S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాగ్రత్తగా వండితే గోంగూర మంచిదే!

ఫ్రశ్న: గోంగూర తినకూడని ఆహార పదార్థమా? ఏ జబ్బు వచ్చినా గోంగూరని మానేయమంటారెందుకని? గోంగూర వలన లాభ నష్టాలను వివరించగలరు.
-జలసూత్రం రామాయణిం (ఒంగోలు)
జ: గోంగూరని ఎంత ఇష్టపడతారో చాలామంది. దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దానికి గల అతి పులుపే దాని ప్రతిష్ఠకీ, అప్రతిష్ఠకీ కూడా కారణం అవుతోంది.
మనం రోజువారీ ఆహార పదార్థాలలో చింతపండు అధికంగా కలపటం వలన గోంగూర పులుపు అదనం అవుతుంది. కడుపులో యాసిడ్ మరింతగా పెరుగుతుంది. దాంతో ‘పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకున్నాను. అంతే.. కాళ్లూ చేతులూ పట్టేశాయి’ అంటుంటారు చాలామంది. ఇతర పులుపు పదార్థాల వాడకాన్ని పరిమితం చేసుకోగలిగితే గోంగూరని అప్పుడప్పుడూ తిన్నా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చని దీని భావం.
మన పూర్వీకులు గానీ, ఇతర రాష్ట్రాల వారు గానీ మనం తింటున్నంత వెర్రిపులుపు తినరు. అతిగా చింతపండు వాడకం వలన మనం మనకు తెలీకుండా చాలా అనర్థాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. వైద్యశాస్త్రంలో అపాయకరమైన రసాయనాలు గోంగూరలో ఉన్నట్టుగా చెప్పలేదు. పడకపోవటం గోంగూరు జన్మతః వచ్చిన గుణమో లేక స్వభావమో ఎంత మాత్రమూ కాదు. దాన్ని వండే తీరులోనే మనం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. గోంగూర ఏ పాపం చేసుకునీ పుట్టలేదనీ, అది జబ్బు మొక్క అనే ముద్ర వేయటం తగదనీ గుర్తించాలి.
గోంగూరకు 4వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆఫ్రికా దీని పుట్టిల్లు. భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో గోంగూర గురించి వివరాలు లేకపోవటాన, దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిద్ధి కాకపోవటాన ఇది భారతదేశంలో మరీ ప్రాచీన శాకం కాకపోవచ్చని భావిస్తున్నారు.
అయితే, గోంగూరకు అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే సంస్కృత పర్యాయ నామాలున్నాయి. కర్ణికార పుష్పము అంటే కొండగోంగూర పువ్వు. అభిమన్యుడి రథం మీద ఎగిరే జెండా ఈ గుర్తు కలిగి ఉంటుందట! మూలభారతం భీష్మ పర్వం (6.26,27)లో శివుడు కర్ణికార పుష్పమాలను ధరించాడని ఉంది. కర్ణికార వనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు కూడా మూలభారతంలో ఉంది.
పాల్కురికి సోమనాథుడు ‘కుంచంబు గొండగోగులఁ బూజసేసి’ అంటూ శివపూజ చేయనిదే ముద్ద ముట్టకూడదనే నియమం కలిగిన ఒక వర్తకుడు, బోర్లించిన కుంచాన్ని శివలింగంగా భావించి కొండగోగు పూలతో పూజ చేసిన కథలో వర్ణించాడు.
పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబం లాంటి పద్మంలో కేసరాలుండే కర్ణికలాగా ఉంటుంది గోంగూర పువ్వు. మందారం, బెండ, తుత్తురబెండ, గోంగూర ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు. గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను అలంకరించటం సంప్రదాయం. గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చీ గుమ్మడి - లాంటి జానపద గేయాలలో కూడా గోంగూర పూల గురించే ఉంది గానీ ఆకు గురించి కనిపించదు. అంటే, మొదట్లో తెలుగు ప్రజలకు గోంగూర మొక్క పూలమొక్కే గానీ, కూర మొక్క కాకపోవచ్చని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. బ్రిటీషు యుగంలో మిరపకాయల రాక తరువాత పులుపు వాడకానికి తెలుగువారు ఎక్కువగా లోనుకావటం మొదలుపెట్టారు. అలా గోంగూర ఆకు కూడా వంటగదిలోకి చేరింది. ‘గోను మొక్క ఆకుని గోనుగూర, గోంగూర, గోఁగూర అంటారు. గోఁగు మొక్క, గోఁగాకు అనే పేర్లు కూడా వాడకంలో ఉన్నాయి. గోంగూరతో కూర, పప్పు, పులుసు, పచ్చడి, ఊరుగాయ పచ్చడి ఇంకా ఇతర వంటకాలు అనేకం చేస్తుంటారు. మాంసంతోపాటుగా గోంగూరనీ కలిపి వండుతుంటారు కూడా!
గోంగూరను అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, కెనాఫ్ అని పిలుస్తారు. ళషర్ఘీశళళ దళౄఔ అనే పేరుతో కూడా కొన్ని దేశాల్లో పిలుస్తారు. తెలుగు ప్రజలతో ఈ మొక్కకు అనుబంధం ఉందన్న సంగతి ప్రపంచాని కంతటికీ తెలుసు. మనం గోంగూర పచ్చడి చేసుకుంటే యూరోపియన్లు ళశ్ఘచి ఔళఒఆ్య తయారుచేసుకుంటారు. ఇంచుమించు రెండూ ఒకటే!
మొదటగా గోంగూరని నీళ్లలో ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి తయారుచేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకరంగా ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలిగించని వాటితో మాత్రమే గోంగూరను తయారుచేసుకోవాలి. తగినంత మిరియాల పొడి, ధనియాల పొడి కలిపి వండితే ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ఉంటుంది. రుచిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కానీ గోంగూరలో చింతపండు రసం పోసి, పులిహోర గోంగూర పేరుతో మరింత పుల్లగా గోంగూర ఊరుగాయలు వగైరా పెడుతుంటారు మనవాళ్లు. ఇదే ప్రధానంగా అపకారం చేయటానికి కారణం.
శుద్ధ గోంగూరని ధనియాల పొడితో కలిపి వండుకుంటే, చక్కని ఆకలిని కలిగిస్తుంది. లివర్ వ్యాధుల్లో మేలు చేస్తుంది. రేచీకటితో బాధపడే వారికి చూపు పెంచుతుంది. మలబద్ధకం పోగొడుతుంది. వీర్యవృద్ధీ, లైంగిక శక్తీ, లైంగిక ఆసక్తీ పెంపొందింప చేస్తుంది. ఉడికించిన గోంగూరకు ముద్దని కడితే సెనగడ్డలు మెత్తపడి త్వరగా పక్వానికొస్తాయి. రక్తం గూడు కట్టిన కౌకు దెబ్బలు తగిలిన చోట దీనితో కట్టుగడితే వాపు అణిగిపోతుంది. దేశవాళీ గోంగూర ఆకుల్లో ఉండే ఇనుము రక్తహీనతకు జవాబునిస్తుంది. కొండగోగు మొక్కల్ని వ్రేళ్లతో సహా పీక్కొచ్చి అమ్ముతారు. మనం ఆకుల్ని వలుచుకొని మొక్కని అవతల పారేస్తాం. అలా పారేయకుండా దాని వేళ్లను దంచి, చిక్కని కషాయం కాచుకొని పంచదార కలుపుకొని తాగవచ్చు. కొత్తిమీర కట్ట కొన్నప్పుడు వేళ్లతో సహానే అమ్ముతుంటారు. ఆ వేళ్లు కూడా దీనితో కలిపి టీలాగా కాచుకుంటే వేసవి కాలంలో వడదెబ్బ కొట్టనీయని పానీయంగా ఉపయోగపడుతుంది.
గోనుమొక్క నారని పురిపెట్టి పురికొస తీస్తారు. దానితో నేసిన పట్టాని ‘గోనుపట్టా’ అనీ, సంచీని ‘గోను సంచీ’ అనీ పిలుస్తారు. గోతాము పదం కూడా గోనుకు సంబంధించినదే కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, ఎద్దుల బండి మీద అడ్డంగా వేస్తారు కాబట్టి ‘గోతాము’ అనే పేరు వచ్చిందని కొందరు చెప్తారు. కానీ, వౌలికంగా ఇది గోను శబ్దానికి సంబంధించిన పదం. గోవు ఎంత ముఖ్యమో, గోను కూడా అంతే ముఖ్యం.. సద్వినియోగపరచుకొనే తెలివి ఉండాలి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com