S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఊరంతా రంగస్థలమే!

వీధుల్లో భారీ రథంపై కంస మహారాజు ఊరేగింపు.. నదీ తీరాన గోపికల నడుమ శ్రీకృష్ణుడి లీలలు.. మరో కూడలిలో వేదికపై కంస-కృష్ణుల పోరాట దృశ్యాలు.. ఇంకో చోట శ్రీకృష్ణుడి చేతిలో కంసుడి వధ.. రాక్షస పాలన విరగడైనందుకు జనం కేరింతలు.. ఈ దృశ్యాలు పదకొండు రోజుల పాటు అక్కడి ప్రజలను విశేషంగా అలరిస్తాయి.. ‘మహాభారతం’లోని శ్రీకృష్ణుడి బాల్యం, కంసుడి వధను కళ్లకు కట్టినట్టు చూపేందుకు ఏడాదికోసారి ఆ ఊరంతా ఆరుబయలు రంగస్థలం అవుతుంది. ‘చెడుపై మంచికి లభించిన విజయాని’కి గుర్తుగా ఒడిశాలోని బార్గ్ఢ్ పట్టణంలో ఏటా జనవరిలో నిర్వహించే ‘్ధను జాతర’లో మహాభారతంలోని ఘట్టాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. ఈ జాతర సందర్భంగా పదకొండు రోజుల పాటు బార్గ్ఢ్ పట్టణాన్ని ‘మధుర’ (శ్రీకృష్ణుడి జన్మస్థలం) గాను, శివారు గ్రామమైన ఆమపాళిని ‘గోపపుర’గాను స్థానికులు పిలుస్తారు. బార్గ్ఢ్ వద్ద నదిని ‘యమున’గా వ్యవహరిస్తారు.
జాతర సందర్భంగా అన్ని వీధుల్లో, కూడళ్లలో, నదీ తీరంలో శ్రీకృష్ణుడి బాల్యాన్ని వివరించే పలు ఘట్టాలను ప్రదర్శిస్తారు. ఈ జాతరలో స్థానికులు మహాభారతంలోని వివిధ పాత్రలను పోషించి రక్తి కట్టిస్తారు. బార్గ్ఢ్‌లో తొలిసారిగా ఈ జాతరను 1948లో ప్రారంభించారు. కొనే్నళ్ల పాటు జాతర నిర్వహణకు ఆటంకాలు ఏర్పడినా, 2009 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ బార్గ్ఢ్ వాసులు తమ ఊరిని ఆరుబలం రంగస్థలంగా మార్చి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గోపపుర, మధుర, యుమునా తీరం, కంసుడి దర్బార్ వంటి ప్రాంతాలు తమ ఊరిలోనే ఉన్నట్టు బార్గ్ఢ్ వాసులు భావించి, సహజత్వాన్ని ప్రతిబింబించేలా మహాభారత ఘట్టాలను ప్రదర్శిస్తారు. గోపికలతో కలసి శ్రీకృష్ణుడి నృత్యాలు, కంస- శ్రీకృష్ణుల పోరాటం, వసుదేవుడు- దేవకి దంపతులకు కారాగార విముక్తి, కంసుడి మరణం.. వంటి దృశ్యాలను చూసి స్థానికులు కేరింతలు కొడతారు.
చెడును విసర్జించి, మంచిని గ్రహించేందుకు పురాణగాథలకు ఇలా తాము ప్రచారం చేస్తున్నట్లు బార్గ్ఢ్ వాసులు చెబుతుంటారు. సాంస్కతిక ప్రదర్శనల్లో ఊరు ఊరంతా పాల్గొనడమే కాదు, ఈ జాతరను పురస్కరించుకొని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలను, బహుమతులను అందజేస్తున్నారు. చిన్నారుల్లో కళానైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ‘ధను జాతర’ దోహదం చేస్తుందంటున్నారు. అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దక్కడంతో ధను జాతరను బార్గ్ఢ్ ప్రజలు ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సమకాలీన పరిస్థితులను తెలిపే సన్నివేశాలు కూడా ఈ ప్రదర్శనల్లో చూపెడుతుంటారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులు, రాజకీయ నేతలను ఎలా శిక్షించాలన్నది వివిధ పాత్రధారుల ద్వారా చెప్పిస్తుంటారు. ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ’ పాలకుల బాధ్యత అని కళారూపాల ద్వారా గుర్తుచేయడం ‘్ధను జాతర’లో మరో విశేషం. ఈనెల 11న ప్రారంభమైన ఈ జాతరకు ఎప్పటిలాగే వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో హాజరై మహాభారత ఘట్టాలను తిలకించారు.
*