S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బోట్ రేసింగ్ ఏర్పాట్లలో సమన్వయమేదీ?

అమరావతి, నవంబర్ 16: సేవల రంగంతోనే రెండంకెల వృద్ధిరేటు సాధ్యం.. అలాంటిది రాష్ట్రంలో పర్యాటకం పనితీరు సక్రమంగాలేదు.. ఇలా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాఖ ఉన్నతాధికారులను మందలించినా కించిత్ మార్పురావటం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక ప్రగతి సంగతి అలా ఉంచితే.. విజయవాడలో శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు చెందిన బోట్‌లు పాల్గొంటున్న అంతర్జాతీయ రేసింగ్‌ను తిలకించేందుకు వచ్చిన ప్రజానీకానికి నిరాశ, నిస్పృహలే మిగిలాయి. అన్నింటికీ మించి వసతుల కల్పన పట్ల పర్యాటకశాఖ ఏ మాత్రం శ్రద్ద చూపలేదు. మొక్కుబడిగా ముఖ్యమంత్రి వేదిక వరకు ఏర్పాట్లుచేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కృష్ణానదిలో అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్1 హెచ్2ఓకు చెందిన పవర్ బోట్ రేసింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. మూడురోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నడూ లేనిరీతిన నిర్వహిస్తున్న ఈ పోటీలను తిలకించేందుకు వేలాదిమంది జనం తరలివచ్చారు. ఒకవైపు తుపాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నా షామియానాలు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో నిర్వాహకులు విఫలమయ్యారు. అంతేకాదు ఎంట్రీ పాస్‌లు లేకపోవటంతో మీడియా సైతం లోపలకు ప్రవేశించేందుకు ప్రయాసపడాల్సి వచ్చింది. పర్యాటకశాఖ అంతా తానుగా వ్యవహరించటంతో సమాచారశాఖ చేతులెత్తేసింది. చివరకు ఆ శాఖ కమిషనర్‌కు కూడా చివరిక్షణం వరకు ఎంట్రీపాస్ ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థమవుతుంది. మీడియా ఆందోళన నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తాత్కాలిక ఎంట్రీపాస్‌లను అందజేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా పోటీలను తిలకించేందుకు వచ్చిన జనం పరుగులుతీసి, చెట్లకింద తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం గందరగోళం వెనుక పర్యాటకశాఖకు చెందిన ఓ ఉద్యోగి నిర్వాకం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. పోటీలు నిర్వహించే ప్రాంగణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద కూడా సరైన వసతులు లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తాయి. మొత్తంగా బోట్‌రేసింగ్ తొలిరోజు ఓ ప్రహసనంగా మారిందనే విమర్శలు వచ్చాయి..