S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మన పని (సండేగీత )

కొన్ని పనులు చేయాల్సిన అవసరం వున్నా
చేయాలని అన్పించదు.
మనతో సాధ్యం కాదని అన్పిస్తుంది.
భయం వేస్తుంది.
విజయం వుంటుందో వుండదోనని అన్పిస్తుంది.
వైఫల్యం మనని వెంటాడుతుంది.
పర్వాలేదు.
ఆ పనిని చేయండి.
ఎలాగైనా సరే చేయండి.
చాలాసార్లు
చాలా పనులని వాయిదా వేస్తాం.
కథలు రాయడాన్ని కథకులు
చిత్రాలని చిత్రకారులు
ఏదో ఒక కారణంగా వాయిదా వేస్తుంటారు.
ఇంకా
కొద్ది రోజులు వేచి చూస్తే పరిపూర్ణత వస్తుందని
వాయిదా వేస్తుంటారు
అవసరం లేదు.
ఆ పనిని మొదలుపెట్టండి.
ఆ పనే మిమ్ములను ముందుకు తోసుకొని వెళ్తుంది.
మనం చేసే పని
బాగా లేకపోతే
ఎవరో నవ్వుతారని
ఏమో అనుకుంటారని
అనుకోవాల్సిన అవసరం లేదు.
ఏమీ చేయకపోవడం వల్ల ఉపయోగం లేదు
ఏదో సాకు వల్ల
మనకి మనం సమాధానం చెప్పుకోవచ్చు.
కానీ
ఉపయోగం లేదు.
దానివల్ల ఏమీ మార్పు రాదు
మనం
ప్రయత్నం చేయడం వల్లనే మార్పు వస్తుంది.
అందుకని
మన పని మనం చేయాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001