S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన ఆరోగ్యం మనచేతుల్లో ...

కల్లూరు, నవంబర్ 17: ప్రతి ఒక్కరూ చిట్కాలు పాటించి మీ ఆరోగ్యంతో పాటు ఇంటిలోని కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకుంటూ హాయిగా జీవించండంటూ ప్రకృతి వైద్యులు సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్ కెయూ రామచంద్రరావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని జీడీబీ పల్లి గ్రామంలోని పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ప్రజలు నేటి అనారోగ్యాలకు గురవుతున్న విధానాలను వాటిని తిప్పి కొట్టేందుకు చేయాల్సిన విధి విధానాలతో పాటు ప్రకృతి ఇచ్చే సంపదతో ఆరోగ్యంగా జీవించేందుకు గల చిట్కాలను వివరించారు. ప్రజలు ఎక్కువగా బీపీ, థైరాయిడ్ వంటి గతంలో లేని వ్యాధులు అధికమయ్యాయని వాటిని నివారించేందుకు అయోడిక్ ఉప్పు వాడకాన్ని కొన్ని నెలలపాటు మానేస్తే పూర్తిగా ఉపశమనం లభిస్తుందన్నారు. బి 17 విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుందని బి 17 విటమిన్ గల పదార్థాలను తీసుకున్నట్లైయితే వ్యాధి పూర్తిగా నయమవుతుందన్నారు. మానవ మనుగడంతా నీటిలో కరిగిన పదార్థాలపై ఆధారపడి ఉంటుందని అందుకు గాను ప్రతి ఒక్కరూ ఉదయం, ఆహారం తీసుకునే ముందు తీసుకున్నాక ప్రతి గంటగంటకు నీటిని తాగుతూ ఉండాలన్నారు. పుష్కలంగా పండ్లు, కాయలు, ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు, ఊసబియ్యం తినే వారిలో అనారోగ్య లక్షణాలు దరిచేరవన్నారు. ప్రజలకు వచ్చే అనేక వ్యాధుల గురించి వివరిస్తూ వాటి నివారణకు చేయాల్సిన చిట్కాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సంగం వెంకటపుల్లయ్య, ఎంఇఓ కాకర్ల రంగారావు, సంగం రామకృష్ణ, వల్లభనేని భద్రయ్య, దంతాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.