S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కార్తీకం...కూరలు ప్రియం...

విశాఖపట్నం, నవంబర్ 18: కార్తీక మాసం కావడంతో కూరగాయల ధరలు ఆశాశనంటుతున్నాయి. వీటికి గత రెండు వారాలుగా విపరీతమైన డిమాండ్ ఉంది. కూరగాయల పంటలు తగ్గిపోతుండటం, కార్తీకమాసం కావడంతో వీటి ధరలకు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోతోంది. బీర, బెండ, కాకరకాయల్లో ఏదీ కావాలన్నా కిలోకి కనీసం రూ.40ల వరకు చెల్లించాల్సిందే. అదే బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ పువ్వు, మునగ, అరటికాయలు ఈమధ్యకాలంలో ఎక్కువ ధరే పలుకుతున్నాయి. ఆనప, టమాటో, మునగ, దోసకాయ, అల్లం, పచ్చిమిర్చి ధరలు గత పది రోజులుగా పెరిగిపోయాయి. గతంలో కేవలం రూ.20లకు దొరికే కిలో అల్లం రూ.60లకు పెరిగిపోయింది. మారు అమ్మకాలు, చిల్లర దుకాణాలు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి. మరోపక్క శివారు ప్రాంతాలు పీఎం పాలెంలో ప్రతి బుధవారం, అలాగే ప్రతి శనివారం మధురవాడ హైవే మీద సంతలు జరుగుతున్నాయి. అయినా కూరలు ఆకుకూరల ధరలు మాత్రం మండిపోతున్నాయి. అసలే కార్తీకమాసం కావడం, ఎక్కువుగా హోటళ్ళకు తరలిపోతున్న పరిస్థితులు వీటి డిమాండ్‌కు కారణమవుతున్నాయి. రైతుబజార్లు, సంతలు నిర్వహిస్తున్నా నగరంలోని పూర్ణామార్కెట్, అల్లిపురం, అక్కయపాలెం మార్కెట్లు నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉంటున్నాయి. అయినా వీటి ధరలు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. కూరల ధరలను నియంత్రించేందుకు సంబంధితాధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* పూజాసామాగ్రి మరింత ప్రియం...
కొబ్బరికాయలు, అరటిపండ్లకు గిరాకీ ఎర్పడింది. కొబ్బరికాయ కనీస ధర రూ.20లుగా ఉంది. అదే అరటిపండ్లు డజన్ రూ.30నుంచి అమ్ముడుపోతోంది. ఇవి కాకుండా పూజాసామాగ్రికి డిమాండ్ పెరిగింది.
* రైతుబజార్లలో కొరవడిన నాణ్యత...
రైతుబజార్లల్లో కూరల ధరలు కాస్తంత అందుబాటులో ఉంటున్నా వీటి నాణ్యత కొరవడుతోంది. నగరంలోని అక్కయపాలెం, సీతమ్మధార, మర్రిపాలెం, గోపాలపట్నం, ఎంవీపీ కాలనీ, మధురవాడ, త్రిటౌన్ పోలీసు స్టేషన్ సమీపానున్న రైతుబజార్లలో అన్ని రకాలైన కూరలు, ఆకుకూరలు అందుబాటులోనే ఉంటున్నాయి. అయితే వీటిలో నాణ్యత లేకపోవడం, కొలతల్లో వ్యత్యాసం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కూరల ధరలు పట్టిక ఉంటున్నా, ప్రారంభంలో ఉండే ధరలను చివరి క్షణంలో మారిపోతున్నాయి.
=====

ఏయూ ఆలూమినా అట్టహాసంగా జరగాలి
* డిసెంబర్ 4 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాలు * వేవ్స్ 2018 పోస్టర్ విడుదల చేసిన మంత్రి గంటా

విశాఖపట్నం, నవంబర్ 18: ఆంధ్ర విశవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశం అట్టహాసంగా జరగాలని మానవ వనరులుశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు, ఇతర విభాగాధిపతులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులతో ఆదివారం ఉదయం ఏయూలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి వేవ్స్ అనే పేరును ఖరారు చేశారు. ఏయూలో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడిన వారి వివరాలను విభాగాల వారీగా సేకరించాలని సూచించారు. వారందరినీ ఏయూ అలూమినాకు ఆహ్వానించాలన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10 నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి వీరందరికీ తప్పనిసరిగా ఆహ్వానాలు అందేలా చూడాలన్నారు. ఇకపై వర్శిటీలో చేరే ప్రతి విద్యార్థిని అలూమినాలో సభ్యునిగా చేర్చాలన్నారు. పీహెచ్‌డీ చేసిన విద్యార్థులను వెంటనే శాశ్వత సభ్యులుగా చేర్చాలన్నారు.ప్రపంచ స్థాయి లక్ష్యాలు నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సమావేశం వేడుకలను డిసెంబర్ 4 నుంచి వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు జరుగుతాయన్నారు. డిసెంబర్ 9న ఏయూ ఆచార్యులు, పూర్వవిద్యార్థుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 10న బీచ్‌రోడ్డులో వాక్‌థాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమ నిర్వాహణ, వేదిక ఏర్పాట్లు, వివిధ కమిటీల ప్రగతిని మంత్రి గంటా సమీక్షించి తగిన సూచనలు చేశారు. పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం ఆశించిన దానికంటే విజయవంత చేయాలన్నారు. సమావేశంలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు జీఎం రావు, వీసీ జీ నాగేశ్వర రావు, రెక్టార్ ప్రొఫెసర్ కే గాయత్రి దేవి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే నిరంజన్, ఆచార్యులు కే మోహన్ వెంకటరామ్, కుమార్ రాజ, కె రామమోహన్, పీ బాబీ వర్ధన్, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.