S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనగనగా..( సండేగీత )

చిన్నప్పటి నుంచి విన్న మాట-
అనగనగా..
అనగనగా వినని పిల్లలు చాలా అరుదు.
అనగనగా ఒక చేప వుండేది. అనగనగా ఒక రాకుమారుడు ఉండేవాడు. అనగనగా ఓ పేదరాశి పెద్దమ్మ వుండేది.
చిన్నప్పుడు మనలో చాలామంది విన్న కథలు ఇలాగే మొదలయ్యేవి.
అలా మొదలైన కథ రాక్షసుడు రాకుమార్తెను ఎత్తుకుపోవడం, ఆమె అనే్వషణలో రాకుమారుడు అడవిలోకి వెళ్లడం.
చివరికి తన రాజ్యానికి వచ్చి రాకుమార్తెను వివాహం చేసుకొని సుఖంగా జీవించడం.
రాకుమారుడి కథే కాదు.
చేప కథైనా
పేదరాశి పెద్దమ్మ కథైనా అనగనగాతో మొదలై సుఖాంతంతో ముగిసేవి.
కథ మొదలైనప్పుడు బాగానే వుంటుంది.
కథ చివర బాగానే వుంటుంది.
ఈ రెండింటి మధ్యలోనే
ఎలా వుంది అన్నది ప్రధానమైన విషయం.
మన జీవితం కూడా అంతే!
మొదలైనప్పుడు బాగానే వుంటుంది.
చివర్లో ఎలా వుంటుంది అన్నది - ఈ మధ్యలో మనం చేసిన పనిని బట్టి ఉంటుంది.
మనం తీసుకున్న చర్యలను బట్టి ఉంటుంది.
మనం కన్నకలల్ని సాఫల్యం చేసుకోవడం కోసం మనం చేసిన ప్రయత్నాన్ని బట్టి వుంటుంది.
మనం వేటాడిన జంతువులను బట్టి వుంటుంది. అది అసూయ కావొచ్చు. అత్యాశ కావొచ్చు. ఇంకా ఏమైనా కావొచ్చు.
మనం చిన్నప్పుడు విన్న కథల్లో మాదిరిగా చివర్లో ఆనందంగా వుండాలంటే బాగా కష్టపడాలి.
మంచి మార్గంలో ప్రయాణిస్తే - సుఖంగా జీవించే అవకాశం వుంటుంది.
వక్ర మార్గంలో ప్రయాణం చేస్తే మనం జీవించడమే దుర్లభం అవుతుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001