S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వచ్చే మూడేళ్ళలో రూ. 60,000 కోట్ల పెట్టుబడులు

ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్ * మెరుగైన సేవలపై దృష్టి

న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రైవేట్‌రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ వచ్చే మూడేళ్ళలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. నెట్‌వర్క్ విస్తరణ, అప్‌గ్రేడ్‌కు ఈ నిధులను వినియోగించనుంది. ఫలితంగా నాణ్యమైన సేవలను అందించాలని ప్రయత్నిస్తోంది. కాగా, ‘ప్రాజెక్ట్ లీప్’లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 70,000లకుపైగా బేస్ స్టేషన్లను ఎయిర్‌టెల్ ఏర్పాటు చేయనుంది. రాబోయే మూడేళ్ళలో మొత్తం దేశవ్యాప్తంగా 1,60,000లకుపైగా బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇదిలావుంటే యాక్టివ్, ప్యాసివ్ నెట్‌వర్క్, స్పెక్ట్రమ్, ఫైబర్, సబ్‌మెరైన్ కేబుల్స్, సిస్టమ్స్‌లలో ఇప్పటిదాకా ఎయిర్‌టెల్ 1,60,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టింది. ఈ మేరకు భారత్, దక్షిణాసియాలోని భారతీ ఎయిర్‌టెల్ ఎండి, సిఇఒ గోపాల్ విట్టల్ సోమవారం ఇక్కడ తెలిపారు.
కాల్‌డ్రాప్స్‌తో నష్టం
కాల్‌డ్రాప్స్ సమస్యతో కేవలం వినియోగదారులు మాత్రమే నష్టపోవడం లేదని, టెలికాం సంస్థలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయని భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ అఖిల్ గుప్తా అన్నారు. స్పెక్ట్రమ్ కొనుగోలుకు వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని, అయినప్పటికీ మొబైల్ టవర్ల కొరత తదితర సమస్యల కారణంగా స్పెక్ట్రమ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామన్నారు. సోమవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోజుకు మూడు కాల్‌డ్రాప్స్‌కు రూపాయి చొప్పున వినియోగదారులకు టెలికాం సంస్థలు చెల్లించాలని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశించడాన్ని ప్రస్తావించారు. దీనివల్ల ఏటా టెలికాం సంస్థలపై 54,000 కోట్ల రూపాయల భారం పడే వీలుందన్నారు. వౌలిక రంగ సమస్యలు, ముఖ్యంగా కావాల్సినన్ని టవర్లు లేకపోవడం వల్లే కాల్‌డ్రాప్ సమస్యని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమ సంస్థ ఈ దిశగా దృష్టి సారించిందని, మెరుగైన సేవల కోసం సమీప భవిష్యత్తులో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్నట్లు చెప్పారు.