S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కళాకారులు కారణజన్ములే...

ఆట, పాట మాటల కలయికే సంగీతం. ప్రపంచ జనాభా కోట్లలో వుండచ్చుగాక కానీ ఈ మూడింటిలోనూ ప్రజ్ఞ చాలా కొద్దిమందికే లభించే భగవంతుని వరం.
నాదోపాసనలో సగుణ సాక్షాత్కారాన్ని దర్శించిన మహాత్ములున్నారు. వారు తమ మనోభీష్ట రూపాలను దర్శించారు. ఆట పాటలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్లున్నారు.
అగోచర సృష్టిలో ఒక్కో ధ్వని తరంగం ఒక్కో ప్రత్యేక రూపాన్ని కలిగి వుంటుంది. స్వరం ఒక ధ్వని విశేషమే. అందుకే సంగీతంలో ఒక్కో స్వరానికి, ప్రతి రాగానికీ ఒక్కొక్క రూపాన్ని నిర్ణయించారు.
ఆ రాగాలను క్రమబద్ధంగా పాడితే, అలా పాడటం వల్ల ఏర్పడిన శబ్ద తరంగాలు ఆ రాగానికి నిర్ధారించిన మూర్తి చిత్రాన్ని చిత్రించగలవు. త్యాగరాజు ఆఖరి రోజులలో పాడిపాడి అలసిపోయి, ‘పరితాపము గని యాడిన పలుకులు - మరచితివో రామా!’ అనే కీర్తన ‘నన్ను యింకో పది పూటలలో కరుణిస్తావన్న సంగతి మరచిపోయావా? రామా!’ అనే భావాన్ని ఆవేదనతో ఈ రాగంలో, ఎంతో ఆర్తిగా ఆవిష్కరించారు. వాక్కుతో సమానంగా సంగీతం సృష్టి చేయగలిగిన త్యాగయ్య, మనసు కదిలించి కరగించేలా ఈ మనోహరి రాగంలో ఆయన వ్యక్తిగత అనుభూతిని కరిగిపోయేలా గానం చేసి ఉంటారు. చుట్టూ వున్న ఆత్మీయులైన శిష్యులు మాత్రమే అది గ్రహించగలిగారు. ఆయన గానం తిన్నగా నాదస్వరూపుడైన పరమాత్మకు చేరింది. ఆయన మనసు కరిగిపోయింది. వాత్సల్యం పొంగి పొరలింది. ‘ప్రాణానల సంయోగంతో పుట్టిన ప్రణవ నాదం తిన్నగా ఎవరికి వినబడాలో వాడికే వినిపించింది. త్యాగయ్యకు మోక్ష ద్వారాలు తెరుచుకున్నాయి. ఏ కళాకారుడి జీవితంలోనైనా సాధించి తెచ్చుకోవలసిన ఉత్తమ స్థితి ఇదే. కానీ అందరికీ లభ్యం కాదు. కాశీలో ‘విశుద్ధానంద’ అనే ఓ సాధువుండేవాడు.
నాదం, ధ్వని తరంగాల మీద ఎన్నో ప్రయోగాలు చేశాడు.
ధ్వని తరంగాలను బాగా ప్రతిధ్వనించే ఏర్పాటు చేయగలిగితే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఒక నిర్ణయానికి వచ్చాడు. మొదటిసారి బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి మన మందిరాలను చూసి, ‘మనం ఆరోగ్య సూత్రాలేమీ పాటించని అనాగరికులమనీ, ఈలాంటి మందిరాలు అనారోగ్య హేతువులనీ, గాలి, వెలుతురు లేని అపరిశుభ్ర వాతావరణం’ అనీ విమర్శించారు.
మన పూర్వీకులు మేధావులన్న సంగతి వారు గ్రహించలేక పోయారు.
దక్షిణాదిలో ఏ దేవాలయమైనా చూడండి. విశాలంగా వుండి పైన గోళాకారంగా వుంటుంది. దీనికి కారణం ‘నాదోపాసనే...’ మందిరాలలో పైన గోళాకారంగా ఉండే గోపురాలు ఆకాశాన్ని పోలి వుంటాయి.
ఆకాశం ఆకారం కూడా గోళంలాగానే వుంటుంది. ఈ అనంతాకాశంలో నిలబడి చిన్నకంఠంతో గానం చేస్తే అది ప్రతిధ్వనించదు. దానికి సరిపోయే కోట్ల మెగావాట్ల శక్తితో శబ్ద తరంగాలను సృష్టించగల ఆంప్లిఫ్లయర్‌లు మన దగ్గర లేవుగా? అందుకే ఒక వ్యక్తి స్వరశక్తి ప్రతిధ్వనించడానికి సరిపోయే ఆకాశాన్ని మందిర రూపంలో నిర్మించవలసి వచ్చింది.
అక్కడ కూర్చుని ‘నాదోపాసన’ చేస్తే శబ్ద తరంగాలు బయటకు వెళ్లే అవకాశం లేక, పైకి వెళ్లిన తరంగాలు తిరిగి మళ్లీ ఆ వ్యక్తి వద్దకే వచ్చి చేరతాయి. నాలుగు వైపులలో వాయు పీడనం జరిగితే ఎలా వాయుగుండం ఏర్పడుతుందో, అలాగే గాయకుని చుట్టూ ఆ నాదం వర్తులాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే ప్రణవాకార ఓంకార నాదం’.
పద్మాసనంలో కూర్చుని పిడికిలి బిగించి కూర్చుని ఓంకారోచ్చారణ చేస్తే, ఆ సాధకుడి చుట్టూ మాత్రమే కాదు అతడిలో కూడా నాదవర్తులం ఏర్పడుతుంది. మగవారి (మనిషి) శరీరంలో ఎడమవైపు స్ర్తిత్వం కలిగి ఉంటుంది. ఎడమ, కుడి పరస్పరం కలిస్తే, ధన, ఋణ విద్యుత్ శక్తికి బల్బు వెలిగినట్లు, చేతనత్వం పొందుతుంది. ఇదే మాటను వివేకానందుడు చెవిని ఇల్లు కట్టుకుని చెప్పీచెప్పీ విసుగెత్తి పోయాడు. కాని ఆయన చెప్పింది, అక్షరాలా నిజం. మనిషిలో అంతర్గతమైన శక్తికి ఎంతటి ప్రభావం వుందో తెలియాలంటే ప్రపంచాన్ని ఉర్రూతలూపిన ‘పాప్‌స్టార్’ మైఖేల్ జాక్సన్’ మనకో ఉదాహరణ. ఆడా, మగా అర్థంపర్థం లేకుండా సినిమాల్లో కుప్పిగంతులు వేస్తూ ఒళ్లంతా హూనం చేసుకునే నటవర్గం ఆయాసపడుతూ ఎంత తపస్సు చేసినా జాక్సన్‌లు కాలేరు. అతడిది అదో ప్రజ్ఞ.
బక్క పల్చగా ఉండే ఆ మనిషి చేసే విన్యాసాలకు గుండెలు బరువెక్కిపోయి, తెల్లబోయి కళ్లప్పచెప్పిన వేలాది, లక్షలాది అభిమానులే దీనికి సాక్ష్యం.
వెనె్నముక జీవ సంవిధాన సూత్రాన్ని మనం అర్థం చేసుకున్న విధానంపై ఒక సవాలు విసిరిన మైఖేల్ జాక్సన్‌పై 1987 సం.లో ఒక సరికొత్త సంగీతపు వీడియో ఒకటి విడుదల చేశారు. దాని పేరు ‘ఒ్యౄఆ్ద షూజౄజశ్ఘ’. అందులో జాక్సన్ నర్తన విన్యాసం ఒకటి ప్రదర్శించాడు. అది చూసిన అభిమానులు భయంతో వణికిపోయారు. తన వెనె్నముకను నిట్టనిలువునా వుంచి 45 డిగ్రీలు ముందుకు వంగుతాడు. క్రిందకు పడకుండా ఉంచగలిగేది అతడి పాదాలు మాత్రమే. (బొమ్మ)
ఏదో మాయ చేశారేమో అనుకున్నారు చాలామంది. కానీ ఈ చంద్ర గమనుడు (మూన్ వాకర్) చేసిన అదే ముద్రను ప్రపంచమంతటా అందరూ దిగ్భ్రాంతికి లోనై చూశారు. సరిగ్గా గమనిస్తే మానవ శరీరం నిటారుగా నిలుచున్న స్థితిలో గరిమనాభి వెనె్నముకకు చెందిన రెండవ త్రికాస్థి ముందు భాగానుంటుంది. మనం నిటారుగా వంగినప్పుడు తుంటె ఎముకల కీళ్లు గరిమనాభి స్థానంలో వున్నప్పుడు వెనె్నముక పక్కన వుండే కండరాలు తీగల్లా పనిచేసి వంగిన వెనె్నముక భాగానికి దన్నుగా నిలిచి శరీరం ముందుకు పడిపోకుండా కాపుకాస్తుంది.
అయితే ఆధార స్థానం ముందుకు వంగినప్పుడు చీలమండ వద్దకు జరిగితే నిలువుగా వుండే వెనె్నముక గరిమనాభిని పట్టి వుంచే శక్తి కాస్తా కోల్పోతుంది. నొప్పి కాలి పిక్క కండరాలకు చేరుకుంటుంది. (బొమ్మ-2)
మీరు మైఖేల్ జాక్సన్ కాకపోతే చీలమండల నుండి నిటారుగా వంగటం పరిమితమైన డిగ్రీల వరకే సాధ్యపడుతుంది.
ఎంతో తర్ఫీదు పొందిన శరీర సౌష్టవం కలిగిన నర్తకులు కూడా ఇటువంటి ముద్రను ప్రదర్శించేటప్పుడు కేవలం 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల కోణంలో మాత్రమే ముందుకు వంగగలుగుతారు.
కానీ జాక్సన్ ఏకంగా 45 డిగ్రీలు వంగి అటువంటి విన్యాసం చేశాడు. ఇది చాలా అసాధ్యం.
అనుకరించిన చాలామంది విఫలులైయ్యారు. కొందరు గాయాల పాలయ్యారు కూడా.
ఈ విషయంలో జాక్సన్ శరీర ధర్మశాస్త్రానికీ, భౌతిక శాస్త్రానికీ మధ్యగల బంధాన్ని తెంపేశాడు. ఒక హక్కుగా తన పేరుతో నమోదైన ఈ ప్రక్రియ ఒక తెలివైన ఆవిష్కరణగా రూపొందింది. దీని కోసం మైఖేల్ ఒక ప్రత్యేక తరహా బూట్లు రూపొందించాడు.
ఆ బూట్ల మడమల భాగంలో ఓ చీలిక ఉంటుంది. సరైన సమయంలో అది వేదిక మీదికి పొడుచుకు వచ్చే మేకు వంటిది ఆ చీలికలోకి దూరుతుంది.
ఆ చీలిక త్రిభుజాకారంలో ఉంటుంది.
అలా శారీరక పరిమితులకు మించి ముందుకు వంగే విధంగా నర్తించే వారికి తగిన అవకాశాన్ని కల్పిస్తుంది.
అది టక్కుటమార విద్య అయినా కాకున్నా, ఒక సరికొత్త నృత్య రూపాయలు, ఎంజె స్ఫూర్తితో ఆవిర్భవించి వెనె్నముక దెబ్బతినే విషయంలో మన అవగాహనకు సంబంధించిన తీరుతెన్నులపై ఒక సవాలుగా నిలుస్తాయి. న్యూరో సర్జన్లకు అంతుపట్టని విషయాలు జాక్సన్ వల్ల బహిర్గతమై ప్రశ్నార్థకంగా నిలిచాయి.
ఎంజె ధర్మమాయని ప్రపంచవ్యాప్తంగా నర్తకులు ఎక్కువ ఎత్తుకు ఎగిరేందుకు ఎక్కువ దూరం శరీర భాగాలను సాగదీసేందుకు గిరుక్కున తిరగటంలో, వేగాన్ని పెంచడం వంటి విషయాల్లో ఇది వరకటి కంటే ముందుకు సాగుతున్నారు.
కానీ అలా ప్రదర్శించే సమయంలో వెనె్నముకపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవంగా అటువంటి విన్యాసాలు పొసగనివి కూడా. ఒకటి మాత్రం నిజం. పాప్ సంగీత రాజు కనుగొంటూ తెచ్చిన మార్పులే ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులలో ఉత్సాహాన్ని నింపాయి. జనాభా లెక్కల కోసం జన్మించే వాళ్లు వేరు. కారణ జన్ములైన కళాకారులే అరుదుగా పుడతారు.

- మల్లాది సూరిబాబు 90527 65490