S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవశకానికి నాంది

* వచ్చే నెల 4నుంచి నేరుగా సింగపూర్‌కు * ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీకి కార్యాచరణ
అమరావతి, నవంబర్ 18: రాజధాని అమరావతి నవశకానికి నాంది పలకనుంది. విజయవాడ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ విమానం ఎగరనుంది. డిసెంబర్ 4 నుంచి సింగపూర్‌కు మన రాజధాని నుంచి విమానాలు నడపనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇది మరపురాని రోజు కానుందని వ్యాఖ్యానించారు. ప్రపంచశ్రేణి రాజధాని అమరావతి నిర్మాణంలో ఇదో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి ప్రపంచ దేశాలకు నేరుగా విమాన సదుపాయాలను విస్తృతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుందన్నారు. సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆదివారం అధికారులతో ఈ విషయమై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చంద్రబాబు సంతోషం వ్యక్తపరిచారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి వేగవంతం కావటంతో విజయవాడ విమానాశ్రయానికి రద్దీ పెరిగిందన్నారు. గత నాలుగేళ్లలో ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు అధికమైందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమానయాన సదుపాయాన్ని మెరుగుపరచటంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సింగపూర్‌కు విమాన సర్వీసుల ఏర్పాటుపై ఆ దేశ మంత్రి ఈశ్వరన్ సైతం ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు నిర్దేశించారు. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాల గురించి అధికారులు ప్రస్తావించగా పునరావాస, పరిహారం చెల్లింపులు త్వరితగతిన పూర్తిచేసి భూములను విమానాశ్రయ అధికారులకు అప్పగించాలన్నారు. ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు విమాన సదుపాయం కల్పిస్తేనే సామాజిక, ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, పారిశ్రామి అభివృద్ధి సాధ్యమవుతాయని చెపుతూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని ఇంధన, వౌలిక సదుపాయాలు, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విజయవాడ-పుట్టపర్తి మధ్య రోజుకు రెండుసార్లు, విజయవాడ - నాగార్జునసాగర్ మధ్య రోజుకు ఒకసారి విమాన సర్వీసులు ప్రతిపాదించామన్నారు. ఈ మార్గాల్లో 9 సీట్ల విమానాలు నడుపుతామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో 70శాతం రద్దీ పెరిగిందని అజయ్ జైన్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ - అక్టోబర్ నెలల మధ్యకాలంలో 7లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని, గత ఏడాది ఇదే సమయంలో 4.5 లక్షల మంది ప్రయాణించారన్నారు. రాష్ట్రం మొత్తంగా విమాన ప్రయాణికుల రద్దీ 33శాతం పెరిగిందన్నారు. 2014లో 13లక్షల మంది ప్రయాణిస్తే 2018 నాటికి ఆ సంఖ్య 41 లక్షలకు చేరిందన్నారు. విజయవాడ - సింగపూర్ మధ్య వారానికి రెండుసార్లు నడిపే నాన్‌స్టాప్ విమాన సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)ను సమకూర్చనుందని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి ఇండిగో సంస్థ ఈ మార్గంలో 180 సీట్ల ఏ 320 విమానాన్ని నడపనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో దుబాయ్‌కు సర్వీసులు నడిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. విజయవాడ - సింగపూర్ విమానాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ ప్రారంభించిందని అజయ్ జైన్ తెలిపారు. డిసెంబర్‌లో నడిపే విమానాలకు ఈ నెల 13వ తేదీకే సగం సీట్లు రిజర్వు అయినట్టు విమాన సంస్థ ప్రకటించిందన్నారు. ప్రారంభ విమానంలో 80శాతానికి పైగా బుకింగ్ అవుతాయని భావిస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు ప్రతి మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.40 గంటలకు, సింగపూర్ నుంచి ప్రతి మంగళ, గురువారాల్లో మధ్యాహ్నం 1.40 గంటలకు విమానాలు బయల్దేరతాయని అజయ్ జైన్ వివరించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ప్రత్యేక కమిషనర్ రామ్మోహన్‌రావు, అదనపు కమిషనర్ షణ్మోహన్, వీరేందర్ సింగ్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జే కృష్ణకిషోర్ పాల్గొన్నారు.