S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 106 మీరే డిటెక్టివ్

మీకో ప్రశ్న

గాయత్రి మంత్రంలోని ఆరవ బీజాక్షరం. ‘రే’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
==============================================================
శ్రీమంతుడు, అందరి చేతా పూజింపబడే రాముడు బంధువుల మధ్య మళ్లీ భరతుడితో చెప్పాడు.
‘రాజశ్రేష్ఠుడైన దశరథుడికి, కైకేయికి పుట్టిన నువ్వు చెప్పిందంతా సబబుగానే ఉంది. మన తండ్రి పూర్వం నీ తల్లిని పెళ్లి చేసుకున్నప్పుడు అత్యుత్తమమైన ఈ రాజ్యాన్ని ఆమె కొడుక్కే ఇస్తానని కైకేయికి మాట ఇచ్చాడు. దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు నీ తల్లి చేసిన సేవకి చాలా సంతోషించి సమర్థుడైన రాజు ఆమెకి వరాన్ని కూడా ఇచ్చాడు. తర్వాత కీర్తి గల, ఉత్తమ జాతి స్ర్తి ఐన నీ తల్లి మహారాజుతో ఒట్టు పెట్టించుకుని నీకు రాజ్యం, నాకు అరణ్యవాసమనే రెండు వరాలని కోరింది. ఆమె ఇలా కోరగానే రాజు ఆ వరాలని ఆమెకి ఇచ్చాడు. వాటిల్లో ఒకటిగా పనె్నండు సంవత్సరాలు నేను అడవిలో నివసించాలని నన్ను తండ్రి ఆజ్ఞాపించాడు. నేను ఆయన చెప్పిన మాట మీదే స్థిరమై, ఎదురులేని వాడినై సీతాలక్ష్మణులతో కలిసి ఈ నిర్జన వనానికి వచ్చాను. ఓ రాజేంద్రా! నువ్వు కూడా మన తండ్రి చెప్పిన విధంగా వెంటనే పట్ట్భాషిక్తుడివై ఆయన సత్యవాదిత్వాన్ని నిలబెట్టు. నా మాట విని మహారాజుని ఋణ విముక్తుణ్ని చేయి. ధర్మం తెలిసిన తండ్రిని, తల్లిని సంతోషపెట్టు.
‘్భరతా! పూర్వం బ్రహ్మకపాల క్షేత్రంలో పితృదేవతల గురించి యాగం చేస్తూ గయుడు ఇలా చెప్పినట్లు విన్నాను. ‘కొడుకు తండ్రిని పుత్ అనే నరకం నించి రక్షిస్తాడు. పితృదేవతలని కూడా అన్ని విధాలా రక్షిస్తాడు. అందువల్ల అతనికి పుత్రుడు అనే పేరు వచ్చింది. గుణవంతులు, విద్యావంతులైన చాలామంది కొడుకులు కావాలని కోరుకోవాలి. ఎందుకంటే వారిలో ఏ ఒక్కడైనా ఆ క్షేత్రానికి వెళ్లచ్చు కదా? రాజర్షులంతా ఇదే నిర్ణయించారు. సమర్థుడైన ఓ భరతా! ఇందువల్ల నువ్వు తండ్రి నరకంలో పడకుండా రక్షించు. నువ్వు శతృఘు్నడితో, బ్రాహ్మణులు, మిగిలిన అందరితో కలిసి వెళ్లి ప్రజలని రంజింపచేయి. నేను సీతాలక్ష్మణులతో కలిసి వెంటనే దండకారణ్యానికి వెళ్తాను. భరతా! నువ్వు ఇప్పుడు సంతోషంగా అయోధ్యకి వెళ్లు. నేను సంతోషంగా దండకారణ్యానికి వెళ్తాను. సూర్యుడి ఎండని తొలగించే తెల్లటి గొడుగు నీ తల మీద చల్లటి నీడని ఇస్తుంది. నేను కూడా ఈ అరణ్యంలోని చెట్ల దట్టమైన నీడని సుఖంగా ఆశ్రయిస్తాను. భరతా! బుద్ధిశాలైన శతృఘు్నడు నీకు తోడుగా ఉంటాడు. లక్ష్మణుడు నాకు ప్రధాన మిత్రుడని తెలిసిన విషయమేగా. మనం నలుగురం కొడుకులం దశరథుడి సత్యవ్రతాన్ని నిలబెడదాం. విచారించకు.’ (అయోధ్యకాండ సర్గ 107వ సర్గ)
ధర్మాలు తెలిసిన రాముడు భరతుడికి ఇలా నచ్చచెప్తూండగా బ్రాహ్మణోత్తముడైన హంసకుడు ధర్మవిరుద్ధంగా ఇలా చెప్పాడు.
‘రామా! బాగు బాగు. ఉత్తమమైన బుద్ధి గల, ఆత్మాభిమానవంతుడైన నీకు సామాన్యుడైన మూఢుడిలా ఇలాంటి నిష్ప్రయోజనమైన ఆలోచన కలగకూడదు. ఎవడైనా ఒకడే పుడుతున్నాడు. ఒకడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరు ఎవరికి బంధువు? ఎవడు ఎవడ్నించి ఏం పొందగలుగుతాడు? రామా! తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారి మీద అధిక ప్రేమబంధం విడిచి ప్రయాణమై పోతూంటాడు. మనుషులకి తండ్రి, తల్లి, ఇల్లు అనేవి ఇలాంటి నివాస స్థలాలు మాత్రమే. సజ్జనులకి వాటి మీద బంధం ఉండదు. తండ్రి ద్వారా సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, విషమమైన, విచారకరమైన, అనేక ఉపద్రవాలతో నిండిన ఈ చెడ్డ దారిని పట్టద్దు. నువ్వు సర్వ సమృద్ధమైన అయోధ్యకి వెళ్లి పట్ట్భాషేకం చేసుకో. నువ్వు శ్రేష్ఠమైన రాజభోగాలని అనుభవిస్తూ దేవేంద్రుడు స్వర్గంలో విహరిస్తున్నట్లు అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. అతనికి నువ్వేమీ కావు. ఆ రాజు ఎవరో? నువ్వెవరో? అందువల్ల నేను చెప్పినట్లు చేయి. ప్రాణికి తండ్రి బీజం మాత్రమే. తల్లి ఋతుమతైనప్పుడు శుక్లం శ్రోణితం కలవగా మనిషి పుడుతున్నాడు. ఆ రాజు తను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయాడు. మరణశీలులైన మానవులు పద్ధతి ఇలాగే ఉంటుంది. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాల పాలవుతున్నావు. కేవలం డబ్బు, ధర్మాల కోసం పాటుపడే వాడిని చూస్తే నాకు విచారం కలుగుతుంది. ఇతరులని చూస్తే కలగదు. ఎందుకంటే ఆ అర్థ ధర్మపరులు ఈ లోకంలో కష్టాలని అనుభవించి, మరణానంతరం కూడా నాశనమవుతారు. ప్రజలు అష్టకాశ్రాద్ధమని, ప్రత్యార్థికా శ్రాద్ధమనీ చేస్తూంటారు. వాటి వల్ల ఎంత అన్నం వ్యర్థమవుతోందో చూడు. చచ్చినవాడు ఏం తినగలడు? ఇక్కడ ఒకడు తిన్న ఆహారం మరొకరి దేహంలోకి వెళ్లినట్లైతే పరాయి దేశాలకి వెళ్లే వాడికి శ్రాద్ధం పెట్టచ్చు. అది అతనికి దారిలో ఆహారం అవుతుంది కదా? యజ్ఞాలు చెయ్యి. దానాలు ఇవ్వు. దీక్ష వహించు. తపస్సు చెయ్యి. అన్నీ ఇచ్చెయ్యి అని చెప్తూ మేథావులు రాసిన గ్రంథాలన్నీ దానవశీకరణోపాయాలే. పరం అనేది లేదని నిశ్చయించుకుని ప్రత్యక్షమైన దాన్ని ఆచరించు. పరోక్షమైన దాన్ని లెక్క చేయకు. భరతుడు బతిమాలుతున్నాడు. అందువల్ల నువ్వు లోకంలో ఎన్నో ఉదాహరణలు గల నేను చెప్పిన ఆలోచనలని అంగీకరిస్తే రాజ్యాన్ని స్వీకరించు’

(అయోధ్యకాండ సర్గ 108వ సర్గ)

ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా ఆయన చెప్పిన కథలో ఆరు తప్పులు ఉన్నాయి అని కొందరు అనుకుంటూ వెళ్లడం విన్నాడు. అది నిజం కూడా.

ఆ ఆరు తప్పులని మీరు కనుక్కోగలిగారా?

1.రాముడి బస మంచి మాటలు చెప్పింది మందాకినీ నదీ తీరంలో. భాగీరథీ తీరంలో అని హరిదాసు తప్పుగా చెప్పాడు.
2.తను దేశం బయట ఉన్నప్పుడు తన తల్లి ఈ పాపకార్యం చేసిందని భరతుడు చెప్పాడు. కాని అతను ‘దేశం బయట ఉన్నప్పుడు’ అన్న సంగతి హరిదాసు చెప్పలేదు.
3.నేను ధర్మానికి భయపడి నా తల్లిని చంపలేక పోతున్నాను అని భరతుడు చెప్పాడు. కాని హరిదాసు ‘పెద్దలు వారించడం చేత’ అని తప్పుగా చెప్పాడు.
4.‘పోయిన వారి గురించి చెడు మాట్లాడుకూడదు కదా?’ అని భరతుడు చెప్పాడు. కాని అది హరిదాసు అదనంగా చేర్చింది. వాల్మీకి అది చెప్పలేదు.
5.వినాశకాలంలో ప్రాణుల బుద్ధి చెడిపోతుందనే లోకోక్తిని హరిదాసు ‘మంచి, చెడు ఆలోచించరుగా’ మార్చి చెప్పాడు.
6.జటలెక్కడ? రాజ్యపాలనం ఎక్కడ? అన్న మాటని హరిదాసు ‘జటలెక్కడ? కిరీటం ఎక్కడ?’గా మార్చి చెప్పాడు.
7.మహేశ్వరుడు ప్రాణుల మీద దయ చూపించినట్లుగా అని చెప్పడానికి హరిదాసు ‘విష్ణుమూర్తి ప్రాణుల మీద దయ చూపించినట్లుగా’ అని తప్పుగా చెప్పాడు.

=======================================================================
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

గాయత్రి మంత్రంలోని ఐదవ బీజాక్షరం ‘వ’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
అయోధ్య కాండ 44-5లోని
వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణో స్మిన్ స దానఘ శ్లోకంలో

-మల్లాది వెంకట కృష్ణమూర్తి