S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోహిత్‌ను ఆపతరమా!

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెర్త్‌లో 2016లో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగులతో అజేయంగా నిలిచిన టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను నిలువరించడం కష్టసాధ్యమని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మళ్లీ రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో పర్యటించే టీమిండియా జట్టులో రోహిత్ కీలకంగా మారనున్నాడని అన్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత్ 3 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 4 టెస్టులు, 3 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనుంది.
దాదాపు రెండునెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ టూర్‌లోప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఠోహిత్ శర్మ అత్యధిక పరుగులు సాధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. 31 ఏళ్ల రోహిత్ శర్మ బ్యాటింగ్ సరళి అద్భుతమని, వనే్డ ఇంటర్నేషనల్‌లో అతని అత్యధిక స్కోరు 265 పరుగులని అంటూ ‘రోహిత్‌ను ఆపలేం’ అని మాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ అత్యధిక కనీస స్కోరు 47 పరుగులని, ప్రస్తుత తరుణంలో ఎక్కువ పరుగులు చేయగల సత్తా అతనిలో ఉందని అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ అద్భుతంగా రాణించిన అంశాలను ప్రస్తావించాడు.