S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్ళీ వాళ్ళే

ఖమ్మం, నవంబర్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఐదు నియోజకవర్గాల్లో 2014ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నవారే ఇప్పటి ఎన్నికల్లో కూడా ప్రత్యర్థులుగానే ఉన్నారు. అయితే కొందరు నాడు ఒక పార్టీ తరపున పోటీ చేయగా నేడు మరొక పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలో మాత్రం నాటి అభ్యర్థి కుమారుడు బరిలో నిలిచారు. సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, ఇల్లెందు నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో పోటీపడిన ప్రత్యర్థులే ఇప్పుడు కూడా ప్రత్యర్థులుగానే ఉన్నారు. పినపాకలో నాటి బిజెపి అభ్యర్థి కుమారుడు పోటీ చేస్తుండగా ఖమ్మం, భద్రాచలంలలో మాజీ ఎంపిలు పోటీ చేస్తుండగా, వైరా, పాలేరులలో నూతన అభ్యర్థులు కూడా రంగంలోకి దిగుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య, టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పిడమర్తి రవి పోటీ చేస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి తరువాత టిఆర్‌ఎస్‌లో చేరిన తాటి వెంకటేశ్వర్లు టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా నాడు నేడు కూడా మెచ్చా నాగేశ్వరరావు టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇల్లెందు నియోజకవర్గంలో నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి టిఆర్‌ఎస్‌లో చేరిన కోరం కనకయ్య టిఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలో నిలవగా ఆయనకు ప్రత్యర్థిగా 2014ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హరిప్రియ నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. వనమా 2014ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీచేసి జలగం చేతిలోనే ఓటమి పాలయ్యారు. అలాగే మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టివిక్రమార్క పోటీచేస్తుండగా టిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2014ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన లింగాల కమల్‌రాజ్ పోటీలో ఉన్నారు. పినపాక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన పాయం వెంకటేశ్వర్లుతో 2014ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చందా లింగయ్యదొర కుమారుడు సంతోష్‌కుమార్ బరిలో నిలిచారు. ఇదే క్రమంలో ఖమ్మం నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా ఖమ్మం మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన తరువాత టిఆర్‌ఎస్‌లో చేరిన పువ్వాడ అజయ్‌కుమార్‌తో తలపడుతుండగా, భద్రాచలం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ చివరి ఎంపి, సిపిఎం నేత మిడియం బాబురావు నాడు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తెల్లం వెంకట్రావ్‌తో తలపడుతున్నారు. పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాలకు కొత్త అయిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డితో తలపడుతుండగా వైరా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి టిఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్‌తో నూతన అభ్యర్థిగా సిపిఐ తరపున బరిలో దిగుతున్న గుగులోత్ విజయ తలపడుతున్నారు.