S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమా.. ప్రేమా..

నీ చిరునామా...
ఎదలో రూపం ఒదగదె పాపం
తొలి వలపెంతో అపురూపం
మొగ్గగ మొదలై సిగ్గుల కళలై
విరిసిందెపుడో ప్రణయం
మురిసిందెపుడో హృదయం
చూపు చూపు కలిశాక
మనసు మనసు వలచాక
రెప్పలార్చితె వలలౌతుంది
దిక్కులెతికితె తలలౌతుంది
కలల అలలపై కళల పానుపై
కరిగేదెపుడో ప్రణయం
అణిగేదెపుడో సమరం
ఎదలో కలిగితె ఏదో ఆశ
ఎదురుగ అతనె నిలిచిన ధ్యాస
కనె్న ఎదలో అలజడి కనుల కలల ఒరవడి
ఏం చేయను...
ఎలా ఆపను..
ఏ దారని వెతకను..
ఆ కొసల ఈ కొసల కనుకొలనుల
రస హృదయాల కదిలె ప్రియ కథనాల
పలు వరసల బిగువున దాచిన
పెదవుల విరిసిన హసనాల
ఆ కళ్ల కదలికల ఆ కళ్ల పదనిసల
ముందుకి మున్ముందుకి
పదమను రుసరుసల
మరుని శరాల రతి
అనురాగ సరాల
ఏం చేయను.. ఎలా ఆపను..
ఏ దారని వెతకను...

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505