S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదాకు జగన్ వెన్నుపోటు

విజయవాడ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని, ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని అటువంటి ప్రత్యేక హోదాకు జగన్ వెన్నుపోటు పొడవడం గర్హనీయమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రరత్నభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని, ఇది ముగిసిన అధ్యాయమని ఖరాఖండిగా చెప్పిందని, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఇదే చెప్పిందని, అటువంటి బీజేపీని జగన్ పల్లెత్తుమాట అనకపోవడమే కాకుండా, అదే బీజేపీతో లాలూచీ సంబంధం పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం జగన్‌కు ఇష్టం లేదని దీనిని బట్టి తెలుస్తోందని తులసిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అనేది మిథ్య అని, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఫెడరల్ ఫ్రంట్‌కు రంగు, రుచి, రూపు, వాసన లేవని, ఏ పార్టీలు చేరుతాయి. చైర్మన్ ఎవరు, కన్వీనర్ ఎవరు, అజెండా ఏమిటి అన్న విషయాలపై స్పష్టత లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అని చెబుతున్న కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్‌ఎస్ ప్రత్యేక హోదాకు సైంధవునిలా అడ్డుపడుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడితే, అది చర్చకు రాకుండా కొన్నాళ్ల పాటు టీఆర్‌ఎస్ అడ్డుపడిందని, చివరకు చర్చ జరిగి ఓటింగ్ జరగగా టీఆర్‌ఎస్ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదన్నారు. అటువంటి టీఆర్‌ఎస్ పార్టీతో జగన్ పార్టీ చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడం శోచనీయమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేస్కోవడం విడ్డూరమని తులసీరెడ్డి అన్నారు.