S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేశానికే దిక్సూచిలా కేసీఆర్ పాలన

సూర్యాపేట, నవంబర్ 18: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ సీ ఎం కేసీ ఆర్ పాలనలో కేవలం నాలుగున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికే దిక్సూచిలా నిలిచిందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభతోపాటు ఎం కే మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర సమరయోధుడు లక్కరాజు పాండు సన్మానోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైఖ్య పాలనలో 60 ఏళ్లపాటు అభివృద్ధిలోవెనుకబడ్డామన్నారు. కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన దక్షతతో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్న ఘనత మనదేనన్నారు. రైతులకు రైతుబంధు పథకం కింది ఏడాదికి ఎకరాకు రూ.8వేల చొప్పున అందించడంతోపాటు రైతు కుటుంబాలకు ధీమానిచ్చే విధంగా బీమా పథకాన్ని సైతం అమలుచేస్తున్నామన్నారు. ప్రజలందరికి ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశాన్ని ఆకర్షిస్తుందన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలుచేస్తూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో దశాబ్ధాల కాలంగా మూసీ మురికి నీటిని తాగుతున్న ప్రజలకు విముక్తి కలిగించి స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందిస్తున్నామన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 3650 కోట్లతో అభివృద్ధిచేసి రూపురేఖలు మార్చినట్లు చెప్పారు. ప్రజలు మరోమారు ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధిలో ఆదర్శంగా సూర్యాపేటను నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గుణగంటి రాములు, శనగాని రాంబాబు, పుట్ట కిషోర్, ఫక్రుద్దిన్, కీసర వేణుగోపాల్‌రెడ్డి, యాదగిరి, ఖరీం, జాని, గడ్డం వెంకన్న, రాంబాబు, సలీం తదితరులు పాల్గొన్నారు.