S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బొల్లంకు కోదాడ టీఆర్‌ఎస్ టికెట్

నల్లగొండ, నవంబర్ 18: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌ను ఖరారు చేస్తు పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రకటన చేశారు. కోదాడ అభ్యర్ధిగా బొల్లం ఖరారుతో జిల్లాలోని పనె్నండు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు పూర్తయ్యింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బొల్లం మల్లయ్య యాదవ్ గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడారు. ఈ దఫా ప్రజాకూటమి సీట్ల కేటాయింపులో భాగంగా కోదాడ సీటు టీడీపీకి కేటాయిస్తారని చివరి వరకు ఎదురుచూసిన మల్లయ్య యాదవ్‌కు మరోసారి ఇక్కడి నుండి కాంగ్రెస్ తాజామాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌నే కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రకటించడంతో నిరాశే ఎదురైంది. దీంతో ఆగ్రహించిన బొల్లం తొలుత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికి కేసీఆర్ పిలుపుతో టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా ఖరారై అందరిని ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న యాదవ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే నాగార్జున సాగర్ నుండి నోముల నరసింహయ్యకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ చివరకు కోదాడ సీటును కూడా యాదవులకే ఇవ్వడం ద్వారా ఆ వర్గాలతో పాటు బీసీ వర్గాలను కూడా ఆకట్టుకునే వ్యూహాం అమలు చేసినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు బొల్లంకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్ నియోజవర్గ ఇన్‌చార్జి, టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించిన కన్మంత్‌రెడ్డి శశిధర్‌రెడ్డి పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తాను ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెబల్‌గా పోటీ చేస్తానంటు ప్రకటించి సంచలనం రేపారు. అయితే కేసీఆర్ ఆయనను బుజ్జగించి సమస్యను సద్ధుమణిగేలా చేస్తారని భావిస్తున్నారు. అటు కోదాడ టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే వెనెపల్లి చందర్‌రావు తాను బొల్లం గెలుపు కోసం పనిచేస్తానంటు ప్రకటించడం బొల్లంకు కొంత ఊరటనిచ్చింది. కోదాడలో పద్మావతి ఉత్తమ్‌ను ఓడించి గులాబీ జెండా ఎగురేయాలన్న లక్ష్యంతో ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రజాకూటమిలో విబేధాలను అనుకూలంగా మలుచుకుని టీడీపీ నేత బొల్లంను టీఆర్‌ఎస్‌లోకి రప్పించి టీఆర్‌ఎస్ టికెట్‌ను ఇప్పించినట్లుగా తెలుస్తుంది.
ప్రజాకూటమిలో తేలని
మిర్యాలగూడ అభ్యర్థిత్వం
తెలంగాణలో కాంగ్రెస్ పోటీ చేయాల్సిన సీట్లలో ఆరుసీట్లకు అభ్యర్ధిని ప్రకటించాల్సివుండగా అందులో మిర్యాలగూడ సీటు ఒకటిగా ఉంది. ఈ సీటును టీజేఎస్ కోరుతుండగా ఆ పార్టీ అధినేత కోదండరామ్ ఆదివారం పార్టీ అభ్యర్ధిగా గవ్వా విద్యాధర్‌రెడ్డికి బీ-్ఫమ్ ఇచ్చేయడంతో ఆయన నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. పొత్తులో టీజేఎస్‌కు సీటు వెళితే తాను సూచించిన తన బంధువు మేరెడ్డి విజయేందర్‌రెడ్డికి ఆ పార్టీ టికెట్ ఇవ్వాలని జానా కోరినా టీజెఎస్ పట్టించుకోలేదు. అయితే మిర్యాలగూడ సీటులో కాంగ్రెస్ నుండి తన కుమారుడు రఘువీరారెడ్డినే పోటీకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ సీనీయర్ కె.జానారెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం ఆదివారం రాత్రివరకు కూడా తన పట్టు వీడకుండా అధిష్టానం వద్ధ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో మిర్యాలగూడ సీటులో నామినేషన్ల ఉపసంహరణ నాటికిగాని కాంగ్రెస్, టీజేఎస్‌లలో ఏ పార్టీ అభ్యర్ధి రంగంలో ఉంటారన్న సంగతి తేలేలా కనిపించడం లేదు.