S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉల్లాసంగా వైజాగ్ నేవీ మారథాన్

విశాఖపట్నం, నవంబర్ 18: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న వైజాగ్ నేవీ మారథాన్ ఆదివారం ఉల్లాసంగా జరిగింది. ఉదయం బీచ్ రోడ్డులో ప్రారంభమైన మారథాన్‌లో 15,149 మంది పాల్గొన్నారు. నాలుగు కేటగిరీలుగా జరిగిన మారథాన్‌లో పెద్ద సంఖ్యలో స్థానికులు, నేవీ సిబ్బంది పాలుపంచుకున్నారు. కరేజ్ పేరిట నిర్వహించిన 42.2 కిమీ మారథాన్‌లో 351 మంది పాల్గొనగా తూర్పునౌకాదళం (ఈఎన్‌సీ) క్రీడావిభాగాధికారి కెప్టెన్ అనిమేష్ నగర్, రేస్ డైరెక్టర్ మురళి నన్నపనేని ప్రారంభించారు. డెస్టినీ పేరిట నిర్వహించిన 21 కిమీ రన్‌లో 2254 మంది పాల్గొనగా ఐఎన్‌ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ అరవింద్ శర్మ, 10 కిమీ స్నేహపూర్వక రన్‌ను రాయల్ సింగపూర్ నేవీ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ ఎడ్విన్ లియాంగ్ ప్రారంభించారు. ఈరన్‌లో 4291 మంది పాల్గొనగా వారిలో సింగపూర్ నౌకాదళ ప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. 8253 మందితో జరిగిన ఫన్ మారథాన్‌ను ఈఎన్‌సీ చీఫ్ కరమ్‌బీర్ సింగ్ ప్రారంభించారు. చిన్నా,పెద్దా తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజానీకం ఎంతో ఉత్సాహంతో నేవీ మారథాన్‌లో పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు
42 కిమీ కరేజ్ రన్ పురుషుల విభాగంలో ప్రధమ బహుమతిగా రూ.లక్ష చెక్కును మోహిత్ రాథోడ్‌కు ఈఎన్‌సీ చీఫ్ కరమ్‌బీర్ సింగ్ అందజేశారు. రెండో బహుమతిని ఎం జగదీశన్, మూడో బహుమతిని అదినూ తలశియ సాధించారు. ఇదే కేటగిరీ మహిళల విభాగంలో ప్రధమ బహుమతిని కె తిరుపతమ్మ గెలుచుకోగా, పీ రమణి, వీ రామలక్ష్మి ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. 21 కిమీరన్ పురుషుల విభాగంలో హరిసింగ్ (ప్రథమ), వీ నాగరాజు (ద్వితీయ), కె తుషార్ (తృతీయ) స్థానాల్లోను, మహిళల విభాగంలో ఎల్ కలైసెల్వి (ప్రధమ), స్మృతి సెంగర్ (ద్వితీయ), గాయత్రి (తృతీయ) స్థానాల్లోను, 10 కిమీ రన్ పురుషుల విభాగంలో నవీన్ (ప్రధమ), రాహుల్ గండర్ (ద్వితీయ), ఉమేష్ కుమార్ (తృతీయ), మహిళల విభాగంలో వినీత (ప్రధమ), జ్ఞాని (ద్వితీయ), జ్యోతిదుర్గ (తృతీయ) బహుమతులు అందుకున్నారు.