S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆర్టీసీ యాజమాన్యం, యూనియన్ చర్చల్లో ప్రతిష్టంభన

విజయవాడ(సిటీ), జనవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాల సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్న యూనియన్ నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించలేదు. వేతన సవరణలో 20 శాతం మాత్రమే ఫిట్‌మెంట్ ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా యూనియన్ నేతలు అగీకరించలేదు. మరోసారి దీనిపై చర్చించేందుకు ఈనెల 22న సమావేశం కావాలని ఇరుపక్షాల ప్రతినిధులు నిర్ణయించారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు యూనియన ఈయూ నాయకులు, ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు నేతృత్వంలోని వేతన సవరణ కమిటీ సమావేశం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమకు తగ్గ్ఫలితాన్ని లెక్కగట్టి 50 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని యూనియన్ నేతలు పట్టుబట్టారు. ఫిట్‌మెంట్ ఇవ్వకపోతే సమ్మెకు వెనుకాడేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడటంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇంతవరకు చర్చల ద్వారా అంగీకరించిన కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెలాఖరు నుండి ప్రారంభిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. వీటితోపాటు కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వెంటనే చేస్తామని, డిజెంగేజ్‌లో ఉన్నవారిని ఉన్న ఖాళీలలో తీసుకుంటామని అంగీకరించారు. అంతే కాకుండా 2016 లీవ్ ఎన్‌కేష్‌మెంటును ఈనెల 24న చెల్లించేందుకు అంగీకరించారు. శనివారం అన్ని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, ఇప్పటి వరకు జరిగిన విషయాలను, యాజమాన్యం వైఖరి తదితర అంశాలపై చర్చించి అవసరమైతే ఐక్య ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తామని ఈయూ నేత దామోదరరావు తెలిపారు.
శుక్రవారం జరిగిన చర్చల్లో యాజమాన్యం తరుపున ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ సురేంద్రబాబు, ఇడీలు కోటేశ్వరరావు, జయరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, రాఘవరెడ్డిలు, ఈయూ నేతలు వైవి రావు, పలిశెట్టి దామోదరరావు, యం హనుమంతరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.