S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైకోర్టు భవనాలు భేష్

అమరావతి, నవంబర్ 17: రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాల నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తవుతుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ తొట్టత్తిల్ బి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలు పూర్తయి, నోటిఫికేషన్ వెలువడిన అనంతరం రాష్ట్రానికి హైకోర్టును తరలిస్తామన్నారు. శనివారం రాజధాని పరిధిలోని నేలపాడు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస భవనాలను సీజే రాధాకృష్ణన్, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, హైకోర్టు పోర్టుపోలియో జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జడ్జిలు జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్, ఎస్వీ భట్, ఏవీ శేషసాయి, టి సునీల్‌చౌదరి, ఎం సత్యనారాయణమూర్తి, గుంటూరు జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ, జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు సందర్శించారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ రాజధానిలో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, జోనల్ ప్లాన్, తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. జ్యుడీషియల్ కాంప్లెక్ వెలుపల, లోపల జరుగుతున్న పనులను చీఫ్ జస్టిస్ నిశితంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. కాంప్లెక్స్ మధ్యభాగంలోని కట్టడం గురించి ఆరాతీశారు. అక్కడ అద్దాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాంప్లెక్స్ పనులకు సంబంధించి కొన్ని మార్పులను సీజే ప్రతిపాదించారు. ఫర్నీచర్, కోర్టు హాళ్ల డిజైన్, జడ్జీల చాంబర్లు, అడ్వకేట్ల కార్యాలయాలు, ఫుల్‌కోర్టు సమావేశ మందిరం, తదితర అంశాలపై సీఆర్డీఏ కమిషనర్‌తో చర్చించారు. జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారుల ప్రవేశమార్గాలు, కాంప్లెక్స్‌లో వారికి అనువైన స్థలాల గురించి అడిగి తెలుసుకున్నారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన డిజైన్లను పరిశీలించారు. కేపిటల్ సిటీ, ఐకానిక్ భవనమైన హైకోర్టు డిజైన్లను తిలకించారు. జడ్జీల బంగ్లా పనులు, లోపల వసతుల్లో మార్పులు, చేర్పులను సూచించారు. ఐఏఎస్ అధికారుల నివాస భవనాల నిర్మాణాలను, మోడల్ ఫ్లాట్లు, జడ్జిల క్వార్టర్ల నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జూనియర్ సివిల్ జడ్జి వి రామకృష్ణయ్య, మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ భవానీ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్, ప్లానింగ్ డైరెక్టర్ జి నాగేశ్వరరావు, ల్యాండ్స్ డైరెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, సీఈ జక్రయ్య, ఎస్‌ఈ ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.