S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భూ కబ్జాదారులు, రౌడీలకు ఓటు వేయకండి

వరంగల్, నవంబర్ 18: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఏర్పడ్డ మహాకూటమి ఒక విఫల ప్రయోగమని, తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న విష ప్రయోగమని, కాంగ్రెస్ రాజకీయ వ్యూహాత్మక తప్పిదం చేసిందని, దీంతో నష్టపోయేది కూడా ఆ పార్టీయే అని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భావసారూప్యత లేని పార్టీలు, సిద్దాంతాలు లేని పార్టీలు జత కడితే ప్రజలు ఎలా ఆదరిస్తారని, నిర్మాణమే లేని తెలంగాణ జన సమితి, ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసినపుడే తెరాస విజయం ఖాయం అయ్యిందని పేర్కొన్నారు. మహాకూటమిలోని భాగస్వాములకు ఇచ్చిన 25 సీట్లు తమ ఖాతాలో ఉన్నట్లే అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి వలననే తెలంగాణలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ ద్రోహుల పార్టీ తెలుగుదేశం అని ఉద్యమ సమయంలో ప్రజలకు చెప్పిన కోదండరాం నేడు ఆ పార్టీలకు ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ జన వనరులను ఆపాలని కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబుతో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం సాధ్యం అవుతుందా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని తెలంగాణలో పాగావేసి తెలంగాణ వనరులను కొల్లగొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ హక్కులను కాపాడగల ఎకైక నాయకుడు కేసీఆర్ అని ప్రజలు నమ్మి పట్టకట్టారని, ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణాను నిలిపామని తెలిపారు. 17వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేశామని, రైతులకు భీమా పథకం ఏర్పాటు చేశామని, బిజేపి, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
నీటి పారుదల విషయంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా పురోగతి సాధించామని అన్నారు. 24 గంటల విద్యుత్తు, నీరు, శాంతిభద్రతల విషయంలో హైదరాబాదు ముందున్నందుననే పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌కు వస్తున్నారని వివరించారు. పరిశ్రమలకు అనుమతులు కూడా కేవలం 15 రోజులలోనే వస్తున్నాయని, 15రోజులలో అనుమతులు రాకుంటే 16వ రోజున అనుమతి వచ్చినట్లుగానే భావించి పరిశ్రమలకు సంబంధించిన పనులు కూడా చేసుకునేలా పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం పథకాలలో అనుకున్నంత ప్రగతి సాధించలేక పోయామని, దీనికి స్థలాభావం కారణమని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు నిండడంతో గ్రామాలలో భూమిని అమ్మడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో భూ పంపిణీ చేయలేకపోయామని వివరించారు. రాజకీయాలు ప్రక్షాళన కావాలంటే నీతి వంతులకు ఓటు వేయాలని, రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.