S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జూలై-సెప్టెంబర్‌లో చైనాను మించిన భారత జిడిపి

న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో ఇది 7 శాతంగా నమోదైంది. తాజా గణాంకాలతో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటుతో దూసుకెళ్తున్న పొరుగు దేశం చైనాను భారత్ అధిగమించినట్లైంది. ఈ జూలై-సెప్టెంబర్‌లో చైనా వృద్ధిరేటు 6.9 శాతానికే పరిమితమవడం గమనార్హం. కాగా, తయారీ, గనులు, సేవా రంగాల్లో వృద్ధిరేటు పుంజుకుంది. ఇదిలావుంటే గత ఏడాది జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే మాత్రం తాజా గణాంకాలు తక్కువగానే ఉన్నాయి. నాడు 8.9 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ మేరకు గణాంకాల వివరాలను కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధిరేటు 8.1 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉంటుందని కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అంచనా వేస్తోంది.