S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురి తప్పుతున్న సమాచార అస్త్రం!

అమలాపురం, నవంబర్ 30: సమాచార హక్కు చట్టం... సామాన్యుల చేతిలో పాశుపతాస్త్రం ఈ చట్టం అమల్లోకి వచ్చిన కొత్తలో అందరి నోటా వినిపించిన వాక్యం... నిజమే ఈ చట్టం నిజంగా పాశుపతాస్తమ్రే. అధికారిక గోప్యత పేరిట ప్రజాధనంతో చేపట్టే వివిధ ప్రభుత్వ కార్యకలాపాల్లో జరిగే అవినీతి, అక్రమాలను వెలికి తీయడానికి, అక్రమార్కుల ఆట కట్టించడానికి 2005లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. అయితే ఈ చట్టానే్న తమకు ఉపాధి కల్పించే చుట్టంగా మార్చేసుకుంటున్న ప్రబుద్ధుల కారణంగా పవిత్రమైన ఈ చట్టం అపహాస్యమవుతోంది. తాము కోరిన పనులు చేయని అధికార్లు, ఉద్యోగులను వేధించడానికి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ఈచట్టాన్ని ఉపయోగించుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోతున్నారు. ‘సమాచార హక్కు చట్టం కార్యకర్త’ అనే ఒక లేని హోదాను తగిలించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు హల్‌చల్ చేస్తుండటం విశేషం.
తమ మాట వినని అధికార్లను వేధించడానికి ఇలాంటి కార్యకర్తలు కొందరు బృందంగా ఏర్పడి రకరకాల సమాచారం కోసం పదుల సంఖ్యలో దరఖాస్తుచేయడం ఒక అలవాటుగా మారిపోయింది. దరఖాస్తుకు నిర్ణీత గడువులోగా స్పందించని పక్షంలో అప్పీలేట్ కమిషనర్ వద్ద హాజరవ్వాల్సి ఉండటంతో అధికార్లు అసలు బాధ్యతలను పక్కనపెట్టి, ఈ దరఖాస్తుల పరిష్కారంపైనే దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా వివిధ పనుల మీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
‘సమాచారం ఏ అవసరం నిమిత్తం అడుగుతున్నారు’ అనేది చెప్పనవసరం లేకుండానే అడిగిన సమాచారం ఇవ్వాలనే నిబంధన అడ్డుపెట్టుకుని కొందరు కోరుతున్న సమాచారం హాస్యాస్పదంగా ఉంటోంది. తాము కోరే సమాచారం సమాజానికి, ప్రజలకు ఏ రూపంలో ఉపయోగపడుతుందో ఆయా దరఖాస్తుదార్లే చెప్పాలి. జిల్లాలో ఇటీవలి కాలంలో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల్లో కొన్నిటిని పరిశీలిస్తే కొందరు వ్యక్తుల వ్యవహారం అవగతమవుతుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఒక అధికారిని ఆయన విద్యార్హతలు ఏమిటి, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కావాలని ఒక సమాచార హక్కు కార్యకర్త దరఖాస్తుచేశాడు. సాధారణంగా ప్రభుత్వ సర్వీసుల్లో చేరేవారికి నిర్ణీత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపికయ్యే వారి, విద్యార్హతలు, ఇతరత్రా అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ప్రత్యేకంగా పరిశీలించిన అనంతరమే సర్వీసులో చేర్చుకుంటారు. అలా సర్వీసులో చేరి, 20ఏళ్లకు పైబడి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికార్ల విద్యార్హతల సమాచారం కోసం ఇప్పుడు దరఖాస్తుచేయడం ఎందుకు అనేది ప్రశ్నార్థకం. ఇక ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఉంటే సర్వీసు రిజిస్టర్ల సమాచారం కావాలంటూ మరో దరఖాస్తుదారుడి కోరిక. తమ కుటుంబ సభ్యుల వివరాలు సైతం ఉండే సర్వీసు రిజిస్టర్లలో సమాచారం పూర్తిగా తమతమ వ్యక్తిగతమని, ఈ సమాచారాన్ని ఎలా బయటి వ్యక్తులకు ఇస్తారంటూ కొందరు ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఇది తమ కుటుంబ సభ్యుల రక్షణకూ చేటుచేయవచ్చనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.
వాస్తవానికి జిల్లాలో కొందరు వ్యక్తులే తరచూ ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం కోసం దరఖాస్తు చేస్తుండటం గమనార్హం. నిర్ణీత సమయంలో సమాచారం లభించని పక్షంలో పై అధికారి వద్ద అప్పీళ్లు చేసేదీ అత్యధిక శాతం వీరే. ఆపై సమాచార కమిషనర్ వద్ద అప్పీలు చేసేదీ వీరే కావడం గమనార్హం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద వచ్చిన దరఖాస్తులు, అప్పీళ్లను పరిశీలిస్తే కొన్ని పేర్లు చర్వితచరణంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు తీసుకున్న సమాచారంతో ప్రజలకు మేలు చేకూరే పనులు ఏమైనా చేశారా అని విశే్లషిస్తే వారి బండారం బయటపడుతుంది.
అలాగని ఇతర వ్యక్తులెవరూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంలేదని కాదు. అయితే ఇలా దరఖాస్తుచేసే ఇతరుల లక్ష్యం కేవలం తాము కోరిన సమాచారం లభించడమే. ఇందుకోసం ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా వేచివుండి సమాచారం తీసుకుంటున్నారు తప్ప అప్పీలు కోసం వెళ్లేవారు బహుతక్కువగా ఉంటున్నారు.
ప్రత్యేక సిబ్బందిని నియమించాలి
సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రతీ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించాలనే వివిధ శాఖల అధికార్ల డిమాండును ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎన్నికలు తదితర రాజ్యాంగపరమైన విధుల నిర్వహణకు ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులను కేటాయించినట్టే, ఎంతో కీలకమైన సమాచార హక్కు చట్టం దరఖాస్తుదార్లకు సమాచారం అందించే బాధ్యతలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఉద్యోగులను కేటాయించాలని అధికార్లు కోరుతున్నారు. దీనివల్ల పని వత్తిడిలో నిర్ణీత కాలావధిలో సమాచారం ఇవ్వలేక దోషులుగా నిల్చోవాల్సిన పరిస్థితి తలెత్తదని వారు పేర్కొంటున్నారు.
నాసిక్ సమీపంలో రోడ్డు ప్రమాదం
షిర్డీ యాత్రకు వెళ్లిన మల్లేపల్లి మహిళలకు గాయాలు - ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
గండేపల్లి, నవంబర్ 30: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన 18 మహిళలు ఈ నెల 27న షిర్డీ యాత్రకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 18 మంది మహిళలు ప్రైవేటు వాహనంలో షిర్డీ యాత్ర ముగించుకుని నాసిక్ వెడుతుండగా సోమవారం మధ్యాహ్నం వారి వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కాటేపల్లి విజయలక్ష్మి, ఎన్ వీరలక్ష్మి, బొల్లి సత్యవతి అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నాసిక్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిలో కాటేపల్లి లక్ష్మి, మల్లెమొగ్గల బేబి, నడిశెట్టి బేబి, పంచికట్ల వరలక్ష్మి, బొల్లి సీతారత్నం, బొల్లి సీతావాణి, కందుల సత్యవతి, చుండ్రు అమృత, పాలకుర్తి ధనలక్ష్మి, బొల్లి ప్రభావతి, దార్లంక సత్యవతి, బొర్రా వరలక్ష్మి, పంచకట్ల సత్యవేణి, చిట్టూరి మణి, కోట ఆదిలక్ష్మి గాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రమాద సమాచారంతో మల్లేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమవారి క్షేమ సమాచారం కోసం ఆదుర్దాగా కుటుంబ సభ్యులు అక్కడివారిని నిరంతరం సెల్‌ఫోన్లలో సంప్రదిస్తూ కనిపించారు.

స్వచ్ఛ గోదావరి జిల్లాకు కార్యాచరణ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 29: జిల్లాను రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో స్వచ్ఛ గోదావరి జిల్లాగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లా అంతటినీ బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా ప్రకటించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అధికార యంత్రాంగం అమలుచేస్తోంది. స్థానిక పార్టనర్లు (్భగస్వాములు) సహకారంతో ఈ కార్యక్రమాన్ని రానున్న మూడు, నాలుగేళ్ళలో నూరు శాతం విజయవంతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ముందుగా ఎంపిక చేసి, ప్రతి ఇంటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం, శాస్ర్తియ పద్ధతిలో వ్యర్ధ పదార్ధాల నిర్మూలన, మురుగునీటి నిర్వహణను చేపట్టడం ద్వారా పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం! ఈ ప్రాజెక్ట్ క్రింద అభివృద్ధి చేసేందుకు తొలి దశగా 62 గ్రామ పంచాయితీలను ఎంపిక చేశారు. ఈ 62 పంచాయితీలను స్వచ్ఛ పంచాయితీలుగా 2016 మార్చి నెలాఖరులోగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. ఈ గ్రామ పంచాయితీల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా అంతటా ఒకేసారి స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని చేపట్టే కంటే దశల వారీగా కొన్ని గ్రామాలను మూడు ప్రథాన అంశాలతో స్వచ్ఛ పంచాయితీలుగా అభివృద్ధి చేయాలని, రానున్న మూడు, నాలుగేళ్ళలో జిల్లాలోని అన్ని పంచాయితీలను బహిరంగ మల విసర్జన లేని స్వచ్ఛ పంచాయితీలుగా ప్రకటించే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించారు.
600 ఆకర్షణీయ గ్రామాల రిజిస్ట్రేషన్
స్వచ్ఛ పంచాయితీలతో పాటు మరోవైపు ఆకర్షణీయ గ్రామాల ఎంపిక ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 1000 గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 600 గ్రామాలను తీర్చిదిద్దడానికి భాగస్వాముల(పార్టనర్లు)తో రిజిస్ట్రేషన్లు చేయించారు. మరో 400 గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా ఎంపిక చేసేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఆయా ప్రాంతాల్లో గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకువచ్చే భాగస్వాములను గుర్తించడానికి గ్రామ సమన్వయ అధికారులను ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటుచేసింది. ఆయా గ్రామాల్లో ముందుకువచ్చిన పార్టనర్లతో గ్రామ సమన్వయ సంఘాలు సమావేశాలు ఏర్పాటుచేసి ఆకర్షణీయ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవల్సిన చర్యలపై బేస్‌లైన్ సర్వే పూర్తిచేసే వరకు ఉండకుండా అభివృద్ధికి ముందుకువచ్చే భాగస్వాముల సహాయంతో యుద్ధప్రాతిపదికపై అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. పలువురు దాతలు అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఎదురుచూస్తుంటారని, అటువంటి వారిని ప్రభుత్వ యంత్రాంగమే గుర్తించి, ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా కోరుతుందని, తద్వారా వారి సేవలు దేశానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
పంచారామ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం
రామచంద్రపురం, నవంబర్ 30: కార్తీకమాసం మూడవ సోమవారం ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతిరావు నేతృత్వంలో సిబ్బంది, అనువంశిక అర్చకస్వాములు, వేదపండితులు, రుత్విక్కులు, స్వస్తివాచకులు భక్తులకు సేవలందించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, లక్షపత్రి పూజా కార్యక్రమాలను రుత్విక్కులు నిర్వహించారు. కార్తీక నోములు, వ్రతాలను సామూహికంగా భక్తులు నిర్వహించుకున్నారు. తూర్పుగోపురం అశ్వథ్థ నారాయణ వృక్షం వద్ద భక్తులు ప్రదక్షిణలు నిర్వహించారు. అదే విధంగా ధ్వజస్థంభం, తదితర ప్రాంతాల్లో ముతె్తైదువులు దీపాలు వెలిగించారు. ఆలయం ప్రాంగణంలో ద్రాక్షారామ ఏరియా పరిధిలోని ఎరువులు, పురుగుమందుల అమ్మకందారులు, ఫైనాన్షియర్స్ సౌజన్యంతో యాత్రీకులకు అన్నప్రసాద వినియోగం చేశారు. ఆలయం చెంతనే ఉన్న శ్రీ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రంలో విశేష సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, నిరతాన్నదాత, విద్యాలయాల అధినేత శ్రీ పైండా సుబ్రహ్మణ్య జగన్నాధ సత్యప్రసాద్ జమీందార్, జిల్లా పోలీస్ ఓఎస్‌డి శివశంకరరెడ్డి తదితరులు ఆలయ సందర్శన చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.
సామర్లకోట: పవిత్ర కార్తీకమాసం మూడో సోమవారం సామర్లకోట పంచారామక్షేత్రం భీమేశ్వరాలయం ప్రాంగణం శివ నామ స్మరణలతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి నుండి జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ పుష్కరిణిలో, గోదావరి కాల్వ వద్ద గల పుష్కర స్నానవాటికలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వదిలారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ అభిషేక పండిట్ వేమూరి సోమేశ్వర శర్మ, అర్చకుల బృందం శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. తదుపరి భీమేశ్వరుని యోగ లింగానికి పిఠాపురం మహారాజా గోత్ర నామాలతో తొలి అభిషేకం చేపట్టారు. ఆధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో రుద్రాభిషేకాలు, అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే ద్వజస్థంభం వద్ద, రావిచెట్టు వద్ద, మారేడుచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతికి చెందిన గాలి ఆనందరావు కుటుంబం లక్షపత్రి పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను ఇఒ పులి నారాయణమూర్తి, మండల రైతు సంఘం అధ్యక్షుడు కంటే జగదీష్ మోహన్‌బాబు, భక్త సంఘం నాయకులు పర్యవేక్షించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్ ఆద్వర్యంలో ఎస్సైలు ఆకుల మురళీకృష్ణ, కొండా వెంకట నాగార్జున, వై సతీష్ పర్యవేక్షించారు.
పురాతన శివాలయంలో విశేష పూజలు
శంఖవరం, నవంబర్ 30: మండలంలోని నెల్లిపూడి గ్రామంలో పూజారి జగ్గమ్మచెర్వు సమీపాన గల 12వ శతాబ్దానికి చెందిన శివాలయం లో కార్తీక సోమవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని ‘ఆంధ్రభూమి’ సోమవారం ప్రముఖంగా ప్రచురించడంతో, భక్తులు భారీగా తరలివచ్చి శివయ్యకు అభిషేకాలతో తరించారు. విరాళాలు అందించి తమ భక్తిపారవశ్యాన్ని చాటుకున్నారు. పవిత్ర కార్తీకమాసంలో శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో వెలుగులోకి వచ్చిన ఈ శివాలయానికి మహిళలు భారీగా తరలివచ్చారు. శివలింగానికి పవిత్ర జలాభిషేకాలు చేసేందుకు ఉత్సాహం చూపారు. వేకువజాము నుండి అర్చకస్వాములు పరమేశ్వరునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు గావించారు. పురాతన శివాలయం కావడంతో శివలింగానికి దైవగుణం అధికంగా ఉంటుందని పలువురు పెద్దలు చెప్పడంతో, స్వామిని దర్శించేందుకు నెల్లిపూడితోపాటు, పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
దాతల విరాళాలు
పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేసేందుకు సోమవారం దర్శించిన భక్తుల్లో హైద్రాబాద్‌కు చెందిన పప్పుశెట్టి మురళి, రాజ్యలక్ష్మి దంపతులు రూ.20,100లు, కాకినాడకు చెందిన వ్యాపారులు అందె నళినీమోహన్, హైమావతి దంపతులు 100 బస్తాల సిమెంట్, నెల్లిపూడి గ్రామానికి చెందిన రైతు అరిగెల బాపన్నదొర, జగదీష్ కుటుంబీకులు 100 బస్తాల సిమెంట్‌ను విరాళంగా అందజేశారు. అలాగే నెల్లిపూడి గ్రామంలో నిర్మితమవుతున్న కృష్ణాలయం, దాని మండపానికి అందె నళినీకుమార్, హైమావతి దంపతులు రూ.లక్ష విరాళం అందించారు. కార్యక్రమంలో ఎంపిపి బద్ధి మణిరామారావు, మాజీ సర్పంచ్‌లు పిర్ల నాగేశ్వరరావు, బద్ధి రమణ, నరాల శ్రీను, మండల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బద్ది రామారావు తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టరు ఢీకొని మహిళ మృతి
కాకినాడరూరల్, నవంబర్ 30: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు కుమార్తెలకు భోజనం ఇచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన తల్లి తిరిగి వస్తుండగా ట్రాక్టరు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాద వార్త తెలియగానే భర్త ఆవేదనతో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన కాకినాడ రూరల్ మండలం సర్పవరం రోడ్డులో జీవల్‌మెడో అపార్టుమెంటు గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి. అపార్టుమెంటులో గత కొనే్నళ్లుగా హైదరాబాద్‌కు చెందిన జమీల్ అహ్మద్, భార్య సుబాన్ సుల్తాన్, ఇద్దరు కుమార్తెలతో కాపురముంటున్నారు. భర్త ఒక ఆయిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఉన్న శుభానికేతన్ స్కూలులో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలకు క్యారేజి ఇచ్చి తిరిగి ఇంటికి స్కూటర్‌పై వెళుతున్న సుబాన్‌ను ఎదురుగా వేగంగా వస్తున్న ఇటుకల లోడు ట్రాక్టరు ఢీకొంది. ఈ ఘటనలో సుభాన్ (36) అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటరును ఢీకొన్న అనంతరం ట్రాక్టరు ఇంజను బోల్తాపడింది. భార్య మరణ సమాచారం తెలిసిన భర్త జమీల్ అహ్మద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సర్పవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టరు డ్రైవరును అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం సిఐ మురళీకృష్ణారెడ్డి తెలిపారు.

సత్యదేవునికి నేడు బంగారు తాపడం ప్రారంభం
శంఖవరం, నవంబర్ 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి వారి అంతరాలయానికి ఒక భక్తుడు చేయించిన బంగారు తాపడాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రారంభించనున్నారు. సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 6 గంటలకు ఈ ఆభరణాన్ని ప్రారంభించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం రాత్రి అన్నవరం దేవస్థానంపై బసచేశారు. బంగారు తాపడం ప్రారంభోత్సవానికి దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
విద్యార్థిని మరణంపై
వైస్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
రాజవొమ్మంగి, నవంబర్ 30: స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్ సలోమిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22న ఇదే కళాశాలలో ప్రథమ ఇంటర్ చదువుతున్న వెలుసూరి పార్వతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా ఉన్నందున పార్వతి మరణానికి సలోమినీ బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందాయని ప్రస్తుత ప్రిన్సిపల్ పి వి నరసింహారావు తెలిపారు.
శనేశ్వర ఆలయంలో లక్ష బిల్వార్చన
కొత్తపేట, నవంబర్ 30: మండల పరిధిలోని మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన, పంచామృతాభిషేకాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. యర్రమిల్లి సత్యనారాయణ, లక్ష్మీనరసమాంబ దంపతులచే నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఆలయంలోని పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఇవో వెత్సా దేముళ్ళు తదితరులు పాల్గొన్నారు.
మండపేట శివాలయంలో ఆన్‌లైన్ సేవలు
మండపేట, నవంబర్ 30: తపాలాశాఖలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయని రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి అజమ్‌తుల్లా అన్నారు. సోమవారం మండపేటలో తపాలా శాఖ కార్యాలయంలో ఇండియన్ బ్యాంకు మేనేజరు ఎస్‌కె బెహరా ముఖ్యఅతిథిగా పాల్గొని ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. మరో ముఖ్యఅతిథి పోస్టల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరులోగా రాజమండ్రి డివిజన్‌లో అన్ని తపాలా కార్యాలయాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు ప్రాంభమవుతాయన్నారు. ప్రజలంతా తపాలాశాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ టి పుల్లేశ్వరరావు, పోస్టుమెన్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎం సుబ్బారావు, ఇడి ఉద్యోగుల నాయకుడు ఎండి షరీఫ్, పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శి ఎస్‌వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అనపర్తి, ద్వారపూడి, కపిలేశ్వరపురం, ఏడిద కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
ఇక ఎవరితోనూ పొత్తులుండవు
-ప్రత్యామ్నాయశక్తిగా వామపక్షాలు
-కార్పొరేట్ కంపెనీలా టిడిపి పాలన
-జిఎస్‌టిపై టిడిపి వైఖరి స్పష్టంచేయాలి
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు
రాజమండ్రి, నవంబర్ 30: భవిష్యత్తులో వైఎస్సార్‌సిపితో సహా ఏ పార్టీతో తమకు పొత్తులు ఉండవని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైసిపిలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా వారి మసి తమకు అంటిందని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పొత్తుల వల్ల తమ పార్టీ బలహీనపడిందన్నారు. భవిష్యత్తులో 10 వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్‌పార్టీ రూపొందించిన జిఎస్‌టి బిల్లును నేడు ఎన్‌డిఏ ప్రభుత్వం ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఈ బిల్లు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల కన్నా ఎపిలో పన్నులు ఎక్కువగా ఉన్నాయన్నారు. జిఎస్‌టి ఎంతో ప్రమాదకరమైందని, దీనిలో పరోక్ష పన్నులు ఉంటాయన్నారు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా 22శాతం ఏకరీతిలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పేదలపై పన్నుల భారాలు మోపి, బడ్జెట్‌లో పెద్దలకు రూ.5.90 లక్షల కోట్ల రాయితీలు ప్రకటించిందని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈబిల్లును వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఈ బిల్లు విషయంలో టిడిపి లోపాయికారీ విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. జిఎస్‌టి బిల్లుపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఒక కార్పొరేట్ కంపెనీలా పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. భూ బ్యాంకుల పేరిట ప్రభుత్వం 15 లక్షల ఎకరాల రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. భూ బ్యాంకు పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఎస్‌ఇజెడ్‌లకు కేటాయించిన భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందన్నారు. రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను భర్తీచేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే రూ.2300 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై అఖిలపక్షంతో చర్చించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం వృద్ధి 9.4శాతం తగ్గిందని, అలాగే పారిశ్రామికాభివృద్ధి కూడా కుంటుపడిందని మధు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మత్స్య తదితర రంగాలు అభివృద్ధి చెందాయని తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వశాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే 3లక్షల మంది ఉద్యోగులు, కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నెలకొన్న మత అసహనంపై మంగళవారం నుంచి ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎన్డీఏ హయాంలో రచయితలు, శాస్తవ్రేత్తలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. ఈవిధానాలు కొనసాగితే బీహార్ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని హెచ్చరించారు.