S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (2-12-2018 నుంచి 8-12-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం పోటీ రంగంలో విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. రుణాలు రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశం. సౌకర్యాలు ఇబ్బందులకు గురి చేయవచ్చు. సోమవారం లాభాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. మంగళవారం ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. జాగ్రత్త. బుధవారం పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. కొన్ని గౌరవ లోపాలుంటాయి. ఊహించని సంఘటనలు. గురువారం ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు. అనుకోని సమస్యలు. నూతన కార్యక్రమాలను వాయిదా వేయాలి. శుక్రవారం వ్యాపార వ్యవహారాల్లో నష్టాలకు అవకాశం. ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త. అప్రమత్తంగా మెలగాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత. మాట తీరులో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచుకుంటారు. ఖర్చులు పెట్టుబడులున్నా సంతోషం ఉంటుంది. విహార యాత్రలుంటాయి. సోమవారం పరిచయాలు అనుబంధాల విషయంలో జాగ్రత్త. భాగస్వామితో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. శ్రమాధిక్యం. మంగళవారం కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పరామర్శలకు అవకాశం. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. బుధవారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో సంతృప్తి. గృహ వాహనాదుల్లో అనుకూలత. గురువారం ఆలోచనల్లో జాగ్రత్త అవసరం. సంతానవర్గ వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. నూతన వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. శుక్రవారం వ్యాపారాదుల్లో అనుకూలత.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. అనుకోని సంఘటనలు. శ్రమ ఉన్నా గుర్తింపు. సోమవారం సోదర వర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. వార్తలు ఇబ్బంది పెట్టే అవకాశం. ఎదుటివారికి సహకారం అందించడం మంచిది. మంగళవారం అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలు. ఆకస్మిక ఇబ్బందులు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బుధవారం నిర్ణయాదులకు అనుకూలం. బాధ్యతలు అధికం. గౌరవం పెంచుకోవడానికి శ్రమించాలి. ఖర్చులు, ప్రయాణాలు. గురువారం ఆలస్య నిర్ణయాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. బద్ధకం తగ్గించుకోవాలి. పరోపకారం, శ్రమించడం మంచిది. శుక్రవారం వ్యాపారాదుల కోసం వెచ్చిస్తారు. భాగస్వామ్యాలు ప్రభావితం అవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సహకారం లభిస్తుంది. సంప్రదింపులుంటాయి. వార్తలు ఆనందాన్నిస్తాయి. సంతానవర్గ సంతృప్తి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. ఘర్షణలకు అవకాశం. సామాజిక గౌరవం లభ్యం. శ్రమాధిక్యం. మంగళవారం సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలుంటాయి. వార్తల వల్ల చికాకులకు అవకాశం. బుధవారం పోటీ రంగంలో విజయం సాధిస్తారు. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాల వల్ల ఉన్నతి. గురువారం అనుకోని సమస్యలుంటాయి. స్నేహానుబంధాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త. కొత్తవారితో ఇబ్బందులు. శుక్రవారం వ్యాపార వ్యవహారాల్లో సంతృప్తి, అభీష్టాలు నెరవేరుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం నిర్ణయాదుల్లో అనుకూలత. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. బాధ్యతలు సంతృప్తినిస్తాయి. కార్యనిర్వహణలో గుర్తింపు. వ్యవహార విజయం. సోమవారం వ్యతిరేక ప్రభావాలు తీవ్రవౌతాయి. పోటీలు ఒత్తిడులను బలవంతంగా అధిగమించాలి. శ్రమాధిక్యం. మంగళవారం కుటుంబంలో జాగ్రత్త వహించాలి. లాభాలు ఆశించినంతగా అందవు. పెద్దలతో ఇబ్బందులుంటాయి. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు లభిస్తాయి. నిల్వధనం పెంచుకుంటారు. మాటల్లో అనుకూలత. గురువారం సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో ఒత్తిడులు. శ్రమతో కార్యాలు. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం వ్యాపారపరమైన సంప్రదింపులుంటాయి. అధికారిక, వృత్తి, ఉద్యోగాదుల్లో సహకారం లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం ఉన్నత విద్యలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలపై దృష్టి. ఆధ్యాత్మిక ప్రయాణాదులకు అనుకూలం. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పరిచయాలు పెరిగే అవకాశం. సోమవారం కుటుంబంలో జాగ్రత్త. మాటల్లో అధికారిక ధోరణి. తొందరపాటు కూడదు. కొంత అసంతృప్తి. మంగళవారం పరిచయాలు, స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. భాగస్వామితో తొందరపాటు కూడదు. ఇబ్బంది. బుధవారం పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులకు అవకాశం. గురువారం వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. ఆసుపత్రుల సందర్శనం. పరామర్శలకు అవకాశం. విశ్రాంతి లోపం. శుక్రవారం వ్యాపారాదుల్లో లాభాలు, కార్యనిర్వహణలో గౌరవం పెంచుకుంటారు. వ్యతిరేకతలపై విజయం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం కుటుంబంలో అనుకూలత. సౌకర్యాలు మెరుగు పరచుకుంటారు. ఆహార విహారాలపై దృష్టి. ఆర్థిక నిల్వలపై సంతృప్తి. శ్రమతో సౌఖ్యం పెంచుకుంటారు. సోమవారం ఉన్నత వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. అసంతృప్తి. మానసిక ఘర్షణలకు అవకాశం. గౌరవ సమస్యలు. మంగళవారం కుటుంబంలో ఒత్తిడులు. నిల్వధనం లోపించవచ్చు. మాటల్లో జాగ్రత్తగా మెలగాలి. అభీష్ట సిద్ధి. బుధవారం సంతాన వర్గంపై ప్రత్యేక దృష్టి. భాగస్వామ్యాల్లో పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీ రంగంలో విజయం. గురువారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాల్లో జాగ్రత్త. సామాజిక అనుబంధాలు శ్రమకు గురి చేస్తాయి. శుక్రవారం వ్యాపారాల్లో ఉన్నతి. పోటీల్లో విజయం. సౌకర్యాలు ఇబ్బందులకు గురి చేస్తాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులుంటాయి. విందులు విహారాలు సంతోషాన్నిస్తాయి. ప్రయాణావకాశాలు. ఆహారం కోసం వెచ్చిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. సోమవారం మానసిక ఒత్తిడులు. సృజనాత్మక శక్తి ఉన్నా జాగ్రత్త అవసరం. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. మంగళవారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అపోహలకు అవకాశం. గౌరవ లోపం. బుధవారం కుటుంబంలో అనుకూలత. మాట తీరులో సంతోషం. నిల్వధనం పెంచుకునే సూచనలు. గుర్తింపు. గురువారం సంప్రదింపుల్లో జాగ్రత్త. సేవక వర్గ సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు శ్రమకు గురి చేస్తాయి. శుక్రవారం వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. సుదూర ప్రయాణాలుంటాయి.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలుంటాయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త. సోమవారం నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. మంగళవారం వ్యతిరేకతలను అధిగమించాలి. పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. లక్ష్యాలను సాధిస్తారు. గురువారం పెద్దలతో జాగ్రత్త అవసరం. లాభాలు కోల్పోయే అవకాశం. తక్కువ ప్రయోజనాలుంటాయి. శ్రమాధిక్యం. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. వ్యాపారాల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోమవారం సహకార లోపం. అనుకోని ఇబ్బందులు. చిన్నచిన్న ప్రమాదాలకు, మానసిక వత్తిడులకు అవకాశం. వార్తలు ఇబ్బంది పెడతాయి. మంగళవారం అపోహలకు ఆస్కారం. శ్రమాధిక్యం. తొందరపాటు కూడదు. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. బుధవారం ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి. సంతానవర్గ సంతోషం. గురువారం మానసిక ఒత్తిడులు. అన్ని విషయాల్లో వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. పోటీ రంగంలో జాగ్రత్త అవసరం. శుక్రవారం సంతోషంగా గడుపుతారు. వ్యాపారాదుల్లో అనుకూలత. వ్యవహార విజయం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లో అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆలోచనలు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సోమవారం గృహ వాహనాది సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఒత్తిడులు. మంగళవారం ఊహలు, దూర ప్రయాణ భావాలుంటాయి. ఉన్నత విద్యలపై దృష్టి. కాలం ధనం వ్యర్థం కావచ్చు. బుధవారం నిర్ణయాదుల్లో అనుకూలత. బాధ్యతలు అధికం. శ్రమతో కార్యాలు. గౌరవం పెంచుకుంటారు. గురువారం కుటుంబంలో ఒత్తిడులు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. మాటల వల్ల ఇబ్బందులుంటాయి. శ్రమాధిక్యం. శుక్రవారం వ్యాపారాదుల్లో అనుకూలత. కొంత అప్రమత్తంగా మెలగాలి. లాభాలు ఒత్తిడులకు గురి చేయవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం పరిచయాలు భాగస్వామ్యాల్లో అనుకూలత. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గంతో సంతృప్తి. సృజనాత్మక శక్తి విస్తరిస్తుంది. సోమవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. కాలం ధనం వ్యర్థం కావచ్చు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. మంగళవారం మానసిక ఒత్తిడులుంటాయి. సృజనాత్మక శక్తి అధికం. తొందరపాటు కూడదు. ప్రణాళికా లోపాలు. బుధవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలు అధికం. కార్యనిర్వహణలో జాగ్రత్తగా మెలగాలి. ఆధ్యాత్మిక వ్యవహారాలు. శుక్రవారం వ్యాపారాదులకు అనుకూలం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సౌకర్యాలు పెంచుకునే యత్నం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744