S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయం

మెదక్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఈ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని చేపడుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఈ నెల 21న మెదక్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా సభా స్థలిని, హెలిప్యాడ్ స్థలాన్ని మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షోభమే అన్నారు. మహాకూటమి ఈ ఎన్నికల్లో మాయమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విపక్షాలు అడ్డుకున్నా ఆగదన్నారు. ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. నాలుగు సంవత్సరాల తెరాస ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని ఆయన వివరించారు. అంతకు ముందు 40 సంవత్సరాలు కాంగ్రెస్, 20 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వాలు పాలించాయని, వారి హయంలో ఏమి అభివృద్ది జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఎంత అభివృద్ది జరిగిందని ప్రజలే బేరిజు చేసుకుంటున్నారన్నారు. వారి ప్రభుత్వాల్లో ఎరువుల కోసం రాస్తారోకోలు, చెప్పులు లైన్లో పెట్టుకున్నారు. తెరాస ప్రభుత్వంలో రైతులకు ఆ పరిస్థితి దాపురించలేదన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు కూటమి తెలంగాణకు నష్టమన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. తెలంగాణలోని ఏడు మండలాలను చంద్రబాబు రాష్ట్రంలో కలుపుకున్నాడని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్ట్‌ల విషయంలో చంద్రబాబు ఢిల్లీలో అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రైల్వేలైన్, ఘణపురం ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉన్న పనులన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేస్తామన్నారు. 21న కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు వస్తున్నట్లు తెలిపారు. తెరాస అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. మెదక్ జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఆ నియోజకవర్గాన్ని కూడా తెరాస కైవసం చేసుకొని కేసీఆర్‌కు అందజేస్తామన్నారు. మెదక్ నియోజకవర్గం నుండి పోటి చేస్తున్న మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఘన విజయం సాధిస్తుందన్నారు. మెదక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు, నాయకులు తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్‌రావు సమక్షంలో మంబోజిపల్లి మాజీ సర్పంచ్ రాములు, ఆయన అనుచరులు తెరాసలో చేరారు. మెదక్ పట్టణంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులు కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. జాతీయ రహదారులు మంజూరైనట్లు తెలిపారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.