S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇది తింటే ఆసుపత్రిపాలే!

ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయ కరోలినా రీపర్. కరోలినా రీపర్ నుంచి సగటున 15, 69, 300 స్కొవిల్ స్కేల్ యూనిట్స్ ( ఎస్‌హెచ్‌యూ) ఉత్పత్తి అవుతాయి. 2013లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పేర్కొంది. దక్షిణ కరోలినాలోని పకర్‌బట్ పెప్పర్ కంపెనీకి చెందిన ఎడ్‌కర్రీ ఈ మిరప సృష్టికర్త. దీనిని సృష్టించడానికి ఆయనకు పదేళ్లు పట్టింది. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్‌లో కేన్సర్‌ను నయం చేసే గుణాలు ఉన్నాయని గుర్తించడంతో ఆయన ఈ మిరపకాయలను సృష్టించారు. తన ఆదాయంలో సగాన్ని ఆయన కేన్సర్ పరిశోధనకు విరాళంగా ఇస్తున్నారు.
ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతానికి చెందిన 34 సంవత్సరాల ఓ వ్యక్తి మిరపకాయలు తినే పోటీలో పాల్గొన్నాడు. అక్కడ కరోలినా రీపర్ మిరపకాయ కూడా ఉంది. దాన్ని అతను పూర్తిగా నమిలేశాడు. దాంతో వికారం, తీవ్రమైన తలనొప్పి రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మిరప తిన్నప్పుడు వచ్చిన తలనొప్పితో పాటు మెడనొప్పి కూడా కొన్ని రోజుల పాటు కొనసాగిందట. మిరపకాయలు తిని ఆసుపత్రి పాలైన సంఘటనలో మొదటి కేసు ఇదేనని బీఎంజే కేస్ రిపోర్ట్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. 3్థండర్‌క్లాప్2 అని పేర్కొనే ఇలాంటి తీవ్రమైన తలపోటు వల్ల వాంతి వచ్చినట్లుగా ఉండటంతో పాటు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కుంచించుకుపోతాయి. వైద్యపరిభాషలో దీనిని 3రివర్సబుల్ సెరిబ్రల్ వాసోకన్‌స్ట్రిక్షన్ సిండ్రోమ్2 అంటారు.. వెంటనే ఆసుపత్రి పాలయ్యాడు. ఈ మిరపకాయ తిన్న వ్యక్తి కూడా ఈ సిండ్రోమ్‌తోనే ఆసుపత్రిలో చేరాడు. ఇతనికి వివిధ న్యూరలాజికల్ పరీక్షలు, సీటీ స్కాన్ నిర్వహించగా, మెదడులోని పలు రక్తనాళాలు కుంచించుకుపోయినట్లు తేలింది. అయితే మిరపకాయ తినడం వల్ల ఈ వ్యక్తిలో కలిగిన మార్పులు వాటికవే మెల్లగా తగ్గిపోయాయి. ఐదువారాల తర్వాత తీసిన సీటీ స్కాన్‌లో అతని రక్తనాళాలు సాధారణ స్థితికి చేరినట్లు తేలింది. డెట్రాయిట్‌లోని హెన్రీఫోర్డ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కులోతుంగన్ గుణశేఖరన్ ఈ మిరపకాయను తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మిరపకాయను తిన్న సందర్భంలో తలనొప్పి వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు.