S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రూమింగ్ (సండేగీత)

ఉదయం లేవగానే చా లామంది అద్దంలో తమ మొఖం చూసుకుంటారు. అద్దం కన్పిస్తే తమని తాము చూసుకుంటూ మురిసిపోతారు. దువ్వెన తీసి అద్దంలో తమని తాము చూసుకుంటూ దువ్వుకుంటారు. సినిమా థియేటర్లలోని వాష్‌రూంల్లో కూడా చాలామంది ఈ విధంగానే చేస్తూంటారు. లిఫ్ట్‌ల్లో కూడా ఇదే పరిస్థితి. అప్పుడు ఒక్కరే ఉంటే చాలు. తమని తాము చూస్తూ సరిదిద్దుకుంటూ వుంటారు.
దువ్వుకుంటారు.
ఆడవాళ్లు అయితే తమ మేకప్‌ని సరిదిద్దుకుంటారు.
ప్రతి వ్యక్తి - ఆడవాళ్లైనా మగవాళ్లైనా తమని తాము గ్రూమింగ్ (సమ్మార్జనం) చేసుకోవడానికి రోజులో ఓ అరగంటైనా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు.
మంచిదే!
పరిశుభ్రంగా కన్పించడం తమకే కాదు - ఎదుటి వాళ్లకి కూడా అవసరమే!
మనకి మాత్రమే అవసరమైన గ్రూమింగ్ కూడా ఉంటుంది. చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మనకు కన్పించని మన హృదయాన్ని, ఆత్మని, మనస్సుని, మెదడుని గ్రూమింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఈ గ్రూమింగ్ వల్ల మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులని ఆహ్లాదంగా ఉంచే స్థితి కూడా మనకు కలుగుతుంది.
ఈ గ్రూమింగ్ వల్ల ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది. అలా ఏర్పడటానికి మంచి మాటలనో, పాటలనో ఉదయానే్న వినడం కూడా చాలా అవసరం.
అవి మన మనస్సులో గింగురుమంటూ వుంటే ఆ రోజూ బాగా గడుస్తుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001