S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

22న కోటి దీపోత్సవం

ఇంద్రకీలాద్రి, నవంబర్ 16: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 22న వైభవంగా ‘కోటిదీపోత్సవ’ం నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 22న సాయంత్రం సుమారు 6-45గంటలకు ఈమహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. అమ్మవారి సన్నిధిని 5 సెక్టారులుగా విభజించి ఈవేడుకను నిర్వహించనున్నారు. సెక్టార్-1, చిన రాజగోపురం, మహాగణపతి విగ్రహం, గోకులం వరకు. సెక్టార్-2, ప్రధాన ఆలయం, వీఐపీల ప్రాకారం (అష్టలక్ష్ములు), సెక్టార్-3, నూతన రాజగోపురం ముందు భాగం, సెక్టార్-4, నటరాజ ఆలయం, శ్రీమల్లేశ్వరస్వామి ఆలయం, సెక్టార్ -5లో అర్జున వీధి ప్రారంభం నుండి చివరకు, మాడవీధి ఇరువైపుల ఈప్రదేశాల్లో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ముగ్గులతో శివలింగాకారం, త్రిశూల్ ఆకారాలతో ఏర్పాటు చేయనున్నారు. భక్తులు అధికంగా విచ్చేసి అమ్మవారు, స్వామివార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.

లైసెన్స్ పోర్టర్లను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలి
* 22న కర్నూలులో రాష్ట్ర మహాసభలు
* ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్

విజయవాడ, నవంబర్ 16: రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీలో లైసెన్స్ పోర్టర్లుగా పని చేస్తున్న వారిని ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం ప్రాంగణంలో ఏపీఎస్ ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్ల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభ శుక్రవారం విజయవంతంగా జరిగింది. సమావేశానికి అధ్యక్షులుగా లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డీ కృష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఏఐటీయుసి ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలు ఫలితంగా లైసెన్స్ పోర్టర్లకు గుర్తింపు లభించిందన్నారు. పోర్టర్లకి రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఈఎస్‌ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు పల్లా సూర్యారావు మాట్లాడుతూ ఏఐటీయుసి ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా లైసెన్స్ పోర్టర్లుగా పనిచేసే విధంగా అగ్రిమెంట్ సాధించామని వెల్లడించారు. ఏఐటీయుసి రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ హమాలీ కార్మికుల కోసం ఓక చట్టాన్ని రూపొందించాలని, పోర్టర్లకి ఈఎస్‌ఐ, పీఎఫ్ ఇవ్వాలని, 60 ఏళ్లు దాటిన పోర్టర్లకి రూ. 6వేలు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 22వ తేదీన కర్నూలులో జరిగే 16వ మహాసభకి పోర్టర్లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాలి రమణ, నాయకులు గోపాలం, మూర్తి, సాంబశివరావు, నారాయణ, డీ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే నాజర్‌వలీ, ఏఐటీయుసి నగర అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

* ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ
* చిత్తూరు, గుంటూరు, ప.గోదావరి జట్ల శుభారంభం
* ఇంటి ముఖం పట్టిన అనంతపురం, కర్నూలు, అమరావతి జట్లు
* అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న రవిరాజు
విజయవాడ(ఎడ్యుకేషన్), నవంబర్ 16: విజయవాడ జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అం డ్ కల్చరల్ లీగ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ తొలిరోజే ఉత్కంఠత కలిగించింది. రా ష్ట్రంలోని 13 జిల్లాల నుండి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు 13 జట్లు ఏర్పడి టోర్నీలో పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉ మామహేశ్వరరావు, శాసనమండలి స భ్యుడు బుద్ధా వెంకన్న, తెలుగు యువ త నాయకుడు దేవినేని అవినాష్, బీసీసీఐ చీఫ్ సెక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్‌లు టోర్నీని ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. నాకౌట్ ప ద్ధతిలో నిర్వహిస్తున్న టోర్నీలో మొత్తం 13 జట్లకు గాను తొలి రోజున చిత్తూ రు, గుంటూరు, పశ్చిమ గోదావరి జి ల్లా జట్లు విజయం చేశాయి. అనంతపురం, కర్నూలు, అమరావతి జట్లు ఇం టి ముఖం పట్టారు. అనంతపు రం-చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బండారు హనుమంతరావు ప్రారంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 182 పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. గుంటూరు-కర్నూలు మధ్య జరిగిన రెండవ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు 12.2 ఓటర్లకు 89 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజేతగా నిలిచింది. అమరావతి-పశ్చిమ గోదావరి జిల్లా జట్ల మధ్య జరిగిన మూడవ మ్యాచ్‌లో పశ్చిమ గోదావరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 18 ఓవర్లలో 242 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రవిరాజు 102 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు. 243 పరుగుల నారీ లక్ష్యాన్ని చేధించడంలో ప్రత్యర్థి అమరావతి జట్టు విఫలమైంది. రెండవ రోజు శనివారం చిత్తూరు-విజయవాడ, విశాఖపట్నం-గుంటూరు, తూర్పు గోదావరి-నెల్లూరు జట్లు తలపడనున్నాయి. జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్‌కు తొలి రోజు విశేష స్పందన వచ్చింది. జర్నలిస్టులతో పాటు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పోటీలను తిలకించారు. యువ జర్నలిస్టులు టోర్నీలో అద్భుతమైన క్రీడా పటిమను ప్రదర్శించారు. టోర్నీ నిర్వాహకులు రాజేంద్ర ప్రసాద్, డివి సుబ్బారావు, కోనేరు క్రాంతి, ప్రసాద్, జయరాజ్, చలపతిరావు, మురళి, పూర్ణ పోటీలను పర్యవేక్షించారు.