కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ
Published Saturday, 8 December 2018కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పేరు వినగానే జంతువులకు కూడా హావభావాలు ఉంటాయా? అనిపించింది కదూ.. మనుషులకు ఉన్నట్లు జంతువులకు హావభావాలు లేకపోయినా.. కొన్ని సందర్భాల్లో వాటి హావభావాలు నవరసాలను పోలి ఉంటాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఫొటోలు క్లిక్‌మనిపిస్తే ఆ ఫొటోలు అద్భుతంగా ఉంటాయి కదూ.. అలాంటి ఫొటోల్లో కొన్నింటిని 2018 కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పోటీలకు ఎన్నికయ్యాయి. అందులో షాక్ గురైనట్లున్న ఉడుత ఫొటో మొదటి బహుమతిని సంపాదించుకుంది. మెరీమెక్ గోవాన్ తీసిన ఈ ఫొటో మొదటి అవార్డుతో పాటు పీపుల్స్ చాయిస్ అవార్డు, క్రీచర్స్ ఆఫ్ ద ల్యాండ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
* ఎంతటి చతురులైనా సముద్రంలోని షార్క్‌ను నవ్వించగలరా? అంత పెద్ద జీవిని నవ్వించాలంటే ఎంత పెద్ద జోక్ వేయాలి.. కానీ తానియా హోప్పర్మాన్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఏం మాయ చేశాడో, లేక నిజంగా ఎలాంటి జోక్ వేసి ఆ షార్క్‌ను నవ్వించాడో తెలియదు కానీ సముద్రంలోని బ్లూషార్క్ నవ్వుతున్నట్లు ఫొటో తీశాడు. 3అండర్ ద సీ2 కేటగిరీలో ఈ ఫొటోకు ప్రైజ్ వచ్చింది.
* పిల్లలతో ఆడుకుంటున్నట్లు కనిపించే ఈ గుడ్లగూబను షేక్కీనా అనే వ్యక్తి ఫొటో తీశాడు. ఈ ఫొటోకు 3క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్2 ప్రైజ్ వచ్చింది.
* భారతదేశానికి చెందిన ఆర్ష్‌దీప్ సింగ్ తీసిన 3ఆశ్చర్యంగా చూసే గుడ్లగూబ2 ఫొటోకు జూనియర్ అవార్డు వచ్చింది.
* ఫిన్లాండ్కు చెందిన ఎలుగుబంటి కుటుంబాన్ని వాల్టేరీ మల్కాహేనెన్ అనే ఫొటోగ్రాఫర్ ఫొటో తీశాడు. ఎలుగుబంటి కుటుంబంలోని మూడు ఎలుగుబంటి పిల్లలు చెట్టెక్కి అమాయకంగా కిందకు చూస్తున్న ఫొటో 3అమేజింగ్ ఇంటర్నెట్ పోరిఫోలియో2 విభాగంలో అవార్డు గెలుచుకుంది.
* ఖడ్గమృగానికి నెమలి పింఛం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే విచిత్రంగా ఉంది కదూ.. కానీ భారత్‌లోని గోరుమరా నేషనల్ పార్క్‌లోని ఓ ఖడ్గమృగం ఇలా కనిపించింది. కాదు కాదు.. అలా ఫొటో తీశాడు ఫొటోగ్రాఫర్.
* విసిగివేసారి, తల పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఈ ఎలుగుబంటి ఫొటోను డేనియెల్ డీ ఎర్మో తీశాడు.
* ఫొటోగ్రఫీ ప్రొఫెషన్ని ఎంచుకున్న ఎలుగుబంటి భలే బాగుంది కదూ.. కెమెరా కళ్లలోంచి అచ్చు ఫొటోగ్రాఫర్ చూస్తున్నట్లు చూస్తోంది. ఈ ఫొటోను రోయ్గ్యాలిడ్జ్ అనే వ్యక్తి తీశాడు.
* పూల తీగలపై ఊయలలూగుతోంది ఈ బుడత ఉడుత. గీర్ట్వెగన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను తీశాడు.
* ప్రేయసీప్రియులను తలపించేలా ఉన్న ఈ కౌగిలింత.. సూపర్ కదూ.. ఈ ఫొటోను సర్గేయ్ సావీ తీశాడు.
* హీరోలు, విలన్లు ఫైటింగ్ చేసుకుంటున్నట్లుగా ఉంది కదూ ఈ ఫొటో చూస్తుంటే.. ఇక్కడ మాత్రం డూపులు లేరు సుమా.. ఈ ఫొటోను కూడా సర్గేయ్ సావీ తీశాడు.