిచేయాలన్నారు. ప్రధానంగా జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్, స్ర్తిశిశు సంక్షేమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ, ఐటిడిఏ అధికారులు తమ శాఖల ద్వారా పేదప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వారికి అందచేసేలా చూడాలని, వారి జీవితాలను చీకటినుండి వెలుగులోకి తీసుకొచ్చేందుకు అంకితభావంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ జిల్లాలోవర్షాభావం వలన సాగు,తాగునీటికి ఇబ్బందిగా ఉందని రాష్టమ్రుఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. తాగునీటి సమస్యలను ఎదుర్కొందుకు రెండుకోట్లరూపాయల నిధులు అవసరమని కలెక్టర్ తెలిపారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారాప్రజలకు తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులకు ఉపాధి కూలీలకు ఉపాధి వేతనం చెల్లించేందుకు గత రెండునెలల నుండి బకాయిలు ఉందని 25కోట్లరూపాయల నిధులు అవసరమని వాటిని వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పశువులకు రాబోయే ఆరునెలలకు అవసరమైన పశుగ్రాసం, సైలేజ్ దాణా 40వేల మెట్రిక్ టన్నులు, కాన్సన్‌ట్రెటెడ్ సైలేజ్ 10వేల మెట్రిక్ టన్నులు అవసరమని ఆయన వివరించారు. ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా అయినప్పటికి దినదినాభివృద్ధి చెందుతుందని జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్ లీడర్‌షిప్‌లో జిల్లా అధికారులు అంకితభావంతో పనిచేసి జిల్లా,రాష్ట్ర,దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జిల్లాఅధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ జిల్లాలో సమర్ధవంతగా అమలుచేసే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. ముందుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి అనిల్‌చంద్రపునేఠా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్‌పి బి సత్యఏసుబాబు, అదనపు ఎస్‌పి లావణ్య, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, సిపిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, గృహనిర్మాణశాఖ పీడీ సాయినాధ్, మెప్మా పీడీ సింగయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.