S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంటింటా బీజేపీ ప్రచారం

నేలకొండపల్లి, నవంబర్ 17: నియోజకవర్గంలోని అన్ని మండలాలలో భారతీయ జానత పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తుంది. పోలింగ్ బూత్ వారిగా జిజెపి పార్టీ గెలిపించాలని పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మోడీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం పూర్తి చేసిన కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో 265పోలింగ్ బూత్‌లలో ఇంటింటి ప్రచారం బిజెపి కార్యకర్తలు నిర్వహిస్తున్నట్లు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి అన్నారు. బిజెపి పాలేరు నియోజకవర్గంలో అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధిని వారు వివరిస్తున్నారు. రాజకీయ అనుభవం ఉండి నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తినని శ్రీ్ధర్‌రెడ్డి అంటున్నారు. రాజకీయాలలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి ఇప్పడు ప్రజల వద్ద వస్తున్నానన్నారు. పాలేరు నియోజకవర్గంలో బిజెపిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

తుమ్మల నామినేషన్‌కు భారీగా తరలిరావాలి

నేలకొండపల్లి, నవంబర్ 17: పాలేరు నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 19వ తేదీన జరిగే నామినేషన్‌కు నేలకొండపల్లి గ్రామం నుండి టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని టిఆర్‌ఎస్ పార్టీ నేలకొండపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు మైసా శంకర్ అన్నారు. శుక్రవారం స్థానిక టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నందు గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ 19న నామినేషన్ కార్యక్రమంతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలన్నారు. నేలకొండపల్లి నుండి సుమారు మూడువేల మంది పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతనిప్పు లాలయ్య, మాజీ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, కోనేరు కిషోర్, గెల్లా జగన్‌మోహన్, రాయపూడి శ్రీను, కాసాని నాగేశ్వరరావు, కడియాల నరేష్, పగిడికత్తుల రాంబాబు, శీలం వెంకటలక్ష్మీ, చిలకల సీతారావమ్మ, సామాల కోటేశ్వరరావు, లక్ష్మయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, వాజీద్, ముక్కంటి, నారాయణ, వేణు, లక్ష్మయ్య, ఆదాం, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.