S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెరిగిపోతున్న పనిభారం...

విశాఖపట్నం, నవంబర్ 18: పెరిగిపోతున్న పనిభారం...మరోపక్క ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ విధానం అమలు...తెరమీదకు వచ్చిన సాంకేతిక ప్రయోగం...కొనే్నళ్ళుగా జరగని గ్యారేజీల్లో నియామకాలు...ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేందుకే అంటున్న అధికార వర్గాలు...ఇది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో పరిస్థితి...సంస్థ ఎటు వెళ్తుందో...్భవిష్యత్‌లో ఏమీ జరుగుతుందో...ఆర్టీసీ కార్మికుల్లో తెలియని అయోమయం...ఇటువంటి పరిస్థితులతో ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పనిభారం ఉంటోంది. కనీసం ఐదుగురు చేయాల్సిన చోట ఒకే ఒక్కరూ పర్మినెంట్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి వద్ద ఉండేది మిగిలిన వారంతా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువుగా ఉంటున్నారు. ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో పది డిపోలున్నాయి. గత కొనే్నళ్ళుగా తొమ్మిది డిపోలతోనే రీజియన్ నడుస్తుండగా, ఏడాదిన్నర కిందట మధురవాడ ప్రాంతానికి కొత్తగా డిపో మంజూరైంది. ఇది కాకుండా నగరంలో విశాఖ రూరల్, వాల్తేరు, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం, స్టీల్‌సిటీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోలున్నాయి. ప్రతిఒక్క గ్యారేజీలో కనీసం 70నంచి 100 మంది వరకు ఆర్టీసీ కార్మికులు పనిచేస్తుంటారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణలో భాగంగా ప్రతి గ్యారేజీలోను డీజిల్ మెకానిక్‌లు, మోటార్ మెకానిక్‌లు, టైర్ మెకానిక్‌లు, వెల్డర్లు, ఎలక్ట్రిషీయన్లు, పిట్టర్లు తదితర ట్రేడులకు చెందిన ఉద్యోగులు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ విధంగా వీరంతా డీజిల్ ఇంజన్లను సరిచేయడం, వీటి సామర్ధ్యాన్ని పెంచడం, అలాగే టైర్ల పరిస్థితులు ఎప్పటికపుడు పరిశీలించడం, బాడీ బిల్డింగ్, పాడయ్యే ప్రయాణికుల సీట్లను సరిచేయడం వంటి పనులు కార్మికులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ విదంగా నిర్వహించే కార్మికుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. పదవీవిరమణ, అనారోగ్యం, బదిలీలు తదితర కారణాలతో ఏర్పడిన ఖాళీలు గత కొనే్నళ్ళుగా నింపకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే విపరీతమైన పనిభారం పడుతోంది. కొనే్నళ్ళ కిందట నుంచి ఇదే పరిస్థితి. ఈ విధంగా 80శాతం మంది పనిచేసే గ్యారేజీల్లో శాశ్వత కార్మికుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. ఒకపుడు ఒక్కో గ్యారేజీలో 150మంది కార్మికులు పనిచేసే పరిస్థితులుండగా ఇది కాస్త వంద మందికి పడిపోయింది. ఆ తరువాత 80మంది ఇపుడు 50నుంచి 60మందికి చేరుకుంది. జిల్లా పరిధిలో కొన్ని గ్యారేజీల్లో అయితే కేవలం 10నుంచి 20 శాతం మందితోనే పనులు జరిగిపోతున్నాయి.
* పెరిగిపోతున్న ఔట్‌సోర్సింగ్ పనులు...
అనేకవిధాలుగా ఏర్పడిన ఖాళీలను ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా యాజమాన్యం భర్తీ చేస్తోంది. ఈ విధానం వలన ఆర్ధికపరమైన సమస్యలను అధిగమించవచ్చని భావిస్తోన్న యాజమాన్యం ఉన్న సిబ్బందిపైనే పనిభారం మోపుతోంది. మరోపక్క ఎటువంటి సాంకేతిక నైపుణ్యం లేని ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ముఖ్యమైన పనులన్నీంటినీ చేయిస్తుందనే విమర్శలు కార్మిక వర్గం నుంచి వ్యక్తమవుతోంది. ఈ విధంగా చేసిన ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికీ ప్రతినెల కేవలం రూ.12వేలు చెల్లిస్తున్నారు. వీరంతా కనీసం పది గంటలపాటు పనిచేయాల్సి వస్తోంది. ఒకవైపు పర్మినెంట్ సిబ్బంది తగ్గిపోతుండగా మరోపక్క 20నుంచి 40శాతానికి ఔట్‌సోర్సింగ్ కార్మికులు పెరిగారు. కాగా పర్మినెంట్ కార్మికుని నెల జీతం 40వేల నుంచి 50వేల వరకు ఉండగా, కొత్తగా తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కేవలం 12వేలు చెల్లించి పర్మినెంట్ ఉద్యోగి చేసే విధంగానే పనులు పూర్తిచేయించుకుంటున్నారు. అయితే వీరికి సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా ప్రత్యేక శిక్షణిస్తే కొంతవరకు ఫలితం ఉండేదని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. బాడీ బిల్డింగ్, టైర్లు, ఇంజన్లను పరిశీలించి వాటి సామర్ధ్యానికి సంబంధించి నై పుణ్యతతో పనిచేసే విధంగా వీరికి తర్ఫీదు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు.
* సాంకేతక ప్రయోగం...
బస్సుల నిర్వహణ సక్రమ పద్ధతిలో జరపాలనే ఉద్దేశ్యంతో గ్యారేజీల్లో పెరిగిపోతున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సాంకేతిక నైపుణ్యతను పెంపొందించడం కోసం ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు స్కిల్ డెవలెప్‌మెంట్ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విధులు ఏ విధంగా నిర్వహించాలి? ఇందులో మెళుకవులు తదితర అంశాలపై శిక్షణిస్తున్నట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు.
=====
చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతం
విశాఖపట్నం, నవంబర్ 18: చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నూతన చైతన్యాన్ని బలోపేతం చేసే దిశగా వచ్చేనెల 13వ తేదీ నుంచి మూడు రోజులపాటు చిల్డ్రన్ ఫెస్టివల్-2018ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్తవలస సమీపంలో శ్రీరామపురం (ఎల్.కోట మండలం, విజయనగరం జిల్లా)లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ మైరకు ట్రస్టు ప్రధాన కార్యదర్శి వేదుల మధురవాణి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో వివిధ జిల్లాల నుంచి 20వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారన్నారు. ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ తెనే్నటి సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది వడ్లమాని శేషావతారం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ సందర్భంగా మధురవాడ మాట్లాడుతూ బాలల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించి వారిని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పోటీల లక్ష్యంగా చెప్పారు. పోటీలకు హాజరయ్యే బాలలకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదన్నారు. అల్పాహారం, భోజన, ఉచితంగా కల్పిస్తారన్నారు. లలితే కళలు, రచనా సామర్ధ్యం, భావ వ్యక్తీకరణ, మాతృభాషపై పట్టు, విజ్ఞానం, విలువలు, వినోదం, నైపుణ్యం, దేశభక్తిని కలిగించే విధంగా 12 అంశాల్లో 36 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఐదు పాఠశాలలకు నగదు పురస్కారం ఇస్తారు. విశేషంగా రాణించిన మూడు పాఠశాలలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఆల్ రౌండ్ చాంఫియన్‌షిప్ ట్రోపీలు, ధ్రువీకరణ పత్రం, నగదు పురస్కారాన్ని ఇస్తారన్నారు. చిల్డ్రన్ ఫెస్టివల్-2018 గోడపత్రికను రాష్ట్ర మానవవనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఆవిష్కరించారు.
* విభాగాల వర్గీకరణ...
ఎల్‌కేజీ నుంచి మూడవ తరగతి (సబ్ జూనియర్స్) నాలుగు నుంచి ఏడవ తరగతి (జూనియర్స్), 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు (సీనియర్స్)గా వర్గీకరించారు.
* పోటీల వివరాలు...
డిసెంబర్ 13వ తేదీన చిత్రలేఖనం, వ్యాసరచన, తెలుగు కథలు, పౌరాణిక, సాంఘిక ఏకపాత్రాభినయనం, విచిత్ర వేషధారణ పోటీలు జరుగుతాయి. 14వ తేదీన కథారచన, తెలుగు పద్యాలు, శాస్ర్తియ, జానపద (వ్యక్తిగత బృంద) పోటీలు అదేరోజు సాయంత్రం విజేతలకు బహుమతులు ఇస్తారు. చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు సంబందించిన అంశాలను డిసెంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు వేదుల మధురవాణి, కార్యదర్శి, శ్రీరామ ఛారిటబుల్‌ట్రస్ట్‌ను సంప్రదించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.
====
రెవిన్యూ పార్కులో గీతం ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛ్భారత్
విశాఖపట్నం, నవంబర్ 18: గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్), గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఎండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఇఇఇ) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కైలాసగిరి సమీపంలో విశాలాక్షినగర్ రెవిన్యూపార్కులో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొని రెవెన్యూ పార్క్ పరిసరాలను శుభ్రం చేశారు. పార్కులో వ్యర్ధాలను తొలగించి మొక్కలకు నీరు అందే విధంగా పాదులు సరిచేయడంతోపాటు సందర్శకులకు పరిశుభ్రత పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయం గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎమ్.పోతరాజు, గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్, విద్యార్ధి వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ కె.వీరభద్రం, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ జీవి స్వామి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
====
19వ తేదీన చోడవరం బంద్‌కు సీపీఎం మద్దతు
విశాఖపట్నం, నవంబర్ 18: చోడవరం కోటవీధికి చెందిన 17 ఏళ్ళ మైనర్ బాలిక పద్మావతిని అతి కిరాతకంగా అత్యాచారం, హత్య చేసిన నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవంబర్వ తేదీన జరుగుతున్న చోడవరం బంద్‌కు సీపీఎం విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముక్కుపచ్చలారని 17 ఏళ్ళి మైనర్ బాలిక పద్మావతిపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనపై జ్యూడిషీయల్ ఎంక్వయిరీ చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలన్నారు. నిర్భయ రిలీఫ్ ఫండ్ రూ.25లక్షలు మంజూరు చేసి పద్మావతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు, హత్యలు నిత్యకృతవౌతున్నాయన్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలు, అమ్మాయిలు, చిన్నారులపైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. జిల్లాలో కోటవురట్లలో లోకేశ్వరిపై హత్యాయత్నం, గొలుగొండ మండలం అప్పన్నపాలెంకు చెందిన దివ్యశ్రీపై అత్యాచారం ఘటనల్లో నిందితులను శిక్షించకుండా ప్రభుత్వం, పోలీసులు అలసత్వం ప్రదర్శించారన్నారు. నిందితులను కఠింనగా శిక్షించకపోవడంతోనే జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేదింపులు జరగకుండా కట్టుదిట్టమనైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం తరపున డిమాండ్ చేసింది.
======

మొదటి జాతీయ నేచురోపతి దినోత్సవం
విశాఖపట్నం, నవంబర్ 18: నగరంలోని స్థానిక బీచ్‌రోడ్డులో యోగా విలేజీ ప్రాంగణంలో ఆదివారం జాతీయ నేచురోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, యోగా విలేజి డైరెక్టర్ డాక్టర్ రమేష్‌బాబు, నేచురోపతి వైద్యులు డాక్టర్ హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధులు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేచురోపతి వైద్య చికిత్సల గురించి డాక్టర్ తులసిరావు, డాక్టర్ రజిత వివరించారు. ఈ సందర్భంగా 500 మంది వైద్య శిబిరానికి హాజరై వైద్య సలహాలు తీసుకున్నారు. నేచురోపతి డైట్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.